Tuesday, March 1, 2011

శివరాత్రి శుభాకాంక్షలు



శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం |
జగన్నాథనాథం సదానందభాజం |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 1

గళే దండమాలం తనౌ సర్పజాలం |
మహాకాలకాలం గణేశాదిపాలం |
జటాజూటగంగోత్తరంగై ర్విశాలం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 2

ముదా మాకరం మండనం మండయంతం |
మహామండలం భస్మభూషాధరం తమ్‌ |
అనాదిం హ్యపారం మహామోహమారం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 3

వటాధోనివాసం మహాట్టాట్టహాసం |
మహాపాపనాశం సదా సుప్రకాశమ్‌ |
గిరీశం గణేశం సురేశం మహేశం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 4

గిరీంద్రాత్మజాసంగృహీతార్ధదేహమ్‌ |
గిరౌ సంస్థితం సర్పహారం సురేశం |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 5

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం |
పదాంభోజనమ్రాయ కామం దదానం |
బలీవర్దయానం సురాణాం ప్రదానం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 6

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం |
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్‌ |
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 7

హరం సర్పహారం చితాభూవిహారం |
భవం వేదసారం సదా నిర్వికారం |
శ్మశానే వసంతం మనోజం దహంతం |
శివం శంకరం శంభు మీశాన మీడే| 8

స్తవం యః ప్రభాతే నర శ్శూలపాణేః |
పఠేత్‌ సర్వదా భర్గసేవానురక్తః |
స పుత్రం ధనం ధాన్యమిత్రే కళత్రం |
శివం శంకరం శంభు మీశాన మీడే|10

Wednesday, January 26, 2011

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

బ్లగ్ మిత్రులకు మరియూ భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


Thursday, January 13, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు


మిత్రులకు, నా బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

మాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. దేశంలో పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వారూ జరుపుకునే సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు. ఈ రోజున వివిధ కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగినాడే గొచ్చి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటి ప్రధానం వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగోరోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను నాలుగోరోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది నాలుగు రోజులు, మరికొంతమంది ఆరు రోజులు చేయడం కూడా ఆచారం. భోగినాడు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.

మహారాణిలా వచ్చే సంక్రాంతి రోజున పూజ ఎలా చేయాలి?
మకర సంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం ద్వారా జన్మజన్మల దారిద్ర్య బాధలు తొలగిపోతాయని విశ్వాసం. సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు, పసుపు, కుంకుమ, పండ్లను దానం చేయడం ద్వారా సకలసంపదలతో పాటు దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తాయి. సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు "భోగిని" (భోగి పండుగ), వెనుక "కనుమ" (కనుమపండుగ)ను వెంటేసుకుని, చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుంది. ఇదేరోజున పితృదేవతారాధన చేయడం వల్ల వారి శుభాశీస్సులతో వర్ధిల్లుతారని పురోహితులు అంటున్నారు. అందుచేత సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే లేచి, పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును ముగ్గులతో అలంకరించుకోవాలి. స్త్రీలు తెల్లవారు జాముననే లేచి వారి వారి ముంగిళ్లలో రంగవల్లుల తీర్చిదిద్దుకోవాలి.

తెల్లవారు జాముననే హరిదాసు హరినామ సంకీర్తనలు, సాతాని జియ్యర్లు, జంగపుదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, బైనాయుడులు, గంగిరెద్దుల వాళ్ళు ఇంటింటికీ తిరుగుతుంటారు. వారి వారి తీరులలో భక్తి గీతాలు పాడుతూ ఏడేడు జన్మలలో మన ఇళ్ల పెద్దలకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని దీవెనలు ఇస్తుంటారు. అన్ని కులాల వారు మకర సంక్రమణ సమయంలో తిలా తర్పణలు విడిచి గుమ్మడి పండ్లను దానం ఇస్తే విష్ణువుకు బ్రహ్మాండాన్ని దానమిచ్చిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ ఫలం వల్ల పెద్దలు తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున తలస్నానము చేసి కొత్త బట్టలను ధరించి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, పండ్లను నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని (శ్రీహరిని), పితృదేవతలను ప్రార్థించుకుంటే మోక్షమార్గము, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి కొత్త బట్టలు పెట్టి... బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు కొన్ని కొన్ని వ్రతాలను ఆచరించడం చేస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం నెల పెట్టింది.. మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ఇంటి ఆడపడుచులు ఆ ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.

సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది

సంబరాలు అంబరాన్నంటే... తొలి పండుగ సంక్రాంతికి ఈ ఏడాది సందడి కరువైంది. సంబరాల సంక్రాంతి వచ్చిందంటే..గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో సందడే సందడి నెలకొంటోంది. ఆనందోత్సాహాలతో తెలుగు ముంగిళ్లు కళకళలా డుతుంటాయి. పల్లెల్లో ఇళ్ల ముంగిట ధాన్య రాశులు...వీధుల్లో రంగ వల్లులతో...పిండి వంటల ఘుమఘుమలు...కొత్త బట్టల మిలమిలలు...తలపించే ఈ పండుగ సందడి ఈ సంవత్సరం కాంతినివ్వడం లేదు. సంక్రాంతి పండుగలో ఆకాశంలో గాలిపటాలను ఎగురవేస్తారు. కానీ ఇప్పుడు గాలిపటాలతో పాటు, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశంలో తేలుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంక్రాంతి కళ తప్పింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ సంక్రాంతి నాటికి ఇళ్లకు చేరుకుంటాయి. ఆ సంబరాన్ని సంక్రాంతి ప్రతిబింభిస్తోంది. కానీ ఈ ఏడాది తొలి పండుగ రైతులను వెక్కిరిస్తోంది. అకాల వర్షంతో పంటంతా తడిసి ముద్దయి ఇంటికి కూడా చేరలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిత్యావసర, కూరగాయల ధరలు రెండింతలు పెరిగి ప్రజల నడ్డి విరుస్తున్నాయి. పండుగ అంటేనే తీపి, పిండి వంటలు. ఆ వంటకాలు చేసేందుకు ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో ఆ వంటకాలు చేసుకునేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు జంకుతున్నారు. చక్కెర చేదెక్కి, నూనె, నువ్వుల, ఉల్లి, వెల్లుల్లి ధరలు నాలుగింతలు పెరిగి ప్రజల బతుకులను పీల్చి పిప్పి చేస్తున్నాయి.

ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

నలుగురు ఉన్న కుటుంబంలో గతంలో రూ.500లకు నెలకు సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఆ నలుగురికే ప్రస్తుతం ఆ సరుకులకే రూ.1500లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. జీవనం సాగేందుకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. మొన్నటి వరకు రూ.18 నుంచి రూ.20 వరకు పలికిన చక్కెర నేడు రూ.35 నుంచి రూ.40లకు చేరింది. ప్రతి కూరలో అవసరమైన ఉల్లి, వెల్లుల్లిలు సామాన్య ప్రజల కంట నుండి నీరు తెప్పిస్తోంది. రూ.20లకు మించని ఉల్లిగడ్డ నేడు రూ.40లకు చేరింది. రూ.40లకు మించని వెల్లుల్లి నేడు రూ.300లకు చేరిందంటే ధరలు ఏ మేరకు పెరిగియో అర్ధం చేసుకోవచ్చు. అన్ని వంటకాల్లో ఉపయోగించే వంట నూనెలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. రూ.60లు దాటని నూనెలు రూ.80ల పైగానే పలుకుతున్నాయి. పిండివంటలకు ఉపయోగించే పప్పుల ధరలు అందనంత దూరంలో ఆకాశాన్నంటాయి. రూ.30లకు మించని కందిపప్పు నేడు రూ.65లకు చేరింది. నువ్వులు రూ.90లకు చేరుకుంది పెరిగిన ధరలతో సంక్రాంతి పండుగకు తయారు చేసుకునే పిండివంటకాలు కరువయ్యాయి. ప్రతి ఇంటిలోనూ ఘుమఘుమలాడే పిండి వంటకాలు ఇప్పటికే తయారు చేసుకోవాల్సినప్పటికీ పెరిగిన ధరలతో దాని జోలికి వెళ్లేందుకే జంకుతున్నారు. పండుగ పూటనే కాస్త నాన్‌ వెజ్‌తో పూట గడుపుకోవాలనుకునే ఆలోచనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. తొలి పండుగ అయిన సంక్రాంతికి పిండి వంటకాలు లేనట్లే..

దిగి రాని కూరగాయల ధరలు

పెరిగిన కూరగా యల ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు పచ్చడి మెతుకులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.100 తీసుకెళితే..రెండు రకాల కూరగాయల ధరలు, కరివేపాకు, కొత్తమీర కొనలేక బిక్కముఖంతో ఇంటికి రావాల్సి వస్తోంది. గత నవంబరులో రూ.20లకు మించని కూరగాయల ధరలు నేడు రూ.40లకు తక్కువ కాకుండా ఉండడంతో పేద ప్రజలు లబోదిబోమంటున్నారు. దోసకాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రూ.10లకు మించని దోసకాయ రూ.40లకు తక్కువ కాకుండా మార్కెట్లో అమ్ముతున్నారు. చిక్కుడుకాయ రూ.60, బెండకాయ రూ.40, టమా టా రూ.30, బీరకాయ రూ.45, ఉల్లి రూ.40 పలుకుతోంది. కోడిగు డ్డు విషయానికొస్తే ఒకటి రూ.3.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఆకు కూరలకు వెళితే...రూ.10లకు రెండు కట్టలు కూడా ఇవ్వడం లేదు.

ఇంటికి చేరని ధాన్యపు సిరులు :

కొత్త సంవత్సరం తొలి పండుగ అయిన సంక్రాంతికి ధాన్యపు సిరులు ఇంటికొస్తాయి. కానీ అకాల వర్షాల మూలంగా పండుగకు ధాన్యపు సిరులు ఇంటికి రాకుండా పోయాయి. కోసిన మెదలు, కల్లాల్లో వచ్చిన రాసులు వర్షాల బారిన పడి తడిసి ముద్దయి నాశనమైపోయాయి. పంటంతా వర్షం పాలు కావడంతో మిగిలిన పంటను ఆరుమూరుకు అమ్ముకున్నారు. దీంతో పొలం నుండి నేరుగా ఇంటికొచ్చే ధాన్యపు సిరులు నేరుగా మార్కెట్‌కు వెళ్లిపోయాయి. రైతన్నల్లో సంక్రాంతి సంతోషాన్నివ్వలేదు. కుటుంబ సభ్యులతో కళకళలాడే ఇళ్లన్నీ..బోసిపోతున్నాయి.

Thursday, September 23, 2010

తొలి దశలోనే చదువుకు స్వస్తి

గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది కుటుంబాలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళు్తంటారు. దాంతో వారి పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారు. తరగతి గదిలో కొనసాగ్సాన బాల్యం.... బాధ్యతల్ని వెదుక్కుంటూ రోడ్డున పడుతోంది. బడికి వెళ్లవలసిన సమయంలో బాలలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని పని బాట పడుతున్నారు. ఇందుకు నేటి సమాజంలోని సామాజిక, ఆర్ధిక అసమానతలే కారణం. రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమికోన్నత విద్య నుంచే పేద విద్యార్ధులు చదువుకి స్వస్తి పలుకుతున్నారు. 2000-01లో 1వ తరగతిలో 22,89,220 మంది చేరగా 2009-10లో 10,67,642 (53.36) మందికి తగ్గారు. సగం మంది లోపు విద్యార్ధులే 7వ తరగతిలోకి ప్రవేశించగలిగారు. చదువుకి స్వస్తి చెప్పిన విద్యార్ధులందరూ పేదగిరిజన కుటుంబాల వారే. ఇందుకు కారణం వారి తల్లితండ్రులకు తమ పిల్లలను చదివించుకోవాలన్న ఆకాంక్ష లేకపోవటం కాదు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులే.
నూటికి 70 మందిగా ఉన్న గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటం, పేద రైతులకు, వ్యవసాయకూలీలకు భూమి లేకపోవడం వల్ల గ్రామీణ పేదరికం పెరుగుతూనే ఉన్నది. ఇందిరా కాంతి పథకం ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 134.68 లక్షలు. వీటిలో పేదరికంలో మగ్గుతు న్న కుటుంబాలు 56.1 శాతం. షెడ్యుల్‌‌డ తెగలు, కులాలు, వెనుకబడిన తరగతులతో పాటు అ భివృద్ధి చెందిన కులాల కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి. 2004 లెక్కల ప్రకారం రాష్ట్రంలో పేదరికం 55.5 శాతం కాగా, ఇప్పుడు అది ఇంకా పెరిగింది. పేదల్లో 36.65 శాతం నిరుపేద కుటుంబాలు, 18.4 శాతం దుర్భర దారిద్య్రంలో బ్రతుకుతున్న కుటుం బాలు ఉన్నాయి.
పాలకులు విద్యారంగం ఎడల అనుసరిస్తున్న విధానాలు కూడా పేదలకున్న కొద్దిపాటి చదువుకొనే అవకాశాలను హరించి వేస్తున్నయి. రాజ్యాంగంలోని ఆదేశి క సూత్రాల్లో అందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలదే. ఆ బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టలేదు. ప్రభుత్వ స్కూళ్ళలో వసతులు కల్పించటంలో పాలకులు విఫలమయ్యారు. సరిపడా ఉపాధ్యాయులను నియమించక ఉన్న వారిపై అదనపు భారం మోపుతున్నది. సంక్షేమ హాసళ్ళు సదుపాయాలు లేక భ యంకరంగా మారాయి. దుర్గంధపూరిత వాతావరణంలో అంటురోగాల పాలై అనేకమంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం 2004-05 నాటికి గ్రామీణ ప్రాంతంలో 17.03 కోట్ల మంది పేదలున్నారు. ఇంకా లోతుగా సర్వే జరిగితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే కాని తగ్గదు. 1993-04లో గ్రామీణ ప్రాంతంలో రోజువారీ పనులు చేసుకొని బతికేవారిలో 5.63 శాతం, 1999-2000 నాటికి 7.20 శాతం కాగా, నేడు 11.2 శాతానికి పెరిగింది. పేదల సంఖ్య పెరుగుతూ ఉండటం వలన ఉపాధి వెతుక్కోవటమే వీరికి సమస్యగా మారింది. పట్టణాలకు, ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. ఈ బతుకు పోరాటంలో పిల్లల చదువుల గురించి ఆలోచించే పరిస్థితి వారికి లేదు. పిల్లల ద్వారా వచ్చే ఆదాయం వారి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. అందుకే తప్పని పరిస్థితిలో పనులకు పంపుతున్నారు.
సరళీకృత ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచ బ్యాంక్‌ సూచనలకు అనుగుణంగా విద్యారంగాన్ని ప్రైవేట కరించే విధానాలను పాలకులు అనుసరించారు. ప్రభుత్వ స్కూళ్ళపట్ల ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించి, కార్పొరేట్‌ స్కూళ్ళకుఆకర్షితులను చేశారు. అనేక ప్రభుత్వ రంగ స్కూళ్ళని రద్దు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి డబ్బు గలవారికే విద్యను పరిమితం చేశారు. అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్‌ స్కూళ్ళలో పేదలు తమ పిల్లలను చేర్చటం అసాధ్యం కనుక వారు చదువుకు స్వస్తి చెప్పవలసి వస్తున్నది. చదువు మానేస్తున్న పేదల్లో ఎక్కువ మంది గిరిజన పిల్లలే. కొండ కోనల్లో జీవిస్తున్న వీరు పాలకుల నిర్లక్ష్యానికి గురై గిరిజనేతరుల, పెత్తందార్ల, ఫారెస్టు అధికారుల దోపిడీకి గురపుతున్నారు. వీరు, తమ పిల్లలను చదివించుకుందామన్నా అక్కడ పాఠశాలలు కరవే. పట్టణ ప్రాంతాలకు పంపి చదివించే ఆర్ధిక స్థోమత, అవ కాశాలు వీరికి తక్కువ.
గిరిపుత్రులే అధికం
చదువుల్ని అర్దతరంగా వదిలేస్తున్న వారిలో గిరిజన(ఎస్సీ) విద్యార్ధులే అధికంగా ఉంన్నరు. వీరి బాటలనే హరిజన(ఎస్సీ) విద్యార్దుల కూడా ప్రయానం చేస్తున్నారు. వీరు అర్ధతరంగా చదువుకు స్వస్తి చేప్పి బాల కార్మికులుగా మారిపోతున్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన, హరిజన విద్యార్దులకు పాఠశాలలు దగ్గర్లో లేకపోవడంతో కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలలు దగ్గర్లో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాలలు కొసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక వారు చదువును మనేస్తున్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక గురుకుల పాటశాలలు ఏర్పాటు చేసిన అవి పరిమిత స్థాయిలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లకలు ఉన్నత చదువులు చదవించే స్థోమత లేక పోవడం వల్ల మధ్యలోనే పాఠశాలను వదిలించుకొని పనిలో పెడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2000-01లో రాష్ట్ర వ్యాపితంగా 3,12,309 (బాలురు-1,61,659, బాలికలు-1,50,650) మంది గిరిజన బాల, బాలికలు ఒకటవ తరగతిలో చేరినా, 2009-10 నాటికి వారి సంఖ్య 72,606(బాలురు- 39,234, బాలికలు- 33,372)కి తగ్గిపోయింది. అంటే ఏడవ తరగతికి వచ్చే లోపు 2,39,703 మంది చదువుకి దూరమయ్యారు. షెడ్యూల్‌‌డ కులాలకు చెందిన విద్యార్థుల పరిస్థితీ ఇంతే. ఇదే కాలంలో 4,76,514 (బాలురు-2,41,368, బాలికలు-2,35,114) మంది షెడ్యూల్‌‌డ కులాల పిల్లలు 1వ తరగతిలో చేరగా ఏడవ తరగతికి వచ్చేసరికి 1,99,413 (బాలురు10,2330, బాలికలు-97,093)కి తగ్గిపోయారు.
కొన్ని పాఠశాలలో ఏకోపాధ్యా ఉండటంతో విద్యార్ధులకు తగిన సౌకర్యాం లేకపోవడం వల్ల విద్యార్ధులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపడంలేదు. బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు వంటి సౌకార్యాలు అత్యధిక పాఠశాలలో లేకపోవడం వల్ల బాలికలకు సమస్యగా మారింది. విద్యార్ధులకు షౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్ధులను రోజు పాఠశాలలకు వచ్చేలా ఆకర్షించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినా వారు చదువుకు స్వస్తి చెప్పకుండా నిరోధించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్ధులను పాఠశాలలకు పంపించే ఏర్పాట్లును చేస్తున్నా వాటిపై తదనంతరం చర్యలు ఉండటం లేదు. మరో వైపు విద్యకు దూరమవుతున విద్యార్ధుల సంఖ్య ప్రాథమిక విద్యలో కంటే ప్రాథమికోన్నత విద్య మంచి విష్ర్కవిస్తున్న విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గతేడాది ఒకటి నుంచి తొమ్మిది తరగతులో ఉన్న విద్యార్ధులు 95 శాతం దాకా ఉండగా తరువాత తరగతిలోకి ప్రవేశించిన వారి సంఖ్య 90 శాతంకు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నిరక్షరాస్యతను రూపుమాపడంలో భారతదేశం వెనుకబడిందన్న వాస్తవం అంతర్జాతీయంగా పాలకుల విమర్శలకు గురికావడంతో, వయోజన విద్యా పథకం, రాజీవ్‌ మిషన్‌ ద్వారా అందుకు కార్యక్రమం రూపొందించి ప్రతి సంవత్సరం స్కూళ్ళ పునర్‌ ప్రారంభంలో బడిబాట, వయోజన విద్య పథకం పేరుతో చేసే హడావుడి అంతా మొక్కుబడిగానే ఉంది. విద్యాశాఖలో పర్యవేక్టణలో కీలక పాత్ర పోషించే పోస్టులు సుమారు 700 ఎంఇఓలు, 75 ఉపవిద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలకుల దృష్టిలో నిరక్షరాస్యతను రూపుమాపటమంటే అక్షరాలు నేర్చుకొని సంతకం చేస్తే చాలు. దీన్నే చదువుకున్న వారి సంఖ్య పెరిగినట్లుగా పాలకులు ప్రచారం చేస్తున్నారు.
గిరిజన విద్యార్థులు అందోళన చేయకుండా వారిలో కొద్దిమందిని కార్పొరేట్‌ కాలేజీల్లో చేర్పించి ఉన్నత విద్యను అందిస్తున్నట్లు మభ్యపెట్టేందుకు పూనుకొంది. ఇది గిరిజన విద్యార్థుల కన్నా కార్పొరేట్‌ కాలేజీల ప్రయోజనం కోసమేనన్నది వాస్తవం. ఈ పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వాటికి దోచి పెడుతున్నది. ఈ విధంగా అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులను పై చదువులకు రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తున్నది. షెడ్యూల్‌‌డ కులాల, వెనుకబడిన కులాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవటానికి ఫీజులు రియింబర్‌‌సమెంట్‌ ప్రకటించింది. ఒక సంవత్సరం కొంత మేరకు ఇది అమలు జరిగినా, ప్రస్తుతం దాన్ని నీరుగార్చే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది.
అందరికీ విద్య అందిస్తామని, నిరక్షరాస్యతను రూపుమాపుతామని విద్యాభివృద్థే దేశాభివృద్ధని చెప్పే పాలకుల, పేద కుటుంబాల పిల్లలు చదువుకి దూరమవడానికి గల వాస్తవ సమస్యల పరిష్కారం జోలికే పోవడం లేదు. పేదలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితేనే వారి పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పేద రైతులు, వ్యవసాయ కూలీలకు లభించే ఆదాయం కుటంబ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. వారి ఆదాయం పెరగాలంటే భూసంబంధాలను బద్దలుకొట్టి, భూస్వాముల అధీనంలోని భూములను, ప్రభుత్వమే భూస్వామిగా ఉన్న దేవాలయ భూములను, అన్ని రకాల బంజరు, ఫారెస్టు బంజరు భూములను గిరిజనేతర చేతుల్లో ఉన్న గిరిజనులకు చెందవలసిన భూములను పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు, గిరిజనులకు పంపిణీ జరగాలి. అందుకు వ్యవసాయక విప్లవ కార్యక్రమం చేపట్టాలి.అప్పుడు మాత్రమే పేదల సమస్యల పరిష్కారంతో పాటు విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది

