ఛత్తీస్‌ఘడ్‌లో రుధిరదారలు
``మావోయిస్టు అంటే తీవ్ర వాదం, నిజానికి అవతలి వ్యక్తిని బెదరగొట్టడం కోసం చేసే బలప్రయోగం, నీతినిజాయితీలనే ముగుసులో అందంగా అలంకృతమైన తీవ్ర వాదం, భారతదేశానికి మావోయిజం అతిపెద్ద ముప్పు'' అని స్వయంగా దేశ ప్రధాని 2004 నవంబర్‌లో తొలిసారిగా ప్రకటించారు. ఒక మాలో చెప్పాలంటే దేశంలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. నిజంగా దేశ ప్రభుత్వానికి ఇది సిగ్గు చేటు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందితే ఇంతమంది దారిద్య్ర రేఖ దిగువున ఎందుకు ఉంటున్నారు? కొంత మంది ధనికులు తమ స్వార్ధం కోసం పేద ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ పథకాలను దోచుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే వారిని టెరర్రిస్టులు అని ముద్ర వేస్తున్నారు... ``దుర్భర దారిద్య్రమనే అంశం హింసాకాండకు వంక కారాదు, తీవ్రవాదానికి సమర్థింపు కారాదు, మావోయిజాన్నీ, మావోయిస్టులనూ పెంచిపోషిస్తున్న పరిస్థితులపై భారతదేశం యుద్దం ప్రకటించాల్సిన సమయం ఇది'' అని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి కళ్లముందు ఉన్న కఠోర వాస్తవాన్ని ఎందుకు గమనించడం లేదు. ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పని చేయకపోతే, వాటిని స్పష్టంగా పేర్కొని, సిగ్గుపడాల్సిందే. అయితే ఒక మాట నిజం. ఈ యుద్దమనేది కేవలం తూటాలతో గెలిచేది కాదు. భారత్ అగ్రరాజ్యంగా అవతరించాలని నిజంగా అనుకుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు జనావాస ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అటు జన హృదయాలనూ గెలుచుకోవాలి. ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించలేని, సామాజిక న్యాయం అందించలేని అసమర్ధ ప్రభుత్వాలు పాలించినంత కాలం ఏదో రూపంలో హింస కొనసాగుతూ...నే ఉంటుంది. హింసను అణిచివేయడానికి ప్రతి హింస ఒక్కటే మార్గం కారాదు. సమస్యను పరిష్కరించడానికి కేవలం శాంతిభద్రతల కోణంలోనే కాకా ఆర్ధిక కోణంలోనూ దృష్టి సారించాలి. కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన జనవాసాలలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలి. ఎన్నో ఏళు్ళగా ఆర్ధిక అసమానతలతో అలసిపోయిన అమాయక ప్రజల హృదయాలలో ఈ విశ్వాసం పాదుకొల్పాలంటే ప్రభుత్వం తక్టణం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి మారు మూల ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలను మెరుగు పర్చాలి. నాగరిక ప్రపంచానికి, అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాలకు మధ్యనున్న తేడాలను తుడిచేయాలి. ప్రభుత్వం రూపొందించిన భారత్ నిర్మాణ్ లాంటి కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలి.