చైనాను నిందించి ఏం ప్రయోజనం?

చైనీయులు ఎప్పుడు కూడా కాశ్మీర్‌పై మన సంపూర్ణ సార్వభౌమాధికారం వాదనను అంగీకరించలేదు. వారి వీసా విధానం ఓ వైపు భారత్‌కు కంటిలో నలుసుగా ఉంటూనే మరో వైపు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ఉంటుంది. అయితే అంతకు మించి మరేమీ కాదు. దలైలామా, టిబైటన్ల ప్రవాసం లాంటి అంశాలే కాదు, ప్రతి విషయంలో భారత స్పందించే తీరును గమనించినట్లయితే చైనా ముఖ్యమైన సమస్యల విషయంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఆచరణలో మాత్రం ఆక్రమిత కాశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు, లేదా ప్రకృతి వైపరీత్యాల సహాయం లాంటి విషయంలో చైనా పాకిస్తాన్‌కు సహాయాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో వాస్తవానికి భారత చేయగలిగింది ఏమీ లేదు కూడా. సర్దార పటేల ఒకప్పుడు వ్యాఖ్యానించినట్లు అధీనంలో ఉంచుకోవడమే అసలైన న్యాయం. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారతీయ అభివృద్ధి కార్యకలాపాలను ఆపడానికి చైనా ప్రయత్నించినట్లుగా మన నిరసనలు ఈ అభివృద్ధి కార్యకలాపాలను ఆపుతాయని మనం ఆశించడం వాస్తవ విరుద్ధం కూడా.ఇప్పుడు జరుగుతున్న చర్చ చైనా విషయంలో మన ఆలోచనా ధోరణిలోని మూడు ముఖ్యమైన వైఖరులను కూడా ఎత్తి చూపిస్తోంది. చైనా అత్యంత వూ్యహాత్మకంగా వ్యవహరించే, దూరాలోచనలు చేసే ద్రోహబుద్ధి కల దేశమనే ఆలోచన వాటిలో మొదటిది. భారత దేశానికి ఎలాంటి వూ్యహాత్మక దూరదృష్టి లేదని, స్వల్ప కాలిక క్రియాశీలకతతో అది దిక్కుతోచకుండా ఉండడం ఈ వాదనకు మూలం. ఫలితంగా చైనా వాళ్లు వేసే ప్రతి చిన్న అడుగు కూడా తన అధికారాన్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్తరింపజేసుకోవడంతో పాటు మన ప్రయోజనాలను దెబ్బ తీయడమనే దాని విస్తృత స్థాయి ప్రణాళికలో భాగమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని మన నిపుణులు మనకు చెప్తుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో ప్రణాళికలను రూపొందించుకోవడంలో తాము సమర్థులమనే విషయాన్ని చైనీయులు చాటి చెప్పారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే వూ్యహాత్మకంగా లెక్కలేనన్ని ఘోరమైన తప్పులు చేయడంలో కూడా వారు సమర్థులనే విషయాన్ని కూడా చరిత్ర చెప్తోంది.
భారతీయుల మనసులను ఎప్పుడూ కలవరపెడుతుండే నేర్పరితనం చైనాకు బాగా ఉన్నట్లుంది. తాజాగా గిల్గిత- బాల్టిస్థాన ప్రాంతంలో చైనా సైన్యాల ఉనికి గురించి, సైన్యానికి చెందిన ఉత్తర మండలం సైనికాధికారి ఒకరికి చైనా వీసా నిరాకరించడంపై మీడియాలో వచ్చిన వార్తలు సైతం అలాంటి కలవరాన్నే సృష్టించాయి. ఇటీవలి కాలంలో తలెత్తిన వివాదాల తర్వాత సంభవించిన ఈ రెండు పరిణామాలు చైనానుంచి ఎదురయ్యే ప్రమాదం విషయంలో మన భయాలను మరింతగా పెంచాయి. నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉదంతాలపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా చైనా ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రణాళికల గురించి కాక మన చర్చల తీరుతెన్నుల గురించే ఎక్కువగా చెప్తున్నాయి. ముందుగా కాశ్మీర్‌పై చైనా తన వైఖరిని మరింత కఠినతరం చేసిందనడానికి ఇటీవలికాలంలో ఆ దేశ చర్యలే నిదర్శనాలనే వాదనను పరిశీలిద్దాం. కాశ్మీర్‌పై చైనా వైఖరి మూడు భిన్నమైన దశల్లో అవిష్కృతమైంది. 1950 దశకంలో చైనీయులు కాశ్మీర విషయంలో చాలావరకు తటస్థ వైఖరినే అవలంబించారు. భారత్‌తో పరిష్కారం కుదుర్చుకోవలసిందిగా తమ అంతర్గత సంభాషణల్లో చైనా పాకిస్తాన్‌కు సూచిస్తూ వచ్చినట్లు చైనా గతానికి సంబంధించి ఇప్పుడు వెల్లడైన సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. అయితే భారత-చైనా సంబంధాలు దిగజారడం ప్రారంభం కావడంతో పరిస్థితిలో కూడా మార్పు రాసాగింది. 1963నుంచి తర్వాతి మూడు దశాబ్దాల కాలంలో పాకిస్తాన్‌ ప్లైబిసైట్‌- ప్రజాభిప్రాయ సేకరణ- డిమాండ్‌ను సమర్థించే దిశగా చైనావిధానం మారిపోయింది. అయితే 1990 దశకం ప్రారంభంనుంచి భారత్‌తో చైనా సంబంధాలు మెరుగుపడ్డం చైనీయులు మరోసారి తమ వైఖరిని మార్చుకోవడానికి దారి తీసింది. కాశ్మీర భారత, పాకిస్తాన్‌లే పరిష్కరించుకోవలసిన దై్వపాక్షిక సమస్య అని వారు ఇప్పుడు అంటున్నారు. ఈ వైఖరి ఈ విషయంలో చైనా వైఖరి భారత వైఖరికి దగ్గరగా ఉంది కూడా.
మన విధానమే లోపాలమయం!
తూర్పు ఆసియా విషయంలో చైనా వైఖరి అనే తాజా ఉదాహరణనే చూడండి. ఏడాది క్రితం దాకా కూడా తూర్పు ఆసియాలోని చిన్న దేశాలు చైనా శాంతియుత ప్రగతినిచూసి దాని అభిమానులుగా ఉండేవి. అయితే గత ఏడాది కాలంగా చైనా ఆధిపత్య ధోరణి కారణంగా ఈ ప్రాంతంలోని పలు చిన్న దేశాలు చైనా విషయంలో తమ వైఖరిని మార్చుకున్నాయి. చినావాలోని అమెరికా సైనిక స్థావరాన్ని కొనసాగించాలన్న దాని నిర్ణయం, అమెరికా-దక్షిణ కొరియా సంబంధాలు బలోపేతం కావడం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా-వియత్నాం నౌకాదళ విన్యాసాలు-వీటిలో ఏ ఒక్కటి కూడా చైనా ప్రయోజనాలకు ఉపయోగపడేవి కాదు సరికదా, అనేక అంశాల విషయంలో చైనా వైఖరిపై ప్రభావాన్ని చూపించేవనే మాట నిజం. దీంతో తూర్పు ఆసియాలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆ దేశం ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చే దేశంగా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల చైనా వేసే ప్రతి అడుగులోనూ దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుందేమోనని అనుకోవలసిన అవసరం లేదు.
రెండో వాదన ఏమిటంటే చుట్టూ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం ద్వారా భారత్‌ను సమస్యలకు బందీగాచేసి ఊపిరాడకుండా చేయడానికి చైనా ప్రయత్నిస్తోందనే వాదన. మన పొరుగు దేశాల్లో చైనా నిర్మిస్తున్న లెక్కలేనన్ని నౌకాశ్రయాలను ఈ వాదనకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. ఈ వాణిజ్య కార్యకలాపాల వెనుక సైనిక పరమైన పరిణామాలు ఉండవచ్చని అనుకోలేము. అంతకన్నా మించి మనం కూడా ఇలాంటి ప్రాజెక్టులను ఎందుకు చేపట్టలేకపోతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. దీనికి సమాధానం చాలా సులభం. భారత దేశంలో మిగతా దేశాలతో పోటీ పడగల ప్రపంచస్థాయి నౌకా నిర్మాణ పరిశ్రమ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందలేదు. మన పొరుగుదేశాల్లోకి చొచ్చుకుపోతున్న చైనాను చూసి భయ పడే బదులు మనం మన సామర్థా్యలలోని లోటుపాట్లవైపు దృష్టి పెట్టడం మంచిది.
మూడో వాదన చైనా ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద సరిహద్దు విషయంలో భారత్‌తో ఒప్పందాన్ని చేసుకోవడానికి ముందుకు రావడం లేదని మనలో బలంగా నాటుకు పోయిన భావన. ఇది పూర్తిగా చరిత్రను ఒక వైపునుంచి చూడడం మాత్రమేనని చెప్పాలి. 1962 తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు చైనాలాగానే భారత దేశం కూడా చర్చలను ప్రారంభించే విషయంలో ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కూడా అత్యంత సున్నితమైన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అర్థవంతమైన ప్రణాళికపై చర్చించడానికి ముందుకు రాకుండా వాస్తవాధీన రేఖపై వివరణ ఇవ్వడానికి ప్రత్యామ్నాయ చర్చల కోసం మాత్రమే మన దేశం పట్టుబడుతూ వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా చైనా ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూ ఉందన్న మాట నిజమే. అయితే ఏ చర్చల్లోనైనా ఇలాంటివి జరగడం సహజమే. చైనా వివాదాలు పరిష్కరించుకోని ఏకైక దేశం భారత మాత్రమేనని వాదించడానికి బదులు భారత మాత్రమే చైనాతో వివాదాలను ఎందుకు పరిష్కరించుకోలేక పోతోందనే విషయాన్ని ఆలోచిస్తే మనకు కొంత ప్రయోజనం ఉంటుంది. స్వాతిశయ భావాన్ని తొలగించుకోవాలి. అది ఎంతటివారినైనా తప్పుదారి పట్టిస్తుంది అని ప్రముఖ వూ్యహాత్మక విశ్లేషకుడు బాసిల లిడ్డెలి చెప్పిన మాటలు మన చైనా విశ్లేషకులకు బాగా సరిపోతుంది.
ఈ మూడు భావాలను కలిపి చూసినట్లయితే చైనా విషయంలో మన ఆలోచనలు తప్పు అనే విషయం స్పష్టమవుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన విషయం. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలనేవి క్రియ-ప్రతిక్రియల క్రీడ లాంటివి. ఇతర దేశాల పట్ల మన వైఖరులు ఒక్కోసారి ఆ దేశాల ప్రవర్తనలపై ప్రభావం చూపిస్తుంటాయి. మనం జాగ్రత్తగా ఉండని పక్షంలో చైనా బూచి అనేది ఆత్మ వంచనకు ప్రతీకగా మారిపోతుంది.

Tuesday, September 21, 2010

కాశ్మీర్‌లో విన్యాసం చేస్తున్న డ్రాగన్‌

భారతదేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. వాటిని అసర చేసుకొని పోరుగు దేశం మాతాల పేరుతో దేశంలో ప్రవేశిచించి దేశాన్ని క్రమంగా అక్రమిచుకునే మార్గాలను ఎంచుకుంది. అదే క్రమంలో చైనా దలైలామ పేరుతో భారతదేశం మొత్తం విసృత ప్రచారంలో ఉంది. అయితే మొదటి ఆక్రమితంలో భాగంగా కాశ్మీర్‌ను ఎంచుకుంది. కాశ్మీరలో కొంత భాగాన్ని డ్రాగన్‌ (చైనా) సైనికులు అక్రమించుకుని పాలకు సిద్దమౌతున్నారు. ఈ విషయాన్ని 1950 ప్రారంభం నుంచే నెహ్రూ చైనా నుంచి ముప్పును ఊమించారనడానికి ఇప్పుడు కావలసినన్ని సాక్షాలున్నాయి. చైనా నుంచి ఎదురుకాగల ప్రమాదం గురించి తాము నెహ్రూను హెచ్చరిస్తూనే వచ్చామని ఆయన సకాలంలో చర్య తీసుకోలేదని కొందరు నాయకులు చెప్పుకున్నారు. పండిట నెహ్రూ 1952లో తన పెంకింగ్‌ పర్యటన సందర్భంగా ఇలా అన్నారట. ఏదో ఒక రోజున ఈ రెండు ఆసియా మహాకాయాలూ ఒక దానితో ఒకటి ఘర్షణకు దిగుతాయి. అది ఆసియాకే మహోత్పాతంగా విప్లవానంతరం నవచైనా ఎలా మారబోతోందో మనం దృష్టిలో ఉంచుకోవాలని 1950 నవంబర్‌ 27వ తేదీన నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. ఆ తరువాత 1950లో నియుక్తమైన భార్డర్‌ కమిటీని గురించి ప్రస్తావించి శక్తివంతమైన ఈ రెండు దేశాలు సరిహద్దు వివాదాన్ని పురస్కరించుకొని ముఖాముఖిగా రూపొందించుకున్న చిత్రం 1950 నుంచి ప్రబుత్వం ముందు ఉంటూనే వచ్చిందనీ, అయితే, ఘర్షణ అయిదేళ్లలోనా, ముపై్పళ్లోనా అన్న విషయం కాక ఎప్పుడు సంభవిస్తుందనే విషయంలో రెండు దేశాల మద్య అభిప్రాయభేదం ఉండవచ్చునని అన్నారు. మాజీ ప్రధాని పండితుడు సర్గీయ పి.వి.నరసింహారావు లోపల మనిషి పుస్తకంలో రాసిన మాటలివి. చైనా-భారత్‌ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ప్రథమ ప్రధాని నెహ్రూ వేసిన అంచనా అక్టరం కూడా తప్పలేదు. ఆయన చెప్పినట్టే అసియాలోని ఆ రెండు మహాకాయాలు 1962లో తలపడ్డాయి. కూడా ఎటోచ్చి అపజయం మనదే అయింది. ``1947-64 మధ్యకాలంలో ప్రపంచదేశాల మధ్య సమున్నత స్థాయికి ఎదిగిన భారతదేశం ప్రతిష్ట 1962 నాటి సైనిక పరాజయంతో దారుణంగా కుంగిపోయింది ఇది కూడా పివి రాశాని మాటాలే... పోయిన ప్రతిష్టను భారత్‌ తిరిగి సాధించుకుంది. కానీ, చైనాతో మన సంబంధాలు మెరుగుపడలేదు. చైనా విస్తరణ కాంక్టలో మార్పుకనిపించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆక్రమిత కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు. ఉత్తర ప్రాంతాలుగా పిలుచుకునే గిల్గిత్‌, బాల్టిస్థాన్‌లలో చైనా సేనలు వచ్చి చేరుతున్నామనీ, ఆక్రమిత కాశ్మీర్‌ను చైనాకు అప్పగించడానికి పాకిస్థాన్‌ సిద్దపడుతున్నదనీ వివరిస్తూ విదేశీ మీడియా కొన్ని వార్తలు ఇచ్చింది. ఈ అంశంతో సంబంధం ఉన్న భారత్‌-చైనా-పాకిస్థాన్‌ ఈ మూడు దేశాలలో ఏ ఒక్కటీ ఈ అంశం మీద ఇంత వరకూ నోరు మెదపలేదు. కాబట్టి దీని గురించి వెంటనే నిర్ధారణకు రానవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. అలాంటి వారి కోసమే పివి రాసిన మాటలు గుర్తు చేయడం. ఇంతకీ తాజా వివాదం ఏమిటి? భారత ప్రభుత్వం కూడా ఈ సంగతుల రుజువు కోసం ఎందుకు చూస్తున్నది. అదొక విచిత్రమే... ఈ సందర్భంలో కార్గిల్‌ ప్రాంతంలో జిరగిన ఆక్రమణలను అక్కడ పశువుల కాపరులు సైనాన్యనికి తెలియ చేస్తే గానీ భారత ప్రభుత్వం దృష్టికి రాలేదన్న సంగతి గుర్తుకు వస్తుంది.
జమూ్మకాశ్మీర్‌లో విధులలో ఉన్న సైనికాధికారి, ఉత్తర కమాండ్‌ అధిపతి లెవి్టనెంట్‌ కల్నల్‌ బి.స్‌ జస్వాల్‌ ఉదంతం ద్వారా చైనా ఉద్ధేవాలను పసిగట్టవచ్చుననే అనిపిస్తుంది. జస్వాల్‌ ఆ దేశంలో పర్యటించేందుకు మీసా నిరాకరించింది. అందుకు చైనా చెపిపన కారణం కొత్తదేమీ కాదు. భారతీయులను విభ్రాంతికి గురిచేసేది కాదు. సరిహద్దులలో పరిణామాలు. 1949 నుంచి జరిగిన చరిత్ర పరిణామాల గురించి లోతుగా తెలిసిన వారికి ఇవన్నీ పెద్ద విస్మయం కలిగించేవి కావు. ఎందుకంటే అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనాలో పన్నుతున్న వూ్యహాలేవి కొత్తవి కావు. కల్నల్‌ జస్వాల్‌ మొన్న జూలైలో చైనాలో పర్యటించవలసి ఉంది. జస్వాల్‌ పర్యటనను అనుమతించడం సాధ్యం కాదని జూలై మధ్యలో ఛైనా అధికారులు కబురందించారు. కారణం-వ్యవస్థాపరంగా చైనాకు ఇబ్బంది కారకంగా ఉన్న ప్రాంతంలో జస్వాల్‌ పని చేస్తున్నందుకే ఈ నిర్ణయం అనివార్యమైందని దౌత్యభాష పలికింది. చైనా కల్నల్‌ జస్వాల్‌ అధికార పరిధి కాశ్మీర్‌లో సున్నిత ప్రాంతాలకు చెందిన వారికి చైనా ప్రభుత్వం ప్రత్యేక వీసాలు జారీ చేస్తుందని జూలై 21న భారత అధికారులకు రాసిన లేఖలో ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. నిజానికి కాశ్మీరీలకు చైనాకు మన అధికారులు నిరసన తెలియజేశారు. దానితో పాటు వేగంగా ప్రతిఘటన తెలిపింది. ఆగస్టులో భారత్‌ పర్యటనకు రావలసిన చైనా సీనియర్‌ కల్నల్‌, ఇద్దరు కెప్టెన్ల పర్యటనను రద్దు చేయడం ఆ ప్రతిఘటనలో భాగమే. చైనా కల్నల్‌ న్యూఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్‌‌స కాలేజిలో ప్రత్యేకోపన్యాసం ఇవ్వవలసి ఉంది. ఆయన వెంట ఇండియా పర్యటించవలసిన కెప్టెన్లు కూడా పంచమడిలోని సైనిక కేంద్రంలో శిక్టణ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. ఈ ద్వంద్వ వీసాల వివాదం తేలే దాకా రక్టణకు సంబంధించి ఇచ్చిపుచ్చుకునే కార్యకలాపాలను నిలిపివేయాలని తీసుకున్న తీవ్ర నిర్ణయం కూడా అందుకే.
చైనా టిబెట్‌కు విజయవంతంగా రైలు మార్గాన్ని నిర్మించింది. ఇప్పుడు గిల్గిత్‌-బాల్టిస్థాణతో పాకిస్థాన్‌కు తలనొప్పులు ఉన్నాయి. వాటిని వదుల్చుకోవడానికి కూడా చైనా ప్రమేయాన్ని పాక్‌ వాంఛిస్తున్నది. అదే చైనా కోణం నుంచి చూస్తే భారత్‌ సరిహద్దులో కీలకమైన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడం, ఆసియాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌ చుట్టూ తన ప్రాబల్యం బలపడడం దానికి ఎంతో సంతృప్తిని ఇచ్చే అంశమే. ఈ ప్రాంతలో చైనా అభివృద్ధి పథకాలు చేపట్టడంతో దాని మీద పట్టు కోసం ముందు పోటీ ఏర్పడడమూ ఖాయం. కాబట్టి కల్నల్‌ జస్వాల్‌కు వీసా నిరాకరించడం ఈ ప్రాంతంతో చైనా వేస్తున్న ఎత్తులలో భాగమే అని అర్ధం. అక్కడ పని చేస్తున్న భారత సైనికాధికారికి వీసా నిరాకరించడం అంటే సున్నిత కాశ్మీర్‌లో భారత్‌ అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయడమే. టిబెట్‌ తిరుగుబాటు(1959) తరువాత దాని మీద చైనా అధిపత్యాన్ని ప్రశ్నార్ధకం చేయాలని భారత్‌ ప్రయత్నించినట్లు, చైనా అనుమానం. దలైలామాకు ధర్మశాలలో ఆశ్రమాలనికి, ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నివ్వడం చైనాకు ఇప్పటికీ రుచించని విషయమే. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ మీద భారత్‌సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకం చేయడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని చైనా కూడా వినియోగించుకుంటున్నది. ఇందుకు పాక్‌ పెద్దపావులగా ఉపయోగపడుతున్నది.
చైనా వైఖరికి దాని విదేశాంగ నీతే కారణం. వాస్తవం చెప్పాలంటే చైనా విదేశ వ్యవహారాలు వన్‌వే ట్రావిక్‌ను మరిపిస్తాయి. చైనా ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే తప్ప అవతలి భాగస్వామి అభిప్రాయాలకు ఆ విధానంలో గౌరవం తక్కువ. ఇది పంచశీల భగ్నమైనప్పుడే స్పష్టంగా అర్ధమైంది. కానీ, భారత్‌కు విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఏ రాజ్యకూటమికి చెందకపోవటం అందులో ప్రధానమైనది. అందుకే ప్రచ్ఛన్నయుద్దంలో ఇటు కమూ్యనిస్టు, బ్లాకు వైపుగానీ, అటు అమెరికా వైపుగానీ దేశం మొగ్గుచూపలేదు. ప్రచ్ఛన్న యుద్దం అంతం తరువాత ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది. కానీ, ఈ విధానంతో మనకు మేలు జరగలేదని చెప్పడం తొందరపాటే కాదు, కొంత నష్టం కూడా తెచ్చిందని చెప్పడానికి మాత్రం వెనుకాడనక్కరలేదు.
దౌత్యం అంటే భారత్‌కు ఏమాత్రం గౌరవం లేని ఇరుగు పోరుగుతో కాలం చెల్లిన దౌత్య వూ్యహాలను అమలు చేయడానికి ప్రయత్నించే దేశంగా భారత్‌ మీద ముద్ర పడింది. పాకిస్థాన్‌ విదేశాంగ విధానంలో భారతదేశానికి చాలా ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. భారత సరిహద్దు ప్రాంతాల మీద చైనాకూ, పాక్‌కూ కూడా కన్ను ఉంది. రెండూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటాయి. భారత ఉత్తర సరిహద్దులలో పాకిస్థాన్‌ తన ఆర్ధిక, వూ్యహాత్యక అవసరాల దృష్టా్య స్థావరాల కోసం అర్రులు చాస్తూ ఉంటుంది. అయితే పాక్‌ కంటె చైనా విషయంలో ఇందుకు సంబంధించిన భారత్‌ స్పందన ఎప్పుడూ ఎంతో బలహీనంగా పేలవంగా ఉంది. కానీ, దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలను అర్ధం చేసుకోవడం కూడా ఆయా ప్రాంతాలలో ఇప్పుడు ఏ జరుగుతున్నదో తెలసుకునే ఆసక్తిని ఇండియా ఏనాడూ కనపరచలేదు. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ సాధికారత, 2009 నాటి స్వయం పాలన ఉత్తర్వు వంటి రాజకీయ ప్యాకేజి గురించి కూడా భారత్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందులో భారత్‌కు సానుకూల పరిణామాలు ఉన్నాయి. అయినా భారత్‌ శ్రద్ద వహించలేదు. గిల్గత్‌-బాల్టిస్థాన్‌ల సాధికారతకు జమూ్మకాశ్మీర్‌లో అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కాశ్మీర్‌కు స్వతం6తం కోరుతున్న జమూ్మకాశ్మీర్‌ ! లిబరేషన్‌ ప్రంట్‌ వంటి సంస్థలు, పాకిస్థాన్‌లో విలీనం వైపు మొగ్గు చూపుతున్న హిజ్బుల్‌ముజామిదీన్‌ ఇస్తాం వంటి సంస్థలు కూడా ఈ ప్యాకేజీకి ప్రతికూలంగా ఉన్నాయి. పాకిస్థాన్‌లో నవాజ్‌ షరీఫ్‌ నాయకత్వంలోని ముస్లిం లీగ్‌ కూడా ఈ ప్యాకేజీ నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఉత్తర ప్రాంతాలకు సంబంధించి (అవేగిల్గిత్‌-బాల్టిస్థాన్‌) ఏ నిర్ణయం తీసుకోవాలన్న పాకిస్థాన్‌ ప్రధాని యూసఫ్‌ రజాగిలానీ కూడా నేషనల్‌ అసెంబ్లీని సంప్రదించవలసి ఉంటుంది.
జమూ్మ కాశ్మీర్‌ లిబిరేషన్‌ ఫ్రంట్‌ నాయకుడు అమానుల్లా ఖాన్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉత్తర ప్రాంతం జమూ్మకాశ్మీర్‌లో అంతర్భాగంగా ఉండాలని చాలా చట్ట బద్దంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు అన్ని ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌లోనే అవి కొనసాగాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమానుల్లా ఖాణ్‌ గల్గిత్‌కు చెందినవాడు. సరిహద్దు ఉత్తర ప్రాంతాల పరిపాలన జమూ్మ-కాశ్మీర్‌ ప్రాంతాలు ఐక్యంగా ఉండటం అనే అంశాల మీద విభజన కాలం నుంచే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి ఈ నాటివి కావు. 1 ఆగస్టు 1947న గాంధీ శ్రీనగర్‌ వచ్చారు. నాటి బ్రిటిష్‌ ఇండియాలోని మిగిలిన భారతదేశమంతా మత కల్లోలాలతో అట్టుడుకుతున్నట్లు ఉండగా కాశ్మీర్‌లో స్వాతంత్య్రం దినోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గాంధీజీ దానికి ఇచ్చిన నిర్వచనం వేరుగా ఉంది. 12 సంవత్సరాల తరువాత గిల్గిత్‌ ఏజెన్సీ తిరిగి కాశ్మీర్‌లో చేరినందుకే వారు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారని గాంధీ చెప్పారు. ఇదే కీలకమైన పరిణామం. గిల్గిత్‌పై 60 సంవత్సరాల అధికారం వెలుగబెట్టడదనికి ఉద్ధేశించిన ఒక ఒప్పందం మీద 1935లో మహారాజా హరిసింగ్‌(కరణ్‌సింగ్‌ తండ్రి), బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఆ ప్రాంతంలో పెరుగుతున్న రష్యా ప్రభావానికి గండి కొట్టడానికి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని సరిహద్దు రక్టణరేఖగా ఉపయోగించదలిచింది. అయితే 1947లో బ్రిటిష్‌ పాలన అంతంకావడంతో ఈ ఒప్పందం రద్దయింది. ఆ సందర్భంలోనే గాంధీజీ మరొక ప్రకటన చేశారు. జమూ్మకాశ్మీర్‌ రాష్‌ట్రం సమైక్యంగా ఉండేందుకు వీలుగా గిల్గిత్‌ను స్థానిక ప్రజలకు ఇచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించాలనీ, తద్వారా అక్కడి సంప్రదాయాలనూ, సంస్కృతినీ రక్షించాలనీ ఆయన అన్నారు. కానీ, గాంధీజీ మాటలను రాజా హరిసింగ్‌ పరిగణలోకి తీసుకోలేదు. తన సైనికాధికారి బ్రిగేడియర్‌ ఘనసారా సింగ్‌ను ఆ ప్రాంత గవర్నర్‌గా నియమించారు. కానీ, కొద్ది రోజులకే తిరుగుబాటు చెలరేగింది. గవర్నర్‌ను అరెస్టు చేశారు. అక్కడి చైనిక విభాగాధిపతి మేజర్‌ స్కాట్‌ తిరుగుబాటుదారుల పక్టం వహించాడు. ఆ ప్రాంతానికి 1 నవంబర్‌1948 నుంచి పాకిస్థాన్‌ వాస్తవిక పాలకురాలైంది. 1949లోనే మళ్లీ ప్రభుత్వానికీ, దాని ఆధీనంలో న్న ఆక్రమిత కాశ్మీర్‌ పాలకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని మేరకు ఉత్తర ప్రాంతాల మీద అధికారం పాకిస్థాన్‌ పరమైంది. రాష్ర్టం నుంచి ఆ విధంగా ఉత్తర ప్రాంతం వేరైంది. ఈ ప్రాంతానికి ఆప్ఘానిస్థాన్‌, చైనా, భారత్‌ ఆధీనంలో ఉనన కార్గిల్‌ సరిహద్దులుగా ఉన్నాయి.
చైనాతో లాభకమైన సంబంధాలకు ఈ ప్రాంతం మీద అధిపత్యం కలిగి ఉండడం పాకిస్థాన్‌కు అవసరం. అయితే చైన వైరం భిన్నమైనదని అంగీకరిస్తూనే మనకు శత్రువులుగా ఉన్న మన రెండు పోరుగు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం, ఫలితంగా ముందు ముందు తలెత్తే క్లిష్టపరిస్థితి దానితో మన ప్రయోజనాలకు కలిగే విఘాతం గురించిన సమస్య అన్ని గుర్తుంచుకోవాలి. 2మార్చి 1963న చైనా-పాక్‌ల మధ్య జరిగిన ఒప్పందం ఈ ప్రాంతంలో 2700 చదరపు కిలోమీటర్ల భూబాగాన్ని చైనాకు అప్పగించడానికి మార్గం ఏర్పరచింది. 1982లో పాకిస్థాన్‌, చైనా ఉమ్మడిగా కారాకోరమ్‌ జాతీయ దరహదారిని నిర్మించారు. ఈ రహదారి పోడవు 900 కిలోమీటర్లు కావడం వల్ల మధ్యలో పంజాబ్‌లో సారవంతమైన పంజాబ్‌ ప్రాంతం సరిహద్దుకు , చైనాలోని జియాంగ్‌ ప్రాంతానికి లంకె ఏర్పడింది. ఇది రెండు దేశాల ఆర్ధిక పరిపుష్టికే కాక, స్నేహం పెంపొందడానికి కూడా దోహదం చేసింది. అలాగే జియాంగ్‌ ప్రాంతంలో నివసించే యుఫర్‌ జాతీయులకు, కాశ్మీర్‌ ఉత్తర సరిహద్దు ప్రాంత ప్రజలకు మధ్య స్నేహ సంబంధాలకు కూడా ఈ రహదారి కారణమైంది. ఈ జాతీయ రహదారి కారణంగానే పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ వద్ద గ్వదాల్‌ నౌకశ్రయం నిర్మాణం సాధ్యమైంది. ఈ నౌకాశ్రయాన్ని కూడా పాకిస్థాన్‌ చైనా ఇంజనీర్లే కలిసి నిర్మించారు. అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటైన ఈ నౌకాశ్రయం వల్ల పశ్చిమ చైనా సముద్రమార్గంతో అనుసంధానమైంది. ఆవ్రికా నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవడానికి కూడా చైనాకు ఈ నౌకాశ్రయం దోహద చేస్తున్నది. గల్‌‌ఫకు చేరడం కూడా చైనాకు సులభమవుతోంది. మొత్తంగా చూస్తే ఈ ప్రాంతంలో చైనా తన అధిపత్యాన్ని సుదూరంగా విస్తరిస్తున్న విషయం అర్ధమవుతుంది. ఆఖరికి శ్రీలంకలో కూడా ఒక నౌకాశ్రయాన్ని నిర్మించాలని అది ప్రణాళికలు వేసుకుంటోంది. అక్కడితో చైన విస్తరణ కాంక్ట అగిపోలేదు.
ఏమైనా ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైన్యం ప్రవేశం ఆసియాకే పెద్ద సమస్య దీనిని ప్రపంచ, ఐక్యరాజ్య సమితి ఎంత తొందరగా గుర్తిస్తే అత మంచిది. ఇప్పటికే ప్రచ్చన్నయుద్దం మిగిల్చిన విషాదంతో ఆసియా అల్లకల్లోమైంది. ఇప్పుడు చైనా దుడుకుతనం దానిని మరింత తీవ్రం చేస్తుంది.