భారతదేశం ఎదుర్కొంవలసి ఉన్న అతి పెద్ద ఎకైక ఆంతరంగిక భద్రతా సమస్య నక్సలిజమే అని ప్రకటింస్తున్న ప్రధాన మంత్రి ముంబాయ్‌పై 2009 నవంబర్ 26న జరిగిన దాడులు, రాష్ట్రాల్లో జరుగుతున్న విద్రోహ చర్యలను, దేశ తీవ్రవాద నిరోధక యంత్రాంగంలో ఎందుకు శ్రద్ద చూపడం లేదు. తీవ్ర వాదులు కొన్న క్యాబ్‌స డ్రైవర్లుగా, వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉన్నత స్థాయి హోదలలో ఉన్నరని ఇంటెల్నిజెన్‌స రిపోర్టు తెలిపినా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? నక్సల్ ప్రాంతాలను తిరిగి అధీనంలోకి తెచ్చుకునే వారి ప్రాబల్యాన్ని నిరోధించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ ఆ ప్రాంతాలను అభివృద్ది, చేయూత కార్యక్రమాలు మాత్రం చేపట్టారు. క్షేత్ర స్థాయిలో నిఘా తక్కువే. నక్సల్‌సపై చూపుతున్న శ్రద్ద తీవ్రవాదులపై ఎందుకు చూపడంలేదు? నక్సల్‌సపై ఆపరేషన్ గ్రీన్‌హంట్ మైదలైన తరువాత తీవ్రవాదులు రాజ్య వ్యవస్థపై తమ దాడులకు వూ్యహం అధికమైనట్లు, దేశంలోని ప్రధాన పట్టణాలలో తీవ్ర వాదులు వివిధ ప్రైవేటు సంస్థలకు యాజమానులుగా ఉండి తమ వూ్యహం రచిస్తూన్నారని, వివిధ పత్రికల్లో ప్రచురిస్తున్న ఇంటలీజెన్‌స రిపోర్టులను బట్టి తెలుస్తున్నాయి.
ప్రభుత్వాలు తమ గొప్పలు చెప్పుకుంటున్నాయి. తము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్నాయి... మా ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలుగా అదుకుంటుందని చేబుతున్న ప్రభుత్వాలకు, పెద వారినిపై తమ సన్నిహితులు, బంధువులు చేసే అన్యాయం మాత్రం కనించదు. ఎవరైన పెదవారు తమ సన్నిహితులు మాకు అన్యాయం చేశారని విర్యాదు చేస్తే.... సన్నిహితులను కాపడుకోవడం కోసం అనేక దొడ్డ దారులు వెతికి తప్పులు కప్పి పుచ్చుకునేందుకు సతావిధాల ప్రయత్నాలు చేస్తారు. అనుచరులు, బంధువులు సన్నిహితులు చేసిన తప్పులు మాత్రం రహస్యంగా ఉంచి, వారిపై విర్యాదు చేసినందుకు పెదవాడిని అన్ని విధాలుగా అనగ దొక్కుతున్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపులు నేటి వరకు కాగితాలపైనే చూపుతున్నారు. ప్రజలకు తమ ఫలాలు అందించే విషయంలో మంచుగడ్డల వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అయస్కాంత గుణాలను ఎందుకు ప్రదర్శించడం లేదు?
``ఎవరో ఏదో పుస్తకం నుంచి వూ్యహాన్ని సేకరించి దానిని అనాలోచితంగా పారామిటరీ దళాలపై బలవంతగా రుద్ధి అమలు చేయించాయని'' మాజీ పంజాబ్ పోలీస్ చీఫ్ కె.పి.ఎస్.గిల్ ఆవేదన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా 2010 ఏప్రిల్ 6న దంతేవాడలో 81 మంది సభ్యుల ఉన్న పటాలంపై మవోయిస్టులు హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో 76 మంది సి.ఆర్.పీ.ఎఫ్ జవాన్లు అసువులు బాసాగా దుర్భేద్యమైన వాహనం, సంచార బంకర్ ధ్వసం అయాయని బాధపడ్డారు. కేంద్ర హోంమంత్రి ప్రతి రోజు పత్రికల ముందు వచ్చి మవోయిస్టులను అణచివేయడం కోసం అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, గ్రేహౌజ్ బలగాలను పెంచుతున్నామని, ఇతర దేశాల నుంచి ఆధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నామని ఎదో విధంగా వార్తకేకుత్తున్నారు. గ్రేహౌజ్ బలగాలుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అడవిలో పంపుతున్నారు. అడవిలో వెళ్లిన బలగాలు తిరిగి ఎంత మంది వస్తారో తెలియదు. వారు తిరిగి రాకుంటే వారి కుటుంబ పరిస్థితి ఎమిటి అని అలోచించారు. అధికారంతో ఆనాధిగా సంపాధించిన సంపాదనకు మాత్రం రక్టణ కావాలి. మానిషి ప్రాణం పోతేనేం, వాళ్ల కుటుంబం ఏమైతేనేం...నా కుటుంబం, నా ధనం సురక్షితంగా ఉంది అని సంతోష పడుతున్నారు. కానీ ధనికులు, అధికారులు, ప్రభుత్వాలు వారు ఎందుకు ఇలా మారారు అని ఎందుకు అనుకోవం లేదు. వారు ఈ విధంగా మారడానికి గాల కారణలు ఏవీ? వీరిని ఎ విధంగా జనజీవంలోకి తీసుకోరావాలి అని ఎందుకు ఆలోచించడం లేదు?
సాధారణ మనిషి నక్సల్‌సగా ఎందుకు మారుతడు?
ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆవేశతో కుడిన వ్యక్తి నక్సల్‌సగా మారుతాడు. తాన ఆవేధన అన్ని వర్గాల ప్రభుత్వ అధికారులకు తనగోడు వినిపించి, తన ఆవేదనను వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు మాటాలను పెదచెవిన పెడడంతో ఆ ఆవేదన భరించ లేక తను పెడదారి పడుతున్నాడు. తాను ఎందుకు పెడదారి పట్టాడు? నక్సల్‌గా ఎందుకు మారాడు? ఈ ప్రశ్నాలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియాదా? అసలు విషయం ఎవరు అడగడం లేదని, ప్రభుత్వానికి తెలిసిన ఎందుకు బహిర్గతం చేయాలని అతనికి టార్గెట్ చేస్తే మరోకరికి ప్రశ్నించే ధైర్యం ఉండదనే ఆలోచనతో.... గ్రామాభివృద్ధి కోసం పటుపడే ప్రతియువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవిద్యార్ధులు, యువతలు పెడదారి పడ్డకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ధనవంతుడికి దగ్గర అయస్కాంత గుణాలను ప్రదర్శించే ప్రభుత్వాలు పేద వాడి వాడివిషయంలో ఎందుకు మంచుగడ్డ గుణాలు ప్రదర్శిస్తుందో అర్ధం ఆకావడం లేదు.
మారుమూల పల్లె, పట్టణం వలె అభివృద్ధి చెంది మా గ్రామం పట్టణ ప్రజల వలె ఆనందంగా ఉండాలని అనుకునే వారు కనీసం పల్లెకొక్కరైనా ఉంటారు. గ్రామ ప్రజల కోసం మౌలిక సాదుపాయలు కల్పించమని, గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని, గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారును పదేపదే ప్రదేయ పడుతుంటారు. అధికారులు నమ్మించి మొసం చేయడం, ఆయన ఆశాయలను ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అడి ఆశాయాలు చెస్తుంది. ఆ సమాయంలో తమ కుటుంబం కంటే గ్రామాభివృద్ధి ముఖ్యం అనుకునే ప్రతి వ్యక్తి ఒక దృష్టశక్తిగా మారుతాడు. ఆ వ్యక్తి నక్సల్‌సగా మారాడానికి సహాకారించింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కాదా?
నక్సల్‌సపై రివార్డు అవసరమా?