Sunday, September 12, 2010

దేవాలయ భూముల విక్రయ కుంభకోణం

దేవాలయ భూముల కుంభకోణం గురించి ముఖ్యమంత్రికి ముందే తెలుసు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలుసు. మంత్రి సత్యనారాయణరావుకూ తన శాఖ అవినీతి బండారం గురించి మంత్రి పదవి చేపట్టక ముందు నుంచే తెలుసు. తన శాఖలో జరిగిన `మేజర్‌ స్కామ్‌'కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి సత్యనారాయణరావు రాజీనామాచేస్తారని ప్రజలందరికీ తెలుసు. దానిని ముఖ్యమంత్రి తిరస్కరిస్తారని బాగా తెలుసు. ఎంతో నాటకీయతతో రాజీనామా, తిరస్కారం, శాఖ మార్పు తతంగాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ నడిపించేసింది. ఎ.సి.బి. దాడులు జరిపించేశామని, రిటైర్‌‌డ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తున్నామని ప్రకటించి కథను సుఖాంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియనిది ప్రజలకు తెలిసింది ఒకటుంది. అదే ప్రజా చైతన్యం. తన భూముల్ని ఎలా కాపాడుకోవాలో ఆ దేముడికి తెలియదని కాంగ్రెస్‌ గుడ్డి ప్రభుత్వం భ్రమల్లో ఉంది. దేముడికి శఠగోపం పెట్టటం తమకు తెలిసిన విద్య మాత్రమేనని మురిసిపోతోంది. ప్రజలను కొంత కాలం మోసం చేయవచ్చు. ఎల్లకాలం కాదు సుమా. ప్రజా చైతన్య కెరటాలు సునామీ స్పీడుతో అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తుడిచి పెట్టే రోజు అతి దగ్గరలో ఉంది. దేముడి భూములను కాపాడుకొనే శక్తి, యుక్తి ప్రజలకుందన్న విషయాన్ని విస్మరించి వ్యవహరించవద్దని తెలుగుదేశం హెచ్చరిస్తోంది
దేవాలయ భూముల విక్రయ కుంభకోణం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇది బీహార్‌లో పశుగ్రాస కుంభకోణాన్ని మించిన అవినీతిపర్వంగా రూపుదాల్చింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్‌ పార్టీ అవినీతి ఊబిలో పూర్తిగా ఇరుక్కుపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ శాసనసభ్యులతోపాటు సీనియర్‌ ఉన్నతాధికారుల ప్రమేయం సైతం ఇందులో వినిపిస్తోంది. పట్టణ ప్రాంతాలలోని సుమారు 400 ఎకరాల ఆలయ మాన్యాలు అధికారపక్ష అవినీతివల్ల అన్యాక్రాంతం అయిపోయాయి. వీటి విలువ కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు ఉంటుందని అంచనా. ఈ అవినీతి బండారం బయటపడినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తవ్వినకొద్దీ అక్రమాలు కొత్తకొత్తవి వెలుగులోకి వస్తున్నాయి.
ఈ భూముల కుంభకోణం చిలికి చిలికి గాలివాన అయినట్లు మొత్తం ప్రభుత్వాన్ని, పాలకపక్షాన్ని వివాదపు రొంపిలోకి నెట్టేసింది. ఏతావాతా అనుమానాలు, సందేహాలు అంతకంతకూ పెరిగి ఆరోపణల అస్త్రాలు ముఖ్యమంత్రిపైకే సంధించే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే ప్రభుత్వం సవ్యంగా మెలగడంతోపాటు అందుకవసరమైన నమ్మకాన్ని కూడా కలిగించాలి. ప్రభుత్వాధినేత వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి నిర్ణయం ప్రభుత్వ విశ్వసనీయత పెంచేదిగా ఉండాలి. ఈ విజ్ఞత ముఖ్యమంత్రిలో లోపించటం దురదృష్టకరం. మంత్రి సత్యనారాయణరావు తాను ఈ కుంభకోణానికి అతీతుడు అంటూ మాట్లాడుతున్నారు.
అవినీతి, ఊటలు దిగిన మర్రి వృక్షంలా పాతుకుపోయినా మాకేం తెలియదని కాంగ్రెస్‌ నేతలు నమ్మబలుకుతున్నారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడన్న నానుడిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా ఒంటపట్టించుకొన్నట్లుంది. అందుకే దేవాదాయ భూముల కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానితులైన పెద్ద చేపల ఆచూకీ కనిపెట్టేందుకు పకడ్బందీ దర్యాప్తు చేయించటంలేదు. తూతూ మంత్రంగా విచారణ జరిగిందని అనిపించి అవినీతి తిమింగలాలను భద్రంగా రక్షించేందుకు ఉబలాటపడుతోంది. హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి పర్యవేక్షణలో కేంద్ర నేరపరిశోధన బృందం (సీబీఐ) ద్వారా విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా చేస్తేనే ఒక్క గజం భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి మాటకు విలువ ఉంటుంది. నిష్పాక్షికమైన విచారణ వల్లే దేముడినే నిలువు దోపిడీ చేసేందుకు ఉపక్రమించిన పెద్దల గోత్రనామాలు వెల్లడి అవుతాయి.
అసలు దోషూలెవరు?
దిక్కులేని వారికి దేముడే దిక్కంటారు. అలాంటి దేముళ్ళకీ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో దిక్కు లేకుండా పోయింది. దేముడిని, దేముడు ఆస్తులను కాపాడాల్సిన అధికారులు, బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న పెద్దలు అడ్డదారులు తొక్కి దేముడి భూములను అక్రమంగా కారుచౌకగా విక్రయించేందుకు పూనుకొంటే ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ దేముడు భూములు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఆక్రమించుకొని సొము్మ చేసుకోవాలన్న దురాలోచనతో అనేకమంది పట్టణ, నగర ప్రాంతాలలోని భూములపై కన్ను వేశారు. అయిదు నెలల్లో రిటైర్‌ కాబోతున్న ఐ.ఎ.ఎస్‌. అధికారిని ఏరికోరి దేవాదాయశాఖ కమిషనర్‌గా తెచ్చుకున్నారు. ఆయన ద్వారా దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని సెక్షన్‌89 ప్రకారం కమిషనర్‌కు ఉండే విస్తృతాధికారాలను వినియోగించుకొని దేముడి భూములను కాజేసేందుకు కుట్ర చేశారు. రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్‌ సీతారామస్వామి ఆలయానికి చెందిన అత్యంత విలువైన భూములను కాజేయటానికి రంగం సిద్ధం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు ఫైళ్ళను నడిపించారు. ఈ అక్రమ క్రమబద్ధీకరణలను నిలుపు చేస్తూ మంత్రి సత్యనారాయణరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత మే 16వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా తానిచ్చిన నిషేధ ఉత్తర్వులను మంత్రి సత్యనారాయణరావు ఉపసంహరించుకుంటూ ఫైలుపై సంతకం చేశారు. తానిచ్చిన ఆదేశాలనే ఉపసంహరించుకునేలా మంత్రిపై ఎవరి వత్తిడి తెచ్చారు? దీని వెనుక ఉన్న ప్రచ్ఛన్న హస్తాలు ఎవరివి? అప్పటికే బదిలీ ఆదేశాలను అందుకున్న దేవాదాయ వ్యవహారాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి జె.పి.మూర్తిని మరో వారం అదే పోస్టులో కొనసాగి పనులన్నీ చక్కబెట్టేందుకు ఎవరు అవకాశం కల్పించారు. మే 31వ తేదీకి రిటైర్‌ అవుతున్న కమిషనర్‌కు, బదిలీ ఆదేశాలు అందుకున్న జె.పి.మూర్తి కుమ్మకై్క దేవాలయ భూముల అక్రమ విక్రయ కథ నడిపించారు. చకచకా ఫైళు్ళ కదిలాయి. మార్కెట్‌ ధర నిర్ణయించే విషయంలో కూడా జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులను పక్కన పెట్టి నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌, ఎం.ఆర్‌.వో.లతో సంప్రదింపులు జరిపి ఆఘమేఘాలపై పనులు చక్కబెట్టేశారు. అయిదు రోజుల్లో కోట్లాది రూపాయల దేముడి భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ కుంభకోణం బయటపడినప్పటి నుంచి మంత్రి సత్యనారాయణరావు పోషించిన పాత్ర కూడా ఎన్నో అనుమానాలకు, సందేహాలకు తావిచ్చింది. వ్యవహారం వెల్లడి కాగానే కంచే చేను మేసిందన్నారు. తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు కేశవరావు ఒత్తిడి వల్లే తాను ఆదేశాలు ఇవ్వవలసి వచ్చిందని వాపోయారు. ఆ తర్వాత అది కూడా సరికాదన్నారు. మాటలు మార్చుకొంటూ పోయారు. పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. చివరకు ఇదంతా పత్రికల సృష్టే అన్నారు. చివరకు నెపం వారు తెలుగుదేశం పైనే నెట్టేశారు. తెలుగుదేశం హయాంలోను చాలా జరిగాయంటూ ఎదరు దాడికి దిగారు. గత పది సంవత్సరాలుగా జరిగిన దేవాలయ విక్రయాలను న్యాయ విచారణ పరిధిలోకి చేరుస్తున్నామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇలా యధేచ్ఛగా భూముల విక్రయాన్ని ఎన్నడూ అనుమతించలేదు. ఎటువంటి విచారణనైనా తెలుగుదేశం స్వాగతిస్తోంది. తెలుగుదేశంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు గురివిందగింజ సామెతను గుర్తు చేస్తున్నాయి.
కమిషనర్‌ వెంకటేశ్వర్లు పాత్ర
ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమీషనర్‌గా ఐ.ఎ.ఎస్‌. అధికారి ఐ.వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పదవీ విరమణ చేసేంతవరకు రాష్టవ్య్రాప్తంగా క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 350 ఎకరాల భూమిని విక్రయించేశారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, మెదక్‌ జిల్లాలలోని భూములు విక్రయం జరిగింది. వెంకటేశ్వర్లు కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సచివాలయంలో ఉన్నతస్థాయి అండదండలు లభించటంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా జరిగింది. కొద్ది వారాల్లో పదవీ విరమణ చేస్తారనగా వెంకటేశ్వర్లు ఆలయ భూముల విక్రయాలకు సంబంధించి వివిధ ఆలయాలకు చెందిన సుమారు 350 ఎకరాల భూమిని అమ్మటానికి ఆయన హిందూ దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని 89 అధికరణ ద్వారా తనకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకున్నారు. 14 ఆలయాలు, రెండు ట్రస్టులకు చెందిన 41 కేసులను పరిష్కరించారు. ఈ విక్రయ ఆదేశాల వల్ల దేవాదాయశాఖకు సమకూరింది రూ.12 కోట్లు మాత్రమే. వాస్తవ విలువ రూ.520 కోట్లు ఉంటుందని అంచనా. భూముల కుంభకోణం గుట్టు రట్టవడంతో ప్రభుత్వం నెమ్మదిగా చర్యలు మొదలెట్టింది. దేవాదాయశాఖ కమీషనర్‌ కార్యాలయంపై దాడి చేసిన ఎ.సి.బి. అధికారులు ముఖ్యమైన 30 ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు. (మే 28, 2005) ఎసీబీ స్వాధీనం చేసుకొన్న ఫైళ్ళలో అక్రమ భూముల విక్రయ వివరాలు...
మంత్రి సత్యనారాయణరావు అమాయకుడట...
దేవాదాయ శాఖలో కోట్ల రూపాయల విలువైన భూములను ఎడాపెడా విక్రయించారు. అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టానుసారం పదోన్నతులు కల్పించారు. ఇవేమీ దేవాదాయశాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావుకు తెలియదట. దేవాదాయశాఖ పరువును రోడ్డున పడేసిన భూ కుంభకోణంపై అయిదుగురు క్రిందిస్థాయి అధికారులను సస్పెండ్‌చేసి మంత్రి చేతులు దులుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్‌లోని ఆలయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండా మంత్రి స్వయంగా నిషేధం విధించారు. కానీ దేవాదాయశాఖ మాజీ కమీషనర్‌ వెంకటేశ్వర్లు యధేచ్ఛగా ఈ భూములను విక్రయించారు. రిజిస్ట్రేషన్‌పై నిషేధం కూడా తొలగిపోయింది. ఆ ఫైలుపై కూడా మంత్రే సంతకం పెట్టారు. భూముల రిజిస్ట్రేషన్‌కు కమిషనర్‌ అనుమతి ఇస్తున్నారని మంత్రికి చాలామంది ఫిర్యాదులు చేశారు. కానీ ఆయన తగిన విధంగా స్పందించలేదు. వీసమెత్తు చర్యలు కూడా తీసుకోలేదు. శాఖాపరంగా సమగ్ర దర్యాప్తు చేయించేందుకు ప్రయత్నం చేయలేదు. దేవాలయ భూములు తమకు విక్రయించేలా చూడండంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు విజ్ఞాపన పత్రాలు అందజేయగానే మంత్రి సత్యనారాయణరావు ``తగిన చర్యలు తీసుకోండి...'' అని సిఫార్సు చేశారు. ఇటువంటి 14 కేసులను సిఫార్సు చేసినట్లు మంత్రే స్వయంగా తెలిపారు. వీటిలో ఒకటి పీసీసీ అధ్యక్షుడు కె.కేశవరావుది కూడా ఉన్నదని మంత్రి మండలి సమావేశంలో వివరించడమే కాకుండా ఆ విషయాన్ని పత్రికల వారికి కూడా తెలిపారు. వివాదం ముదరడంతో పీసీసీ అధ్యక్షుడు నోటి మాటగా చెప్పారని సత్యనారాయణరావు మాట మార్చేశారు. మిగిలిన 13 దరఖాస్తులు ఎవరివన్నవి ఇంకా వెల్లడి కాలేదు. ఇందులో ముఖ్యమంత్రి బంధువుల నుంచి పలువురు మంత్రులు, శాసనసభ్యుల సిఫార్సు లేఖలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా మంత్రికి తెలిసే జరిగిందన్నది వాస్తవం. ఒక పక్క అవినీతి నిరోధక శాఖ, దర్యాప్తు మరొక పక్క న్యాయ విచారణ ఆదేశించిన ముఖ్యమంత్రి వివాదానికి కేంద్ర బిందువైన మంత్రి సత్యనారాయణరావుకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం ఆశ్చర్యకరం. న్యాయ విచారణ ఫలితం కోసం వేచి చూడకుండా పిల్లికి ఎలుక సాక్ష్యంలాగా ముఖ్యమంత్రి పనికిమాలిన కితాబులివ్వటం ఈ మొత్తం స్కాంలో కీలక అంశం. అధికారులు ఎంత అవినీతిపరులైనా ఫైలుపై మంత్రి సంతకం లేకుండానే భూముల క్రమబద్ధీకరణ జీవోలు వచ్చాయా? దేముడి మాన్యాలను ధారాదత్తం చేసేందుకు అనేక జీవోలు జారీ అయ్యాయి. అక్రమాలకు మూల కారణమైన జీవోలన్నీ మంత్రికి ఎలాంటి సంబంధం లేకుండానే వాటికవి పుట్టుకొచ్చాయా... కోట్లాది ఆస్తుల విక్రయానికి సంబంధించిన కీలక ఉత్తర్వులపై మంత్రి కళు్ళ మూసుకొని గుడ్డి సంతకాలు పెట్టారా? ఇంతటి బాధ్యతారాహిత్యానికి పాల్పడిన మంత్రిని ముఖ్యమంత్రి ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు. ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తి తనను తప్పుదోవ పట్టించారని చెప్పుకున్న మంత్రి అదే అధికారిని బదిలీ అయ్యాక కూడా తిరిగి అదే శాఖకు తెప్పించుకోవటానికి ఎందుకు నానా తంటాలు పడవలసి వచ్చింది? తన శాఖలో అవినీతి మెండుగా ఉందని శాసనసభలో గొంతెత్తి ఘోషించిన మంత్రి అవినీతి తిమింగలాలను కనిపెట్టి లంచగొండులను అణచే విషయంలో అప్రమత్తత ఎందుకు చూపలేదు? తన శాఖమీదే తనకు అదుపు లేనివాడు మంత్రి పదవికి ఎలా అర్హుడు? కోట్లాది రూపాయల నష్టానికి కారణమైన స్కామ్‌కు సంబంధిత మంత్రికి పూచీ లేదంటే మరి ఎవరిది బాధ్యత? ఈ బాధ్యత నుంచి ముఖ్యమంత్రి ఎలా తప్పించుకుంటారు?
కమీషనర్‌ వెంకటేశ్వర్లు దేవాలయ భూములు అక్రమంగా విక్రయిస్తున్నారని రెండు నెలల క్రితమే మంత్రికి ఫిర్యాదులు అందాయి. దీనిపై కమిషనర్‌ను ఎందుకు వివరణ కోరలేదు? దీనిపై అప్పుడే విచారణ ఎందుకు చేయలేదు? దేవాదాయ శాఖలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత శాఖాపరంగా ఎందుకు సమగ్ర దర్యాప్తు చేయించలేదు? రంగారెడ్డి జిల్లా దేవరయాంజల్‌ ఆలయ భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండా మంత్రే స్వయంగా నిషేధం విధించారు. కాని కమీషనర్‌ యధేచ్ఛగా భూములు విక్రయించారు. మంత్రే ఈ ఫైలుపై సంతకం పెట్టారు. మే నెలలో భూముల విక్రయం నిషేధం ఎత్తివేతకు సంబంధించి ఫైలు మంత్రి వద్దకు వచ్చింది. ఈ ఫైలును ముఖ్య కార్యదర్శి రూపొందించారు. దీనిపై ముందు వెనుక చూడకుండా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరచకుండా, వివరణ కోరకుండా మంత్రి సంతకం పెట్టేశారు. భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండా తనే నిషేధం విధించిన సంగతి తెలిసి కూడా పీసీసీ అధ్యక్షుని సిఫార్సు లేఖపై తగిన చర్యలు తీసుకోమని ఎందుకు చెప్పవలసి వచ్చింది? మంత్రి సిఫారసు ఆధారంగా రిజిస్ట్రేషన్‌ నిషేధ ఉత్తర్వు ఎత్తివేత ఫైలు కూడా కదిలిన మాట వాస్తవం కాదా? తాను విధించిన నిషేధాన్ని మంత్రి ఎత్తివేశారు. పైగా 50 వేలకు పైగా దేవాలయ భూములను విక్రయిస్తానని, ఎమ్మెల్యేలు నియమించిన కమిటీ భూముల రేట్లు నిర్థారిస్తుందని మంత్రి చేసిన ప్రకటనలో ఆంతర్యం ఏమిటి? దీన్నిబట్టి ఈ మొత్తం గోల్‌మాల్‌ మంత్రికి తెలియకుండా జరగలేదు. పీసీసీ అధ్యక్షుడు కేశవరావు చెప్పిన పైరవీని పురస్కరించుకుని కొన్ని భూముల అమ్మకం వ్యవహారం చూడమని తానే అధికారులకు పురమాయించానని మంత్రి సత్యనారాయణరావే స్వయంగా చెప్పారు. దేవుడి మాన్యాల బదలాయింపులపై నిషేధం అడ్డు వస్తుందని అధికారులు సూచించగా తానే నిషేధాన్ని సడలించమని ఆదేశించానని సత్యనారాయణరావు అంటున్నారు. ఈ లెక్కన ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సత్యనారాయణరావే కదా! ఈ కుంభకోణంలో నా తప్పులేదు... పీసీసీ అధ్యక్షుడి తప్పు అంతకంటే లేదు. ప్రిన్సిపుల్‌ సెక్రటరీ తప్పు లేదు... అని మంత్రి బుకాయించడం దారుణం. తప్పు చేసిన మంత్రే తాను అపరాధినని చెప్పుకోవడం.. ఇందుకు ముఖ్యమంత్రిగారు తలూపడం వింతల్లోకెల్లా వింత. భూ విక్రయాల గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ యధార్థమని, అధికారులు తనను తప్పుదారి పట్టించారని మంత్రి సత్యనారాయణరావు మంత్రివర్గ సమావేశంలోనే వాపోయారు. ఈ అడ్డగోలు పందేరాలకు తలుపులు బార్లా తెరిచింది మంత్రే అయినప్పుడు జరిగిన తప్పిదానికి జవాబుదారీ ఆయనది కాకపోతే మరెవరిది? మంత్రి చేస్తున్న వితండవాదాన్ని ముఖ్యమంత్రి సమర్థించడం, ఈ అక్రమాలతో మంత్రికేమీ సంబంధంలేదని చెప్పడం, రాజీనామాను బుట్టదాఖలు చేయడం, మంత్రి శాఖను మార్చటం కాంగ్రెస్‌ రాజకీయ నయవంచనలో భాగమే. ముఖ్యమంత్రి, మంత్రి సత్యనారాయణరావు ఎవరికివారు తాము సచ్చీలురైనట్లు ప్రకటించుకున్నప్పుడు మరి ఈ విచారణలు, దర్యాప్తులెందుకో! నిజానిజాలు తెలియవలసింది న్యాయ పరీక్షలో... కనీసం న్యాయ విచారణ పూర్తయ్యేవరకు మంత్రి పదవి నుంచి సత్యనారాయణరావును తప్పించి ఉంటే వాస్తవాలు బయటపడేవి. అంతవరకు వేచి ఉండే ఓపిక లేకుండా పిల్లికి ఎలుక సాక్ష్యమన్నట్లుగా మంత్రి వాదనను ముఖ్యమంత్రి సమర్థించడం, పనికిమాలిన కితాబులివ్వడం గమనిస్తే ఈ భారీ స్కాంలో ముఖ్యమంత్రి పాత్ర, ఆయన కుటుంబ సభ్యుల నిర్వాకం, మంత్రిగారి కుమారుడి అవినీతి చేష్టలు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇతర నాయకులు, మంత్రులు, ఎంపీలు ప్రచ్ఛన్న హస్తం ఎక్కడ బయటపడుతుందన్న ఆదుర్దా, భయం వ్యక్తమవుతోంది.
కమీషనర్‌ అవినీతి మంత్రికి తెలియదా!
గత కొన్నేళు్ళగా ప్రాధాన్యతలేని పోస్టులకే పరిమితమైన వెంకటేశ్వర్లు దేవాదాయశాఖ కమీషనర్‌గా నియమించటంలో ఎవరి ప్రమేయం ఉంది? ఆయన పదవీ కాలంలో అనేక ఆరోపణలు గుప్పుమన్నా ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు. పదవీ విరమణ ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదు? కమీషనర్‌గా వెంకటేశ్వర్లు ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. మే 31న పదవీ విరమణ చేశారు. ఈ 5 నెలల్లో 350 ఎకరాల భూమిని అమ్మేశారు. వెంకటేశ్వర్లును దేవాదాయశాఖ కమీషనర్‌గా తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషించిందెవరు? గతంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా ఏరికోరి ఈ పదవిలో నియమించిందెవరు? వెంకటేశ్వర్లు నియామకంలో మంత్రి సత్యనారాయణరావు కుటుంబసభ్యుల పాత్రపై అనేక కథనాలు వినవస్తున్నాయి. కొద్ది కాలంలో రిటైర్‌ అయ్యే అధికారిని దేవాదాయ కమీషనర్‌గా నియమించడం వెనుక పెద్ద ఎత్తున సొము్మలు చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. అప్పట్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన జె.పి.మూర్తి, దేవాదాయశాఖ కమీషనర్‌ వెంకటేశ్వర్లుకు మధ్య ఉన్న సంబంధమేమిటి? వీళ్ళిద్దరూ కూడబలుక్కుని వ్యవహారం నడిపినట్లు మంత్రి సత్యనారాయణరావు ఆరోపిస్తున్నారు. దేవాదాయ భూముల క్రమబద్ధీకరణ ఫైలుపై మంత్రి సంతకం చేసిన తరువాతే జీవోలు విడుదలయ్యాయి కదా. దేవాదాయ భూముల కుంభకోణానికి బాధ్యులైన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా కొము్మ కాస్తున్నారని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఈ ఆరోపణల్లో నిజం లేదా?
సత్యనారాయణమూర్తిని ఎందుకు బదిలీ చేశారు?
వెంకటేశ్వర్లు కంటే ముందు దేవాదాయశాఖ కమీషనర్‌గా వ్యవహరించిన సత్యనారాయణమూర్తిని ఎందుకు బదిలీ చేయవలసి వచ్చింది? తమకు అనుకూలంగా వ్యవహరించటంలేదన్న కారణంతో మంత్రి సత్యనారాయణరావు అప్పట్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.పి.మూర్తిపై ఒత్తిడి తెచ్చి సత్యనారాయణమూర్తిని బదిలీ చేసిన మాట వాస్తవం కాదా? కొత్త ఉద్యోగుల నియామకం, భూముల అమ్మకం, ఉద్యోగుల బదిలీ, పదోన్నతుల వ్యవహారంలో మంత్రి సత్యనారాయణరావు కుటుంబీకుల ప్రమేయాన్ని సత్యనారాయణమూర్తి వ్యతిరేకించడంవల్లే ఆయనను బదిలీ చేశారా?
జె.పి.మూర్తిపై అంత మక్కువ ఎందుకు?
దేవాలయ భూముల కుంభకోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తి ఇంటిపై అవినీతిశాఖ అధికారులు దాడులు జరిపారు. దాడులలో ఏ సమాచారం లభించింది. సోదా చేసిన వస్తువులు, లభించిన సమాచారంపై ఎందుకు పంచనామా జరపలేదు. ప్రభుత్వం ఆయనపై ఇంతవరకు ఎటువంటి చర్య ఎందుకు తీసుకోలేదు. దేవాలయ భూముల అక్రమాలపై ఎ.సి.బి. విచారణ జరుగుతుండగానే ఆయన విదేశాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చిం తర్వాత ఆయన ఇంటిపై ఎ.సి.బి. దాడి జరిపింది. ఎ.సి.బి. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం జె.పి.మూర్తిని హోంశాఖ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి ఎందుకు తప్పించలేదు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. దేవాదాయశాఖామంత్రి సత్యనారాయణరావుకు న్యాయ విచారణ మొదలు కాకుండానే క్లీన్‌ చిట్‌ ఇచ్చి శాఖ మార్చి సీఎం హోంశాఖ ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తిపై ఇంకా ఎందుకు మమకారంతో ఉన్నారు. ఒక పక్క ఎ.సి.బి. విచారణ, మరో పక్క న్యాయ విచారణ జరుగుతుండగా ఆయన లాంగ్‌ లీవ్‌లో వెళ్ళేందుకు ఎందుకు అనుమతించారు?
ఈ వ్యవహారంలో వాస్తవాలు ఇలా ఉన్నాయి...
దేవాదాయ భూముల విక్రయ కుంభకోణం వ్యవహారంలో మంత్రి సత్యనారాయణరావు వివిధ సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు, ప్రకటనలు, వార్తా కథనాలు ఇలా ఉన్నాయి... నా శాఖలో భూముల కుంభకోణం చోటు చేసుకోవడం, దుర్మార్గాలకు నెలవుగా మారటంపట్ల దేవాదాయశాఖ మంత్రిగా సిగ్గుపడుతున్నాను'', ``మా శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్లు సెక్షన్‌ 89 కింద ఒనగూడిన అధికారాలపై స్టే ఇవ్వాలని ముఖ్య కార్యదర్శి జె.పి.మూర్తిని కోరాను. ఇచ్చానని నాతో ఆయన అబద్ధం చెప్పారు. దానివల్లే భూముల విక్రయంలో అక్రమాలు జరిగాయి'' ``246 ఎకరాలు తక్కువ ధరకు విక్రయించినట్లు మా దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతోందని నాతో చెప్పారు.'' దేవాలయ భూములకు సంబంధించిన వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు దేవాదాయ శాఖామంత్రి తన పర్సనల్‌ సెక్రటరీ మల్లారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మకాలపై స్టే ఇవ్వమని ముఖ్య కార్యదర్శికి చెప్పి ఆ రకంగా ఆర్డర్లు వచ్చేటట్లు చూడమని మంత్రి పీఎకు చెప్పారు. కానీ మల్లారెడ్డి ఎటువంటి ఉత్తర్వులు తీసుకు రాలేదు అన్నారు. ``అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు అందిన తర్వాత చర్య'' తీసుకుంటమని అప్పటి సీయం వైయస్‌ అన్నారు. అవినీతి నిరోధక శాఖ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాకు అందజేసింది. ఈ నివేదికలో ఐ.ఎ.ఎస్‌. అధికారులను తప్పుపట్టింది. ఈ వాస్తవాలను పరిశీలించి చూస్తే మంత్రి సత్యనారాయణరావుకు కుంభకోణంలో పాత్ర ఉందన్న విషయం స్పష్టమవుతోంది. వ్యవహారం అంతా బయటపడ్డాక మంత్రి సత్యనారాయణరావు రాజీనామా చేసినట్లు ప్రకటించడం, ముఖ్యమంత్రి ఆ రాజీనామాకు తిరస్కరించడం, హైకోర్టు రిటైర్‌‌డ జడ్జితో విచారణకు ఆదేశించడం అంతా హైడ్రామాలో విభిన్న అంకాలు. నిజంగా ప్రభుత్వానికే కనుక సమస్య తీవ్రత పట్ల సరైన అవగాహన, అవకతవకలను అరికట్టి తీరాలన్న పట్టుదల ఉంటే కమిషనర్‌కు పూర్తి అధికారాలు ఇచ్చి ఉండేది కాదు. అంతకు ముందు అవినీతి కుంభకోణం జరగడానికి దారితీసిన పరిస్థితులు, ఆలయ భూముల విక్రయంపే నిషేదం ఎందుకు జారీ చేయవలసి వచ్చింది, తిరిగి నిషేదాన్ని ఎందుకు తొలగించవలసి వచ్చింది. మొదలగు సందేహాలపై ప్రజలకు వాస్తవాలు తెలియవలసి ఉంది. పిసిసి అధ్యక్షుడు కే.కేశవరావు కొన్ని భూముల విక్రయానికి సంబంధించి వచ్చిన దరఖాస్తులను మంత్రి పరిశీలనకు పంపించడం, మంత్రి ఈ దరఖాస్తులను పరిశీలించి తగు చర్య తీసుకోమని ఆదేశించడం గమనిస్తే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అనేక మంది ఉన్నత స్థాయి నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దేవాలయ భూముల విక్రయం, రిజిస్ట్రేషన్‌పై అంక్షలు విధిస్తూ 2004 అక్టోబర్‌ 14వ తేదీన 810 జి.ఓ జారీ చేశారు. 2005 మే 16వ తేదీన ఈ జి.ఓను ఉపసంహరించుకున్నారు. నిషేదం ఉత్తర్వు అమలులో ఉండగానే భూముల విక్రయాలు జరిగిపోయాయి. భూమి మార్కెట్‌ విలువను జిల్లా కలెక్టర్‌ నిర్థారించవలసి ఉండగా ఎమ్మార్వో నుంచి భూమి విలువపై సిఫార్సులు తెప్పించుకుని ఆ మేరకు విక్రయాలు చేసేశారు. తాను బదిలీ అవుతున్నట్లు తెలిసి కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జె.పి. మూర్తి నిషేదం తొలగింపు ఉత్తర్వులను మంత్రి ముందు పెట్టి సంతకం చేయించారు. ముఖ్య కార్యదర్శి అదే శాఖలో మరికొన్ని రోజులు కొనసాగేందుకు మంత్రి సత్యనారాయణ రావు సిఫార్సు చేశారు. దేవాదయ కమీషనర్‌ స్థాయిలో భూముల విక్రయాలలో అవకతవకలు జరుగుతున్నట్లు మంత్రి సత్యనారాయణ రావుకు నెల రోజుల ముందే తెలిసిన అక్రమాలకు అడ్డుకట్ట వేయలేదు. దేవుడి భూములను విచ్చలవిడిగా విక్రయించిన కమీషనర్‌ హాయిగా పదవీ విరమణ చేసేందుకు ప్రభుత్వమే వెసులుబాటు కల్పించింది. దేవాదాయ కమీషనర్‌కు పెద్ద ఎత్తున అండదండలు అందించిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర ఉన్నతాధికార్ల మీద ఎటువంటి చర్య తీసుకోకుండా చిన్న అధికార్లను సస్పెండ్‌ చేసి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. అసలు గజ దొంగలను, ఎవరి జవాబుదారీ లేకుండా వ్యవహరించిన అధికార్లపై ఎటువంటి చర్యలు లేవు. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో వందల కోట్ల రూపాయలలో జరిగిన అధికార దుర్వినియోగానికి మంత్రి సత్యనారాయణ రావు నైతిక బాధ్యత వహించక తప్పదు. కుంభకోణం బయటపడ్డా్ట మంత్రి జరిగిన దానికి సిగ్గుపడుతున్నానని చెప్పడం అవివేకం.
దిక్కులేని దేవుడి ఆస్తులు
రాష్ట్రంలో 32 వేల దేవాలయాలు ఉంటే వాటిలో సుమారు 21 వేల గుళ్ళకు చెప్పుకోదగిన మాన్యం లేదు. పదకొండు వేల దేవాలయాలకు భూములు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 లక్షల 76 వేల ఎకరాల భూములు గుడి మాన్యాల కింద ఉన్నాయి. ఇందులో 77,182 ఎకరాలు మాగాణి; 2.22 లక్షల ఎకరాలు మెట్ట; 5,562 ఎకరాల్లో పళు్ళ, పూల తోటలు ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం భూస్వాముల ఆక్రమణలు ఉన్నాయి. పేద కౌలుదార్లు సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం తక్కువ. ఎన్ని వేల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ వేలాది దేవాలయాలను నిత్య ధూప, దీప, నైవేద్యాది కార్యక్రమాలు నిర్వహించటంలేదు. మాన్యం భూముల నుంచి ఆదాయం ఆలయాలకు అందటంలేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్‌ను నియమించారు. దేవాలయ భూములన్నిటినీ మార్కెట్‌ ధరకు అమ్మి, అలా వచ్చిన సొము్మతో దేవాలయాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈ కమిషన్‌ సిఫార్సు చేసింది. కమిషన్‌ సిఫార్సులను వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టు `స్టే' మంజూరు చేయటంతో ఈ సిఫార్సులు అటకెక్కాయి. ఆలయ భూములను పేదలకు నివేశన స్థలంగా పంచాలని, ఆ విధంగా వచ్చిన భూమికి వెలకట్టి ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెల్లించాలని 1995లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 29, 1995న జీవో జారీ చేశారు. ఈ జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్ళి `స్టే' తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్ళింది. కౌలుదారులకు రెండున్నర ఎకరాల మాగాణి, అయిదు ఎకరాల మెట్ట భూమి మించకుండా కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కౌలుదారుకు కేటాయించిన భూమికి మార్కెట్‌ రేటులో నాలుగింట మూడు వంతులు వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.

Friday, September 10, 2010

అంబరంలో వినాయక నక్షత్రాలు

భాద్రపద శుద్ధ చవితినాడు మనం వినాయక చవితి వేడుకలను జరుపుకుంటాం. అయితే, అసలు చవితినాడు పండుగ ఎందుకు చేసుకుంటాం? ఆ రోజు వినాయకుడు గణాలకు నాధుడిగా నియమించబడ్డాడు. కనుక ఆ రోజు హిందూవులకు అతి పవిత్రమైన రోజు. విఘ్నేశ్వరుని పూజించి సేవిస్తారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది...! సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రాలు ఉదయిస్తాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన దేవుడి పండుగ జరుపుకోవాలనేది రుగ్వేదంలోని నియమం. కనుక భాద్రపద శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు తూర్పున వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి. కాబట్టి ఆ రోజు వినాయక చవితిగా భారత దేశంలోని హిందూవులు వేడుకలు జరుపుకుంటారు. అలాగే, గ్రహాల్లోకెల్లా ముఖ్యమైన గ్రహం శనిగ్రహం. శనీశ్వరుడి ప్రభావం మనకు తెలిసిందే. సకల దేవతలూ భయపడే శనీశ్వరుడు స్వయం రక్షణ కోసం వినాయక కవచాన్ని ధరిస్తాడట. వినాయకుని మహత్యం ఇంతా అంతా మరి...!
పార్వతీ పరమేశ్వరుల కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పెరిగి పెద్దవారయ్యారు. తన తర్వాత గణాలకు అధిపతిని నియమించే సమయం ఆసన్నమైందని ఈశ్వరుడు తలిచాడు. ఆ సమయంలో నేనే పెద్ద! అంటూ కుమారస్వామి అన్నగారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఏనుగు తొండం ఉన్నవాడు అధిపతి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దీంతో కైలాసనాథుడు ఇద్దరు కుమారుల మధ్య ఓ పోటీ పెట్టాడు. భూలోకంలోని సమస్త పుణ్యతీర్థాలలో ముందుగా స్నానమాచరించి ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే పట్టం కడతానని మహేశుడు చెప్పాడు. దీంతో వాయువేగంతో నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్లాడు. తన మూషిక వాహనంపై వెళ్లి ఎలా విజయం సాధించగలనని విఘ్నేశ్వరుడు చింతాక్రాంతుడయ్యాడు. తల్లిదండ్రులే దైవమని భావించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయసాగాడు. అచట స్నానానికి వెళ్లిన కుమారస్వామికి అన్నయ్య స్నానం పూర్తి చేసుకుని ఎదురు రావడం కనిపించింది. దీనితో అన్నగారి మహత్యం తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడే పట్టానికి అర్హుడని భక్తితో తండ్రికి తెలిపాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు గణాలకు నాయకుడిగా విఘ్నేశ్వరుని నియమించాడు. అప్పటినుంచీ ఆయనకు గణనాధుడు, గణేశుడు అని పేర్లు వచ్చాయి.