కేంద్రం అధునికీకరణకు మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వడమనేవి ఒక వూ్యహంగా ఉంటే ఈ వూ్యహం నేటి వరకు ప్రధానంగా కాగితాలపైనే ఉన్నాయి. నక్సల్‌సలో ఒక ఉన్నత పదవి చేపడుతున్నడంటే అతనిని ఎలా మట్టికప్పలని చుస్తూన్నారు ధనికులు. అతని పట్టుకున్నా వారికి వేల కోట్లు బహుమతి అని ప్రకటిస్తుంది ప్రభుత్వం. వారు చనిపోతే మరోకరు ఈ ఉద్యామం చేపట్టకుండా ఉంటడా? ఉద్యామం చేపట్టిని ప్రతి ఒక్కరి కోసం ప్రకటించే రివార్డు, ఆ రివార్డు ప్రకన కోసం చేసే ఖర్చు పల్లేల అభివృద్ధికోసం ఎందుకు ఖర్చు చేయకుడదు? ఖర్చు చేస్తే మరోకరు నక్సల్‌సగా మారే అవకాశం ఉంటుందా? అని ఎందుకు ప్రశ్నించుకోదు. దేశంలో, రాష్ట్రంలో క్రమక్రమంగా పల్లేలు అభివృద్ధి చేదుతుంటే వారు ఆజ్ఞానాన్ని విడిచి భయటకు వస్తారు అని ఎందుకు అనుకోవడం లేదు. వాళ్లను చంపడం మీ టార్గెట్ అయితే, మీ దగ్గర ఉన్న అక్రమ సంపాధ ఎంత? అన్ని ప్రశ్నించే హక్కు వారికి ఎందుకు ఉండకుడదు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఇలాగే చంపుకుంటు పోతే దేశంలో చివరకు మిగిలేది.... ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వడమనేవి ఒక వూ్యహంగా ఉంటే ఈ నిధుల విడుదల నేటి వరకు కాగితాలపైనే... అభివృద్ధికోసం పాటుపడే ప్రతి యువత అడుగుతున్న ప్రశ్న ఇది.
అధికార ప్రభుత్వాలు తమే ఏమి తప్పు చేయడం లేదు అనుకుంటుంది. ప్రభుత్వాలు తప్పు ఒప్పులు ఎవరికి తెలియాదు. తెలిసి వ్యక్తి ఒతికి ఉండారు, ఒక వేళ ప్రభుత్వ తప్పిదాలు తెలిసిన వ్యక్తి గనుగ ఉంటే..... దేశ సరిహద్దులో నిరంతరం కపలా కస్తూ, దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసే వారు. ఇతర దేశ శత్రువుల నుండి దేశ ప్రజలకు హాని కలగకుండ ఉండాలని..... దేశాన్ని కపాడే వ్యక్తి దేశంలో ఉన్న దేశ ద్రోహులను మాత్రం ఏమి చేయలేకపోతున్నని కుంగిపోతుండాడు. దేశ ద్రోహుల నుండి దేశాన్ని కపాడుకోవడం కోసం విధీని నిర్వహణను వదులుకోవాల్సి వస్తూంది. దేశ ద్రోహులు అతన్ని నక్సల్‌గా ముద్ర వేస్తుంది. అందుకనే నేమే మాజీ సైనిక సిబ్బంది మవోయిస్టులకు శిక్టణ ఇస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నాట్లు ఒక జాతీయ మాసపత్రికవెలవర్చింది. మాజీ సైనికులు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసం ఈ విధంగా తన వీధినిర్వహణ కొనసాగిస్తున్నారు. దేశ శత్రువలును ఎదుర్కొవడంలో తమ సిద్దాంతాలను ఎవిధంగా అమలు చేస్తారో అదే రితిలో దేశ ద్రోహులను ఎరివేయడం కోసం ఆ సిద్దాంతాలను మావోయిస్టుల రూపంలో అమలు చేస్తున్నారు.
బలిపశవులుగా బలగాలు (ఈనాడు)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారామిలటరీ బలగాలను బలిపశవులుగా వాడుకొంటున్నాయని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ ఆరోపించారు. ఇటీవల దంతెవాడ జిల్లాలో జరిపిన దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబ సభ్యులకు తాము మనస్పూర్తిగా సానుభూతి తెలుపుతున్నామన్నారు. సీపీఐ(మావోయిస్టు) పీఎల్‌జీఏ గెరిల్లా దళాలు దంతెవాడ జిల్లాలోని పారామిలటరీ బలగాలపై దాడిచేసి చరిత్ర సృష్టించారని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద్ధనికి కేంద్రం సన్నద్ధమవుతోందని, దీనిని ప్రతిఘటిస్తామని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా దాడులకు తెగబడతామని హెచ్చరించారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా గుర్తించనంత కాలం దంతెవాడ తరహా దాడులు కొనసాగుతాయన్నారు.