శుభాలు కలిగించే పత్రాల పూజ...!

వినాయక చవితి నాడు చేసే పూజలో కీలకమైనది 21 ప్రతాలతో చేసే పూజ. ఈ పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోయి అషై్టశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీపత్రం అంటే చేమంతి జాతికి చెందిన ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. వీటితో పాటు బృహతీ పత్రం, దీన్నే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి. శమీపత్రం, జమ్మిచెట్టు ఆకులను శమీపత్రాలు అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. మరువక పత్రం, వీటినే ధవనం, మరువం అని కూడా అంటారు. పూల మాలల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కరవీర పత్రం, ఈ పత్రాలను గన్నేరు పత్రాలని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఈ పూలు ఉంటాయి. బిల్వ పత్రం, ఈ పత్రాలను మారెడు దళాలని అంటారు. మూడు ఆకులు కలిసి ఉండే దీనిని దళం అంటారు. వీటితో శివుడిని పూజిస్తే చాలా మంచిది. చూత పత్రం, ఇవే మామిడి ఆకులు. బదరీ పత్రం, బదరీ అంటే రేగాకులు. రేగి కాయ చెట్టుకు ఉండే ఆకులు ఇవి. వీటిలో రేగు, జిట్రేగు, గంగిరేగు అని మూడు రకాలు ఉంటాయి. గుండ్రంగా ఉండే ఆకులను పూజకు ఉపయోగించాలి. విష్ణుక్రాంత పత్రం, తెలుపు, నీలం రంగు పులుండే చెట్లు ఇవి. నీలం రంగు పులు ఉండే చెట్టును విష్ణుక్రాంత చెట్టుగా పిలుస్తారు.
సింధువార పత్రం, దీన్నే వావిలి అని కూడా పిలుస్తుంటారు. అశ్వత్థ పత్రం, ఇవే రావి ఆకులు. దాడిమీ పత్రం దాడిమీ అంటే దానిమ్మ. దానిమ్మ ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు. జాజి పత్రం, ఇవి మల్లి జాతికి చెందిన ఓ రకమైన మొక్కలు. అర్క పత్రం, ఇవే జిల్లేడు ఆకులు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, పచ్చ జిల్లేడు. వీటిలో ఏవైనా పూజకు శ్రేష్టమైనవే. అర్జున పత్రం, మద్దిచెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు. మర్రి ఆకుల వలె ఇవి ఉంటాయి. దేవదారు పత్రం, దేవతలకు ఈ పత్రం అంటే చాలా ఇష్టం. ఇవి సన్నగా గడ్డిలా ఉంటాయి. గండలీ పత్రం, దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగలాగా ఆ చెట్టు పెరుగుతుంది.

Wednesday, September 8, 2010

వివాదాల వంశధార

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదులున్నా ఉత్తరాంధ్రకు ఊతగర్ర, వ్యవసాయానికి జీవగర్ర, ఖచ్చితంగా వంశధారే. శ్రీకాకుళం జిల్లా సాహిత్యం, చరిత్ర, మానవ చరిత్రలకు ఆధారాలకు వంశధారే ఆలవాలం. ఒరిస్సా రాష్ట్రంలో కోరాపుట జిల్లాలో తూర్పు కనుమల్లో పుట్టిన వంశధార నది సాగర సంగమం వరకు సుమారు 263 కిమీ ప్రయాణించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలోకి చేరుతుంది. ఈ నది ఒరిస్సా రాష్ట్రంలో 154 కిమీ, ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో 29 కిమీ, శ్రీకాకుళం జిల్లాలో 82 కిమీ ప్రవహిస్తుంది. వంశధార రెండు రాష్ట్రాలలో ప్రవహించినా దాని పరివాహ ప్రాంతం అంతా తెలుగు భాషా ప్రాంతం అంటే అతిశయోక్తి కాదు. ఉత్కళాంధ్ర సమైక్యతకు, కళింగాంధ్ర సమగ్రతకు ప్రతీక వంశధార. స్వాతంత్య్రానంతరం కేంద్ర జలవనరుల సంఘం వంశధార నదీ జలాల ప్రవాహాన్ని అంచనావేసింది. జూలై 2007 అంచనా ప్రకారం వంశధార నదిలో నీటి ప్రవాహం 105 టిఎంసిలుగా నిర్ధారించి అందులో 75 శాతం మాత్రమే ఆధారపడినదగిన నీటి పరిమాణంగా పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే వంశధార నది నీటిలో 78.75 టిఎంసిల నీరు ఆధారపడదగిన పరిమాణంగా నిర్ధారించవచ్చు. అయితే వంశధార నది నీటిపై ఇంతకు ముందు అధ్యయనాలు వాటి ఫలితాలను కూడా పరిశీలిస్తే 1962లో నీటి పరిమాణాన్ని 115 టిఎంసిలుగాను, 1999లో 112.452 టిఎంసిలుగాను, 2007లో 105 టిఎంసిలుగాను కేంద్ర జలవనరుల సంఘం గుర్తించినట్టు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వీటి సగటుని ఆధారంగా చేసుకుని చూసినా వంశధార నదిలో 110 టిఎంసిల నీటి పరిమాణం వున్నట్టు గుర్తించవచ్చు. అయితే తాజా లెక్కల ప్రకారం ఆధారపడదగిన నీటి ప్రవాహం (గొట్టా బారేజ ఎగువ ప్రాంతంలో) పరిగణించినా 78.75 టిఎంసిలు నీరు లభ్యత వుంటుందని చెప్పవచ్చు.
వంశధార ఒప్పందాలు:
వంశధార నదీ జలాల పంపిణీ విషయంలో 1962కు పూర్వ ఆంధ్రప్రదేశ, ఒరిస్సా రాష్ట్రాల మధ్య ఒప్పందాలుగానీ, అంగీకారాలు కానీ లేవు. సెప్టెంబర 30, 1962న ఇరురాష్ట్రాల వంశధార నది నీటిని 50:50 నిష్పత్తిలో సరిసమానంగా వినియోగించుకోవాలని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇదే ఒప్పందాన్ని పునరుద్ఘాటిస్తూ 3-10-1962న మరోసారి ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రత్యేక వర్తమానాలు అందచేసుకున్నారు. 10-6-1992, 30-12-1994 తేదీల్లో జరిగిన ముఖ్యమంత్రి స్థాయి సమావేశాల్లో కూడా నీటి జలాల వినియోగంలో 1962 ఒప్పందాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి బలపరుస్తూ ధృవీకరించారు. అందుచేత వంశధార నదీ జలాల పంపిణీలో ఎటువంటి విభేదం లేదని భావించవచ్చు.
వివాదానికి పునాదులు ఎక్కడ?
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వంశధార నదీ జలాల్లో వినియోగించుకుంటున్న నీటి పరిమాణం కేవలం 17.4 టిఎంసిలే. దానిని కూడా గొట్టా బ్యారేజి నిర్మాణం (1977) అనంతరం మాత్రమే వినియోగించుకోగలుగుతున్నది. గొట్టా బ్యారేజీకి ఎగువన నేరడి బ్యారేజీ నిర్మాణం జరపడం ద్వారా మరో 19 టిఎంసిల నీటి వినియోగించుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదన ఒరిస్సా రాష్ట్రం ముందు 1960లోనే ఉంచడం జరిగింది. ఇందుకు సానుకూలంగా ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం తన అంగీకారం తెలిపింది. ఈ అంగీకరించిన అంశాలలో ప్రధానమైంది కీలకమైనది భవిష్యత్తులో వివాదానికి కేంద్ర బిందువైనది ముంపు ప్రాంతం. 1961లో ఇచ్చిన అంగీకారంలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ముంపునకు గురయ్యే 106 ఎకరాలకు కూడా అభ్యంతరం లేదంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ఇప్పటికీ ఈ వివాదం నేరడి బ్యారేజి నిర్మాణం పైనగాని, అది నిర్మితమైన ప్రదేశంపైన గాని లేదు. 1961లో ఒరిస్సా రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని 1962, 1980, 1987, 1991, 1994లలో జరిగిన అంతర్‌రాష్ట్ర సమావేశాలలో ఒరిస్సా అంగీకరిస్తునే ఉంది. 1980లో వచ్చిన వంశధార వరదలలో సుమారు ఆరులక్షల క్యూసెక్కులు వంశధార నదిలో ప్రవాహంగా లెక్కించారు.ఇంతటి ప్రవాహాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేరడి బ్యారేజ్‌ నిర్మాణంలో పరిగణించలేదన్నది ఒరిస్సా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ దృష్టికి 1981లో తెచ్చింది. ఇందుకు అనుగుణంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం 22-6-1981న నేరడి బ్యారేజ్‌ రీడిజైన్‌ చేసేందుకు అంగీకరించింది. అలాగే 25-8-1985న జరిగిన మరో అంతర రాష్ట్ర సమావేశంలో మేగ్జిమమ్‌ ఫ్లడ్‌ లెవెల్‌ 74.40 మీటర్లుగా వుండాలని, కో ఎఫిషియంట్‌ డిస్‌చార్జి 2.95గా పేర్కొన్నప్పటికీ 2.8 మాత్రమే వుందని తన అభ్యంతరాలని ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసి 10-9-1985న కేంద్ర జలవనరుల సంఘానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించింది. 8-4-1988, 10-6-1992 తేదీల్లో జరిగిన రెండు సమావేశాలలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం తనకు నేరడి బ్యారేజి వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించడంపట్ల సమ్మతి తెలిపింది. అయితే నేరడి బ్యారేజీ ఎత్తును మాత్రం మేథమెటికల్‌ మోడల్‌ స్టడీ ప్రకారం నిర్ణయించాలని ప్రతిపాదించింది. ఈ విధంగా బ్యాక్‌వాటర్‌‌స, ముంపు ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలను గుర్తించవచ్చన్నది ఒరిస్సా వాదన. ఇందుకు ఇరు రాష్ట్రాలు 10-7-1999న అంగీకరించాయి. దానికి అనుగుణంగా కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో స్టడీ జరిగింది. 31-5-2000న కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నేరడి బ్యారేజీకి సంబంధించి టెక్నో-ఎకనామిక్‌ వయబిలిటీ మంజూరు చేసింది. అలాగే మేథమేటికల్‌ మోడల్‌ స్టడీ రిపోర్టు 27-6-2000న మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. దీనిని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవసరం కంటే ఎక్కువగా వున్నాయని, ముంపు, ప్రభావిత ప్రాంతాల రక్షణకు ఎటువంటి ఢోకా వుండబోదని కేంద్ర జలవనరుల సంఘం తేల్చి చెప్పడమే కాకుండా ఒరిస్సా రాష్ట్రం వ్యక్తం చేసిన అభిప్రాయాలు నిరాధారమైన అపోహలుగా తేల్చింది. నిజానికి ఇంతటితో ఈ వివాదం సద్దుమణగాల్సి వున్నప్పటికీ ఒరిస్సా రాష్ట్రం మేథమెటికల్‌ మోడల్‌ స్టడీ రిపోర్టును అంగీకరించలేదు. సరికదా ఫిజికల్‌ మోడల్‌ స్టడీ జరగాలని వాదనను ముందుకు తెచ్చింది. 15-2-1001న జరిగిన అంతర రాష్ట్ర సమావేశంలో ఒరిస్సా లేవనెత్తిన డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ స్టడీ నిర్వహించేందుకు సిడబ్లు్యపిఆర్‌ఎస్‌, పుణెకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. వివిధ రకాల అధ్యయనాల అనంతరం సిడబ్లు్యపిఆర్‌ఎస్‌ నివేదిక 28-2-2005న ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చేరింది. ఫిజికల్‌ మోడల్‌ స్టడీ, మేథమేటికల్‌ స్టడీ నిర్ధారించిన విషయాలు వాస్తవమేనని, నేరడి బ్యారేజి నిర్మాణంలో ఒరిస్సా వ్యక్తం చేస్తున్న ముంపు భయం వాస్తవం కాదని మరోసారి నిర్ధారించింది. అలాగే వంశధార నది 10.37, 11.96 (కాట్రగడ గ్రామం దగ్గర) కిమీల వద్ద కొద్దిగా అవరోధాన్ని తొలగించడం ద్వారా బ్యాక్‌వాటర్‌‌స, ముంపు ప్రభావాలను మరింతగా తగ్గించవచ్చునని నివేదిక స్పష్టం చేసింది. అయితే ఈ నివేదికను కూడా ఒరిస్సా ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌, ఒరిస్సా రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం 24-2-2005న జరిగింది. ఈ సమావేశంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్‌2, ఫేజ్‌2పై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లతో ఒక టెక్నికల్‌ ఎక్‌‌సపర్‌‌ట కమిటీని రూపొందించి మూడు నెలలలోగా నివేదిక వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే మూడు నెలల్లోగా ఇరు రాష్ట్రాలు ఎలాంటి పనులు చేపట్టరాదని కూడా నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం తరఫున కమిటీలో సభ్యులుగా వుండాల్సిన నిపుణుల జాబితాని రూపొందించి ఒరిస్సాకు పంపింది కానీ, ఆ రాష్ట్రప్రభుత్వం స్పందించలేదు. ఈ విధంగా మూడు నెలల కాలం గడిచిపోయిన అనంతరం (డెడ్‌లైన్‌ 23-05-2005తో ముగిసింది). 4-4-2006న ఒరిస్సా ప్రభుత్వం తాను నియమించదలుచుకున్న నిపుణులు పదవీవిరమణ చేసారని, అందుచేత నూతన కమిటీ అవసరమని తెలిపింది.ఈ కారణంవల్ల రెండు రాష్ట్రాలు అంగీకరించిన కమిటీ నిర్మాణంగాని, సమావేశాలుగాని జరగకుండానే సమయం ముగిసిపోయింది.
ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా ఒరిస్సాతో వివాదం లేకుండా మన రాష్ట్ర భూభాగంలో కాట్రగడ్డ గ్రామం వద్ద సైడ్‌వియర్‌ నిర్మించి వరద నీటిని మళ్లించి సింగిడి, పారపురం బేలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటుగా, హీరమండలం వద్ద 19టిఎంసి సామర్ధ్యంగల రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 933 కోట్ల రూపాయలు కేటాయింపు జరిపింది.
మొత్తం వంశధార పనులు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2,55,000 ఎకరాలకు ఆధారపడదగిన సాగునీటిని, సుమారు 8000 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ సందర్భంగా కాట్రగడ్డ వద్ద నిర్మించే సైడ్‌వియర్‌ నిర్మాణం పూర్తిగా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, నేరడి బ్యారేజి నిర్మాణంపై తుది నిర్ణయానికి లోబడే ఇది నిర్మితం అవుతుందని ఒరిస్సా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాట్రగడ్డ సైడ్‌వియర్‌ మట్టం నదిమట్టం కంటే సుమారు 0.9 మీటర్లు ఎత్తుగా నిర్మించనుండడంవలన నదిలో నీటి వనరులు 4000 క్యుసెక్కులు వరకు అందుబాటులో కొనసాగుతుందని వివరించింది. అదేవిధంగా వరద కాలువ నీటి గరిష్ట సామర్ధ్యం 8000 క్యూసెక్కులు కావడం వలన అదనపు నీటిని ఆంధ్రప్రదేశ్‌ వంశధారనుంచి తరలించే అవకాశం కూడా వుండదని తెలియపరిచింది. అంతర్‌రాష్ట్ర సమావేశంలో (24-4-2006) ఈ విషయాలను ఒరిస్సా రాష్ట్రం ముందుంచారు. ఈ సమావేశంలోనే కాట్రగడ్డ సైడ్‌వియ్‌ర్‌ ద్వారా వంశధారనది ప్రవాహ దిశను మార్చే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్నదన్న ఆరోపణ చేసింది. అందువల్ల ఈ అంశాలపై అనుమానాలు నివృత్తి చేసేందుకు మేథమెటికల మోడల స్టడీ లేదా ఫిజికల్‌ మోడల్‌ స్టడీ నిర్వహించి నిర్ణయించాలని సమావేశంలో తీర్మానించారు. దానిని అనుసరించి సిడబ్లు్యపిఆర్‌ఎస్‌ పుణె పరిశోధనలు చేసి జులై 2007లో తననివేదికను ఇరు రాష్ట్రాలకు పంపింది. ఒరిస్సా వాదనలు నిరాధారమని ఈ నివేదిక బహిరంగపరచగా ఈ నివేదికపై సైతం ఒరిస్సా తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఒరిస్సా అభ్యంతరాలపై మరోసారి అధ్యయనం చేసిన సిడబ్లు్యపిఆఱ్‌ఎస్‌ 12-3-2008, 24-3-2008 తేదీల్లో మరిన్ని వివరణలతో ఒరిస్సా రాష్ట్ర అభ్యంతరాలను అసమంజసంగా తేల్చి చెప్పంది. ఈ విధంగా ఒరిస్సా చేస్తున్న వాదనలు కేవలం ఊహాజనితమైనవిగా నిరూపితమైనాయి.
వంశధార సుప్రీంకోర్టు కేసు
ఒరిస్సా రాష్ట్రప్రభుత్వం ఒకవైపు చర్చలు నిర్వహిస్తునే 13-2-2006న సుప్రీంకోర్టులో రిట్‌పిటిషన 443/2006 దాఖలు చేసింది. ఈ కేసు అంతర నదీజలాల వివాద చట్టం పరిధిలో నమోదైంది. కేంద్ర ప్రభుత్వానికి ఇదే చట్టం పరిధిలోని సెక్షన 4 కింద ఒక సంవత్సరం గడువు వున్నప్పటికీ సమయం ముగియక ముందే కేసు దాఖలు చేసింది. ఇదే కేసులో కేంద్ర ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలు చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, అంగీకారం సాధించగలనన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ కూడా తన వాదనలను వినిపించింది. భారత సుప్రీంకోర్టు 6.2.2009న ఒరిస్సా వాదనలను పాక్షికంగా అంగీకరిస్తూ వంశధార పనులపై స్టే విధించింది. వంశధారపై ట్రిబ్యునల్‌ను నియమించి శాశ్వతంగా స మస్య పరిష్కరించాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 2010లో కేంద్ర ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్‌ను నియమించింది. ఈ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారమైతేనే శ్రీకాకుళం జిల్లాలో వంశధార పరవళ్లు తొక్కుతుంది.
ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1.48 లక్షల ఎకరాలు, కుడి ప్రధాన కాలువద్వారా 82 వేల ఎకరాలు, హైలెవల్‌ కాలువద్వారా 5 వేల ఎకరాలు, ఫ్లడ కాలువ ద్వారా 20వేల ఎకరాలు పూర్తిస్తాయిలో సాగులోకి వస్తుంది. ఇప్పటికి అర్ధశతాబ్దం పైగా నేరెడి బ్యారేజి నిర్మాం పెండింగ్‌లో పడిపోవడంవలన సుమారు 45 కోట్లతో నిర్మించాల్సిన బ్యారేజి వ్యయం ఇప్పుడు వెయ్యికోట్లకు చేరుకుంది.
రాష్ట్రంలో చివరాఖరి జిల్లాలో ప్రాజెక్టు కావడంవల్ల నిరాదరణకు వంశధార గురవుతుందన్న విమర్శలున్నా ఇప్పటికైనా అన్ని రాజకీయ పక్షాలు ఒక్కతాటిపై నిలిచి రైతులకు సాగునీటిని అందించే దిశగా కృషిచేయాలని ఆశిద్దాం.
- పాతులోతు పాండు నాయక్‌

పారిశ్రామికాభివృద్ధి - సమస్యలు

ఒక ప్రాంతపు అభివృద్ధి వ్యవసాయరంగాభివృద్ధి పైనే కాకుండా దాని పారిశ్రామికాభివృద్ధి పైన కూడా వుంటుంది. పారిశ్రామిక రంగంలో అభివృధ్ధి మన రాష్ట్రంలో తక్కిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే వెనుకబడి వుందని తెలుస్తుంది. మన రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి 1970తోనే ప్రారంభమయిందని చెప్పవచ్చు. మన రాష్ట్ర ఉత్పత్తులలో పారిశ్రామిక రంగ ఉత్పత్తి 1980-81లో 18 శాతం. ఇది 1988 నాటికి 22 శాతానికి పెరిగింది. ఈ కాలంలో ఈ ఉత్పత్తి స్థాయి మహారాష్ర్టలో 35 శాతం. దేశం మొత్తం మీద 28 శాతం. దేశం మొత్తంతోనూ మహారాష్ర్ట, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలతోనూ పోల్చిచూస్తే మన రాష్ట్రం వెనుకబడి వున్నదని తెలుస్తుంది. మన తలసరి పారిశ్రామిక ఉత్పత్తి 1986-87లో రూ.230 వుండగా మహారాష్ట్రంలో రూ.857 గుజరాత్‌ లో రూ.676. అలాగే క్రొత్త లైసెన్సుల మంజూరులో కూడా మనం వెనుకబడి వున్నాం. ముఖ్యంగా 1980 తరువాత పారిశ్రామికంగా కొంత పురోగమిస్తున్నాము. ప్రస్తుతం మన రాష్ట్రంలో సిమెంటు, కాగితం, జింకు, లెడ్‌ పరిశ్రమలు ప్రధానంగా వున్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడే పరిశ్రమలతో పాటు కొన్ని నూతన పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. ఇది ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌‌స, కెమికల్‌‌స, మెటల్‌ మొదలైన రంగాలు. రాష్ట్రంలో లభ్యమయ్యే బాకై్సటును ఉపయోగించే అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు కృషి జరుగుతోంది. ఈ రంగాల వుత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే అవకాశాలు మెరుగవుతున్నాయి. పంచదార, వస్త్రాలు, జౌళి, తోళ్ల వస్తువుల తయారీ, ఆహార ధాన్యాలు వీటికి సంబంధించిన వినియోగ వస్తువుల ఉత్పత్తి పెరుగుతోంది. దాన్తో బాటు వీటి ఎగుమతులు కూడా ఈ మధ్య కాలంలో పెరగుతున్నాయి. ఇది ముదావహమైన సంగతి. పరిశ్రమల అభివృద్ధి వలన ముఖ్యంగా వ్యవసాయరంగంపై ఆధారపడే పరిశ్రమల అభివృద్ధివలన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధీ, అక్కడ ఉపాధి అవకాశాలూ కూడా మెరుగవుతాయి.
ప్రారిశ్రామల అభివృద్ధి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వనరుల వినియోగానికి పథకాలను తయారుచేసి ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఎన్‌.ఆర్‌.ఐ.ల పెట్టుబడులను ఆకర్షించే నూతన పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ పరిశ్రమల అభివృద్ధికి కావలసిన పరపతి మార్కెటింగ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. సత్వర పారిశ్రామికాభివృద్ధికి విద్యుచ్చక్తి, చాలాముఖ్యం. దీని కొరత వలన అభివృద్ధి కుంటుపడుతోందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. విద్యుచ్చక్తిని ఇంకా ఎక్కువగా ఎంత చౌకగా ప్రభుత్వం అందివ్వగలిగితే అంత త్వరితగతిని పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలు కూడా విద్యుచ్చక్తిని వినియోగించుకుని అభివృద్ధి చెందుతాయి. 7వ పంచవర్ష ప్రణాళికలో మన రాష్ట్రంలో ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడి తక్కిన కొన్ని రాష్ట్రాలతో పోల్చిచూస్తే చాలా తక్కువ. బొగ్గు, జలపాతాల ద్వారా సంప్రదాయక పద్ధతులలో విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయడంతోబాటు నూతన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించి సూర్యరశ్మి, గాలి, సముద్ర కెరటాల ద్వారా విద్యుచ్చక్తి ఉత్పత్తికి కొత్త ప్రక్రియలను ప్రభుత్వం చేపట్టాలి. వీటిలో ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలి.
యువతకు ఉపాధి కల్పనా పథకాలు
మన రాష్ట్రంలో జనాభాలో పనిచేసే వారి (వర్‌‌క ఫోర్సు) సంఖ్య హెచ్చు. దీనికి కారణం జీవనాధారానికి స్త్రీలు, పిల్లలు కూడా అధిక సంఖ్యలో పనిచేయడమే. అంతేకానీ ఎక్కువ మంది పనిచేయడం పూర్ణ ఉద్యోగితకు నిదర్శనం కాదు. మన రాష్ట్రంలో పనిచేసే వారి సంఖ్య జనాభాలో సుమారు 42 శాతం వున్నా తలసరి ఆదాయాలు మాత్రం తక్కువే. పంజాబు, హర్యానా రాష్ట్రాలలో పనిలో పాల్గొనే వారి సంఖ్య జనాభాలో 29 శాతం వున్నా వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువ. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల వేతనాలలో ప్రాంతీయ వ్యత్యాసాలు కనపడతాయి. అభివృద్ధి చెందిన జిల్లాలలో సహజంగానే వ్యవసాయ కూలీల వేతనాలు ఎక్కువ. వెనుకబడిన జిల్లాలో కూలీల వేతనాలు తక్కువగా వుండటమే కాకుండా జనాభాలో ఎక్కువ మంది పనిలో పాల్గొనవలసి వస్తుంది. మన వ్యవసాయ రంగంలో ఉపాధికి సంబంధించిన ముఖ్య సమస్య పని దినాలలో కనిపించే హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స). సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడిన సంవత్సరాలలో పని దినాలు పెరుగుతాయి. దారిద్య్రరేఖకు దిగువన వున్న వారి సంఖ్య కూడా తగ్గుతుంది. అనావృష్టి సంవత్సరాలలో ఉపాధి తక్కువ. దారిద్య్రం అనుభవించే వారి సంఖ్య కూడా సహజంగానే ఎక్కువవుతుంది. ఇందువలన నీటి వసతి కలిగిన ప్రాంతాలలోని కూలీల ఆదాయాలతో పోల్చి చూస్తే మెట్ట ప్రాంతాలలోని చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల ఆదాయాలు చాలా తక్కువగా వుంటాయి.
నీటి పారుదల సౌకర్యాలను పెంచి డ్రైనేజ పథకాలను సక్రమంగా అమలు చేయడంవలన ఉత్పత్తి పెరగడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాల్ని, ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చు. రోజ్గార్‌, తదితర ఉపాధి కల్పనా పథకాలను ఆయా ప్రాంతాల వనరులకు అనుగుణంగా రూపొందించి అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను ఎక్కువ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, విద్యుచ్చక్తి విద్యా, వైద్య సదుపాయాలను త్వరితగతిని కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుచేయవచ్చు. తత్ఫలితంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు తగ్గుతాయి. పట్టణాలకు వలసలను అరికట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పెట్టున పెట్టుబడి అవసరముండదు. కానీ దీనికి కావలసింది సరియైన ప్రనాళికలు త్వరితంగాను, సమర్థవంతంగానూ అమలు పరచడం దీనికి ముఖ్యం కార్యదీక్ష.
- పాతులోతు పాండు నాయక్

రాష్ట్రాభివృద్ధి వ్యవసాయంపైనే ఆధారపటి ఉంది

సూక్షంగా పరిశీలిస్తే మన రాష్ట్రాభివృద్ధిలో సమతౌల్యం లోపించిందని తెలుస్తుంది. ప్రాంతీయ అసమానతలు కొన్ని రంగాలలో స్పష్టంగా కనబడతాయి. కోస్తా జిల్లాలు వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించగా పారిశ్రామిక రంగంలో అంత అభివృద్ధి కనపడదు. తెలంగాణా ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయ రంగం వెనుకబడి వుంది. రాయలసీమ జిల్లాలు ఈ రెండు రంగాలలోనూ వెనుకబడి వున్నాయి.
రాష్ట్రాభివృద్ధిని, దేశాభివృద్ధితోనూ తక్కిన రాష్ట్రాల అభివృద్ధితోనూ పోల్చి చూచినపుడు మన అభివృద్ధి స్థాయి అవగతమవుతుంది. మన రాష్ట్ర ఆర్ధికాభివృధ్ధి 1960వ దశాబ్ధంలో 2.5 శాతం, 1970 దశాబ్ధంలో 3.12 శాతం, 1980 దశాబ్ధంలో 4.5 శాతం వుండగా ఈ దశాబ్ధాలలో భారతాభివృద్ధి వరుసగా 3.51, 3.33, 5.27 శాతంగా వున్నాయి. రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృద్ధి శాతంకన్నా ఎప్పుడూ తక్కువగానే వుంటూ వచ్చింది. మన రాష్ట్రం 1980 దశాబ్ధంలో సాధించిన అభివృద్ధి శాతం ప్రాథమిక రంగాల్లో (ప్రైమరీ సెక్టార్‌) 3.4, ద్వితీయ రంగంలో (సెకెండరీ సెక్టార్‌) 4.3, తృతీయరంగంలో (టెరిటరీ సెక్టార్‌) 6.7 వుండగా దేశం మొత్తం మీద ఈ రంగాల్లో అభివృద్ధి శాతం వరసగా 3.9,6.9,6.2గా వున్నాయి. తృతీయ రంగం మినహా మిగిలిన రెండు రంగాలలో మన రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృధ్ధి శాతం కన్నా తక్కువగా వుంది. ఈ దశాబ్ధంలో రాష్ట్రం తాలూకు మొత్తం అభివృద్ధి శాతం 4.5 వుండగా దేశాభివృధ్ధి శాతం 5.6. అంటే కీలక వుత్పాదక రంగాలైన వ్యవసాయం వస్తుత్పత్తి రంగాలలోనే గాక మన రాష్ట్రాభివృద్ధి శాతం దేశాభివృద్ధి శాతం కన్నా తక్కువగా వుండటం గమనించవచ్చు. అలాగే ఈ కాలంలో రాష్ట్ర తలసరి నికర దేశీయోత్పత్తి(నెట డొమెస్టిక ప్రొడక్ట) ప్రస్తుత ధరలలో (కరెంట ప్రైసెస్‌) దేశ తలసరి నికర దేశీయోత్పత్తి కన్నా 1974-75 సంవత్సరాలలో మినహా తక్కువగానే వుంది. పై రెండు సంవత్సరాలలో మాత్రం ఈ రెండూ ఇంచుమించు సమానంగా వున్నాయి.
వ్యవసాయ రంగాభివృద్ధి - సమస్యలు
మన రాష్ట్రాభివృద్ధి రేటు ఈ మధ్యన మందగించింది. సహజ వనరులలోనూ, నీటి వసతి కలిగిన వ్యవసాయ భూముల విస్తీర్ణములోనూ, ఎరువుల వాడకములోనూ, నూతన సేద్యపు సాంకేతిక పద్ధతులు ప్రవేశ పెట్టడంలోనూ మన రాష్ట్రం దేశ సరాసరికన్నా ముందుగానే వుంది. కానీ వ్యవసాయ ఉత్పత్తులలో దేశ సరాసరి ఉత్పత్తుల కంటే వెనుకబడి వుంది. సాగునీటి వనరులు, ఎరువుల వాడకంలో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు విశేషమైన ప్రగతిని సాధించాయి. ఆ రాష్ట్రాలలో దారిద్య్ర రేఖకు దిగువ వున్న జనాభా శాతం తక్కువ. ఈ రాష్ట్రాలతో పోల్చి చూచినపుడు మన రాష్ట్రం వెనుకబడి వుంది. దీనికి కారణాలు, మన రాష్ట్రంలోని పంట భూముల్లో 35 శాతం భూములకు మాత్రమే సేద్యపు నీటి వసతి వుంది. ఈ శాతాలు పంజాబ్‌లో 88, హర్యానాలో 62. మన రాష్ట్రంలోని మిగిలిన భూములు అన్నీ వర్షాధారమైనవి. ఇక్కడి పంట సక్రమ సకాల వర్షాలపై ఆధారపడి వుంటుంది. సర్వసాధారణంగా ఈ ప్రాంతాలు అతివృష్టి, అనావృష్టి, తుఫానులకు గురి అవుతున్నాయి. వీటి వలన పంటలు బాగా దెబ్బ తింటింన్నాయి. ఒక ఏడాదిలో వీటివలన జరిగిన నష్టాన్ని పోడ్చుకోవడానికి రైతులకు 3 లేక 4 సంవత్సరాలు పడుతోంది. కోస్తా ప్రాంత భూములు సారవంతమైనవి. అయినా, పై కారణాల వల్ల నిలకడగా ప్రతి ఏడాది పంట లభించడం లేదు. డెల్టాప్రాంతాలలో మురుగు నీటి సమస్య ముఖ్యమైనది. ఈ ప్రాంతాలలో మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం వల్ల ఖరీఫ పంట చాలా నష్టమౌతోది. డ్రైనేజి పధకాలపై ప్రభుత్వము చేసే ఖర్చు స్వల్పం. అది కూడా సక్రమంగా వినియోగ పడటం లేదంటున్నారు. సాగు నీటి సదుపాయం లేని జిల్లాలలో వుత్పత్తి, ఉపాధి అవకాశాలు తక్కువ. ఈ జిల్లాలలో దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న జనాభా శాతం కూడా ఎక్కువే. వ్యవసాయ కూలీల కుటుంబాలేకాక అనేక మంది చిన్న సన్నకారు రైతులు కూడా ఈ తరగతికి చెందినవారే. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్‌నగర, రాయలసీమాలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో ఈ పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ మెట్ట ప్రాంతాలే. వీటికి అనువైన విత్తనాలు, వీటిని ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా వ్యవసాయ పరిశోధన కేంద్రాలకే పరిమితమై వుండిపోయింది. రైతులకు అందుబాటులో లేవు. అందువలన ఈ భూముల ఉత్పాదకత, రైతుల ఆదాయాలు తక్కువే.
ప్రభుత్వం ఇలాంటి మధ్య తరహా, చిన్న తరహా నీటి పథకాలను చేపట్టి వెనకబడిన జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి చేయూతనివ్వాలి. ఈ పథకాలను త్వరగా పూర్తి చేయవచ్చు. వీటికయ్యే ఖర్చు కూడా తక్కువ. వీటి వలన అన్ని తరహా రైతులకు అన్ని ప్రాంతాలవారికి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు చెరువుల అభివృద్ధికి కృషి చేయాలి. వీటిని మరమ్మత్తులు చేసి వీటి ప్రయోజనాలు రైతులందరికీ అందుబాటులో వుండేటట్లు చూడాలి. చాలా చెరువులలో ఇసుక, మన్ను పేరుకుపోయాయి. నిరుపయోగమైన మొక్కలు దుబ్బులు పెరిగి వీటి స్టోరేజి కెపాసిటీ కూడా తగ్గిపోయింది. అందువల్ల వీటి క్రింద పండించే పంట భూముల విస్తీర్ణం తగ్గింది. కొన్ని చెరువులను కొంత మంది అక్రమంగా ఆక్రమించి ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం వీటిపై తగుశ్రద్ధ చూపించలేక పోతుంది. అంతేకాదు. భూగర్భ జలాల వినియోగాన్ని చెరువుల, కాలువల నీటి వినియోగంతో సంధానపరచి రైతులు అత్యధిక ప్రయోజనం పొందేట్టు చూడాల్సివుంది. 8వ పంచవర్ష ప్రణాళికలో ఇట్టి ప్రయత్నాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలలో వర్షాదారంతో పంటలు పండించే ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. వీటికయ్యే ఖర్చు భారీ నీటి పథకాల ఖర్చుతో పోల్చి చూస్తే అతిస్వల్పం.
ఉత్తరకోస్తాలోను కొన్ని జిల్లాలు, తెలంగాణాలోని కొన్ని జిల్లాలు,రాయలసీమ ప్రాంతాంలోని అన్ని జిల్లాలు చెరువులపై ఆధారపడే వ్యవసాయం చేసే వారు చాలా ఎక్కువ మంది రైతులున్నారు. చెరువుల మరమ్మత్తు చేయడంవలన వ్యవసాయ రంగం ఉత్పాదకత పెరగడమే కాక తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఉపాధి కల్పించే అవకాశాలు కూడా పెరుగుతాయి.
మన రాష్ట్రంలో వ్యవసాయ అభివృధ్ధికి కావలసిన అనుకూలమైన సహజ వనరులు వున్నాయి. సాగునీరు విద్యుశ్చక్తి అభివృద్ధి చేయడానికి వీలుంది. ఇప్పటివరకూ కల్పించిన నీటి పారుదల సౌకర్యాలను, విద్యుచ్చక్తినీ సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులన్ని సత్వరమే పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే వ్యవసాయాభివృద్ధి పుంజుకుంటుంది. ఈ సందర్భంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌ మెంటు అండ్‌ ప్లానింగ్‌ స్టడీస్‌ (ఐ.డి.పి.యస్‌) విశాఖపట్టణం వారు తయారుచేసిన భగీరధీ ప్రాజెక్టు నమూనా గురించి ప్రస్తావించడానికి అప్రస్తుతం కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి చాలా పెట్టుబడి కావాలి. చాలా కాలం పడుతుంది కూడా. ఈలోగా ధరల పెరుగుదలవలన దీనికయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఫలితాలు చాలా ఏళ్ల తరువాత కానీరావు. అందువల్లే ఐ.డి.పి.యస్‌. భగీరధి నీటి పథకాన్ని ప్రతిపాదించింది. దీనికి గోదావరి నీటిని విద్యుచ్చక్తితో ఏలేశ్వరం రిజర్వాయర్‌కు పంపి దాని నుండి స్టీల్‌ పాా్లంట్‌ అవసరాల కోసం త్రవ్విన ఏలేశ్వరం కాలువ ద్వారా పంపితే విశాఖ ప్రజలకు మంచినీరు పారిశ్రామిక అవసరాలను తీర్చగలగడమే కాక వ్యవసాయ రంగానికి కూడా సాగునీటి వసతి కల్పించవచ్చు. ఈ పథకాన్ని రెండేళ్లల్లో సుమారు రు.100 కోట్ల కంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయవచ్చు. ఈ పథకం వల్ల చేకూరే లాభాలు దీనికయ్యే ఖర్చుతో పోల్చి చూస్తే చాలా తక్కువ. ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవలసి వుంది.
- పాతులోతు పాండు నాయక్

Wednesday, May 19, 2010

ఈ పాపం ఎవరిది?


ఛత్తీస్‌ఘడ్‌లో రుధిరదారలు

``మావోయిస్టు అంటే తీవ్ర వాదం, నిజానికి అవతలి వ్యక్తిని బెదరగొట్టడం కోసం చేసే బలప్రయోగం, నీతినిజాయితీలనే ముగుసులో అందంగా అలంకృతమైన తీవ్ర వాదం, భారతదేశానికి మావోయిజం అతిపెద్ద ముప్పు'' అని స్వయంగా దేశ ప్రధాని 2004 నవంబర్‌లో తొలిసారిగా ప్రకటించారు. ఒక మాలో చెప్పాలంటే దేశంలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. నిజంగా దేశ ప్రభుత్వానికి ఇది సిగ్గు చేటు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందితే ఇంతమంది దారిద్య్ర రేఖ దిగువున ఎందుకు ఉంటున్నారు? కొంత మంది ధనికులు తమ స్వార్ధం కోసం పేద ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ పథకాలను దోచుకుంటున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే వారిని టెరర్రిస్టులు అని ముద్ర వేస్తున్నారు... ``దుర్భర దారిద్య్రమనే అంశం హింసాకాండకు వంక కారాదు, తీవ్రవాదానికి సమర్థింపు కారాదు, మావోయిజాన్నీ, మావోయిస్టులనూ పెంచిపోషిస్తున్న పరిస్థితులపై భారతదేశం యుద్దం ప్రకటించాల్సిన సమయం ఇది'' అని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి కళ్లముందు ఉన్న కఠోర వాస్తవాన్ని ఎందుకు గమనించడం లేదు. ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పని చేయకపోతే, వాటిని స్పష్టంగా పేర్కొని, సిగ్గుపడాల్సిందే. అయితే ఒక మాట నిజం. ఈ యుద్దమనేది కేవలం తూటాలతో గెలిచేది కాదు. భారత్‌ అగ్రరాజ్యంగా అవతరించాలని నిజంగా అనుకుంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు జనావాస ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు అటు జన హృదయాలనూ గెలుచుకోవాలి. ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించలేని, సామాజిక న్యాయం అందించలేని అసమర్ధ ప్రభుత్వాలు పాలించినంత కాలం ఏదో రూపంలో హింస కొనసాగుతూ...నే ఉంటుంది. హింసను అణిచివేయడానికి ప్రతి హింస ఒక్కటే మార్గం కారాదు. సమస్యను పరిష్కరించడానికి కేవలం శాంతిభద్రతల కోణంలోనే కాకా ఆర్ధిక కోణంలోనూ దృష్టి సారించాలి. కేంద్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన జనవాసాలలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలి. ఎన్నో ఏళు్ళగా ఆర్ధిక అసమానతలతో అలసిపోయిన అమాయక ప్రజల హృదయాలలో ఈ విశ్వాసం పాదుకొల్పాలంటే ప్రభుత్వం తక్టణం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి మారు మూల ప్రాంతాలలో విద్యా, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలను మెరుగు పర్చాలి. నాగరిక ప్రపంచానికి, అభివృద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాలకు మధ్యనున్న తేడాలను తుడిచేయాలి. ప్రభుత్వం రూపొందించిన భారత్‌ నిర్మాణ్‌ లాంటి కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలి.
భారతదేశం ఎదుర్కొంవలసి ఉన్న అతి పెద్ద ఎకైక ఆంతరంగిక భద్రతా సమస్య నక్సలిజమే అని ప్రకటింస్తున్న ప్రధాన మంత్రి ముంబాయ్‌పై 2009 నవంబర్‌ 26న జరిగిన దాడులు, రాష్ట్రాల్లో జరుగుతున్న విద్రోహ చర్యలను, దేశ తీవ్రవాద నిరోధక యంత్రాంగంలో ఎందుకు శ్రద్ద చూపడం లేదు. తీవ్ర వాదులు కొన్న క్యాబ్‌‌స డ్రైవర్లుగా, వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉన్నత స్థాయి హోదలలో ఉన్నరని ఇంటెల్నిజెన్‌‌స రిపోర్టు తెలిపినా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? నక్సల్‌ ప్రాంతాలను తిరిగి అధీనంలోకి తెచ్చుకునే వారి ప్రాబల్యాన్ని నిరోధించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ ఆ ప్రాంతాలను అభివృద్ది, చేయూత కార్యక్రమాలు మాత్రం చేపట్టారు. క్షేత్ర స్థాయిలో నిఘా తక్కువే. నక్సల్‌‌సపై చూపుతున్న శ్రద్ద తీవ్రవాదులపై ఎందుకు చూపడంలేదు? నక్సల్‌‌సపై ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మైదలైన తరువాత తీవ్రవాదులు రాజ్య వ్యవస్థపై తమ దాడులకు వూ్యహం అధికమైనట్లు, దేశంలోని ప్రధాన పట్టణాలలో తీవ్ర వాదులు వివిధ ప్రైవేటు సంస్థలకు యాజమానులుగా ఉండి తమ వూ్యహం రచిస్తూన్నారని, వివిధ పత్రికల్లో ప్రచురిస్తున్న ఇంటలీజెన్‌‌స రిపోర్టులను బట్టి తెలుస్తున్నాయి.
ప్రభుత్వాలు తమ గొప్పలు చెప్పుకుంటున్నాయి. తము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్నాయి... మా ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలుగా అదుకుంటుందని చేబుతున్న ప్రభుత్వాలకు, పెద వారినిపై తమ సన్నిహితులు, బంధువులు చేసే అన్యాయం మాత్రం కనించదు. ఎవరైన పెదవారు తమ సన్నిహితులు మాకు అన్యాయం చేశారని విర్యాదు చేస్తే.... సన్నిహితులను కాపడుకోవడం కోసం అనేక దొడ్డ దారులు వెతికి తప్పులు కప్పి పుచ్చుకునేందుకు సతావిధాల ప్రయత్నాలు చేస్తారు. అనుచరులు, బంధువులు సన్నిహితులు చేసిన తప్పులు మాత్రం రహస్యంగా ఉంచి, వారిపై విర్యాదు చేసినందుకు పెదవాడిని అన్ని విధాలుగా అనగ దొక్కుతున్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపులు నేటి వరకు కాగితాలపైనే చూపుతున్నారు. ప్రజలకు తమ ఫలాలు అందించే విషయంలో మంచుగడ్డల వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అయస్కాంత గుణాలను ఎందుకు ప్రదర్శించడం లేదు?
``ఎవరో ఏదో పుస్తకం నుంచి వూ్యహాన్ని సేకరించి దానిని అనాలోచితంగా పారామిటరీ దళాలపై బలవంతగా రుద్ధి అమలు చేయించాయని'' మాజీ పంజాబ్‌ పోలీస్‌ చీఫ్‌ కె.పి.ఎస్‌.గిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా 2010 ఏప్రిల్‌ 6న దంతేవాడలో 81 మంది సభ్యుల ఉన్న పటాలంపై మవోయిస్టులు హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో 76 మంది సి.ఆర్‌.పీ.ఎఫ్‌ జవాన్లు అసువులు బాసాగా దుర్భేద్యమైన వాహనం, సంచార బంకర్‌ ధ్వసం అయాయని బాధపడ్డారు. కేంద్ర హోంమంత్రి ప్రతి రోజు పత్రికల ముందు వచ్చి మవోయిస్టులను అణచివేయడం కోసం అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, గ్రేహౌజ్‌ బలగాలను పెంచుతున్నామని, ఇతర దేశాల నుంచి ఆధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నామని ఎదో విధంగా వార్తకేకుత్తున్నారు. గ్రేహౌజ్‌ బలగాలుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అడవిలో పంపుతున్నారు. అడవిలో వెళ్లిన బలగాలు తిరిగి ఎంత మంది వస్తారో తెలియదు. వారు తిరిగి రాకుంటే వారి కుటుంబ పరిస్థితి ఎమిటి అని అలోచించారు. అధికారంతో ఆనాధిగా సంపాధించిన సంపాదనకు మాత్రం రక్టణ కావాలి. మానిషి ప్రాణం పోతేనేం, వాళ్ల కుటుంబం ఏమైతేనేం...నా కుటుంబం, నా ధనం సురక్షితంగా ఉంది అని సంతోష పడుతున్నారు. కానీ ధనికులు, అధికారులు, ప్రభుత్వాలు వారు ఎందుకు ఇలా మారారు అని ఎందుకు అనుకోవం లేదు. వారు ఈ విధంగా మారడానికి గాల కారణలు ఏవీ? వీరిని ఎ విధంగా జనజీవంలోకి తీసుకోరావాలి అని ఎందుకు ఆలోచించడం లేదు?
సాధారణ మనిషి నక్సల్‌‌సగా ఎందుకు మారుతడు?
ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆవేశతో కుడిన వ్యక్తి నక్సల్‌‌సగా మారుతాడు. తాన ఆవేధన అన్ని వర్గాల ప్రభుత్వ అధికారులకు తనగోడు వినిపించి, తన ఆవేదనను వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు మాటాలను పెదచెవిన పెడడంతో ఆ ఆవేదన భరించ లేక తను పెడదారి పడుతున్నాడు. తాను ఎందుకు పెడదారి పట్టాడు? నక్సల్‌గా ఎందుకు మారాడు? ఈ ప్రశ్నాలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియాదా? అసలు విషయం ఎవరు అడగడం లేదని, ప్రభుత్వానికి తెలిసిన ఎందుకు బహిర్గతం చేయాలని అతనికి టార్గెట్‌ చేస్తే మరోకరికి ప్రశ్నించే ధైర్యం ఉండదనే ఆలోచనతో.... గ్రామాభివృద్ధి కోసం పటుపడే ప్రతియువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవిద్యార్ధులు, యువతలు పెడదారి పడ్డకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం చెప్పుకుంటుంది. ధనవంతుడికి దగ్గర అయస్కాంత గుణాలను ప్రదర్శించే ప్రభుత్వాలు పేద వాడి వాడివిషయంలో ఎందుకు మంచుగడ్డ గుణాలు ప్రదర్శిస్తుందో అర్ధం ఆకావడం లేదు.
మారుమూల పల్లె, పట్టణం వలె అభివృద్ధి చెంది మా గ్రామం పట్టణ ప్రజల వలె ఆనందంగా ఉండాలని అనుకునే వారు కనీసం పల్లెకొక్కరైనా ఉంటారు. గ్రామ ప్రజల కోసం మౌలిక సాదుపాయలు కల్పించమని, గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలని, గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారును పదేపదే ప్రదేయ పడుతుంటారు. అధికారులు నమ్మించి మొసం చేయడం, ఆయన ఆశాయలను ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు అడి ఆశాయాలు చెస్తుంది. ఆ సమాయంలో తమ కుటుంబం కంటే గ్రామాభివృద్ధి ముఖ్యం అనుకునే ప్రతి వ్యక్తి ఒక దృష్టశక్తిగా మారుతాడు. ఆ వ్యక్తి నక్సల్‌‌సగా మారాడానికి సహాకారించింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కాదా?
నక్సల్‌‌సపై రివార్డు అవసరమా?
కేంద్రం అధునికీకరణకు మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వడమనేవి ఒక వూ్యహంగా ఉంటే ఈ వూ్యహం నేటి వరకు ప్రధానంగా కాగితాలపైనే ఉన్నాయి. నక్సల్‌‌సలో ఒక ఉన్నత పదవి చేపడుతున్నడంటే అతనిని ఎలా మట్టికప్పలని చుస్తూన్నారు ధనికులు. అతని పట్టుకున్నా వారికి వేల కోట్లు బహుమతి అని ప్రకటిస్తుంది ప్రభుత్వం. వారు చనిపోతే మరోకరు ఈ ఉద్యామం చేపట్టకుండా ఉంటడా? ఉద్యామం చేపట్టిని ప్రతి ఒక్కరి కోసం ప్రకటించే రివార్డు, ఆ రివార్డు ప్రకన కోసం చేసే ఖర్చు పల్లేల అభివృద్ధికోసం ఎందుకు ఖర్చు చేయకుడదు? ఖర్చు చేస్తే మరోకరు నక్సల్‌‌సగా మారే అవకాశం ఉంటుందా? అని ఎందుకు ప్రశ్నించుకోదు. దేశంలో, రాష్ట్రంలో క్రమక్రమంగా పల్లేలు అభివృద్ధి చేదుతుంటే వారు ఆజ్ఞానాన్ని విడిచి భయటకు వస్తారు అని ఎందుకు అనుకోవడం లేదు. వాళ్లను చంపడం మీ టార్గెట్‌ అయితే, మీ దగ్గర ఉన్న అక్రమ సంపాధ ఎంత? అన్ని ప్రశ్నించే హక్కు వారికి ఎందుకు ఉండకుడదు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఇలాగే చంపుకుంటు పోతే దేశంలో చివరకు మిగిలేది.... ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వడమనేవి ఒక వూ్యహంగా ఉంటే ఈ నిధుల విడుదల నేటి వరకు కాగితాలపైనే... అభివృద్ధికోసం పాటుపడే ప్రతి యువత అడుగుతున్న ప్రశ్న ఇది.
అధికార ప్రభుత్వాలు తమే ఏమి తప్పు చేయడం లేదు అనుకుంటుంది. ప్రభుత్వాలు తప్పు ఒప్పులు ఎవరికి తెలియాదు. తెలిసి వ్యక్తి ఒతికి ఉండారు, ఒక వేళ ప్రభుత్వ తప్పిదాలు తెలిసిన వ్యక్తి గనుగ ఉంటే..... దేశ సరిహద్దులో నిరంతరం కపలా కస్తూ, దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసే వారు. ఇతర దేశ శత్రువుల నుండి దేశ ప్రజలకు హాని కలగకుండ ఉండాలని..... దేశాన్ని కపాడే వ్యక్తి దేశంలో ఉన్న దేశ ద్రోహులను మాత్రం ఏమి చేయలేకపోతున్నని కుంగిపోతుండాడు. దేశ ద్రోహుల నుండి దేశాన్ని కపాడుకోవడం కోసం విధీని నిర్వహణను వదులుకోవాల్సి వస్తూంది. దేశ ద్రోహులు అతన్ని నక్సల్‌గా ముద్ర వేస్తుంది. అందుకనే నేమే మాజీ సైనిక సిబ్బంది మవోయిస్టులకు శిక్టణ ఇస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నాట్లు ఒక జాతీయ మాసపత్రికవెలవర్చింది. మాజీ సైనికులు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడం కోసం ఈ విధంగా తన వీధినిర్వహణ కొనసాగిస్తున్నారు. దేశ శత్రువలును ఎదుర్కొవడంలో తమ సిద్దాంతాలను ఎవిధంగా అమలు చేస్తారో అదే రితిలో దేశ ద్రోహులను ఎరివేయడం కోసం ఆ సిద్దాంతాలను మావోయిస్టుల రూపంలో అమలు చేస్తున్నారు.
బలిపశవులుగా బలగాలు (ఈనాడు)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారామిలటరీ బలగాలను బలిపశవులుగా వాడుకొంటున్నాయని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్‌ ఆరోపించారు. ఇటీవల దంతెవాడ జిల్లాలో జరిపిన దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబ సభ్యులకు తాము మనస్పూర్తిగా సానుభూతి తెలుపుతున్నామన్నారు. సీపీఐ(మావోయిస్టు) పీఎల్‌జీఏ గెరిల్లా దళాలు దంతెవాడ జిల్లాలోని పారామిలటరీ బలగాలపై దాడిచేసి చరిత్ర సృష్టించారని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో యుద్ద్ధనికి కేంద్రం సన్నద్ధమవుతోందని, దీనిని ప్రతిఘటిస్తామని చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా దాడులకు తెగబడతామని హెచ్చరించారు. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యగా గుర్తించనంత కాలం దంతెవాడ తరహా దాడులు కొనసాగుతాయన్నారు.

Monday, May 10, 2010

doiop.com

doiop.com

Posted using ShareThis

doiop.com

doiop.com

Posted using ShareThis

Thursday, April 22, 2010