Saturday, March 20, 2010

వివిధ రంగాలపై సర్కారు గణంకాలు

ఎమ్మెల్యేలకు సంకలనం ప్రతుల అందజేత
రాష్ట్రానికి ఇప్పుడు అంకెల జ్వరం పటు్టకుంది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఏర్పాటయిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి సమగ్ర వివరాల్ని అందేయాలన్న తలంపుతో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు గణంకాల్ని తవ్వితీసే పనిలో పడ్డాయి. జిల్లాల్లో వివిధ రంగాల ముఖ చిత్రాల్ని గణంకాల ద్వారా తెలుసుకోవడానికి ఉత్సుకత కనబరుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం తాజా వివరాలతో గణంకాల సంకలనాన్ని మార్చి 18న శాసన సభ్యులకు అందేసింది. `స్టాటిస్టికల్‌ అబ్‌సాక్‌‌ట-2009' పేరుతో రాష్ట్ర అర్థ, గణంక విభాగం ఈ సంకలనాన్ని రూపొందించింది. ఏయే రంగాల్లో ఏ జిల్లా ఏ స్థానంలో ఉన్నదీ దీని ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లాంటివి ఏ జిల్లాలో ఎన్నేసి ఉన్నదీ ఇందులో పొందుపరిచారు. నీటిపారుదల, పశపోషణ, అడవులు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, పోలీస్‌, పర్యాటకం, రవాణ, బ్యాంకులు, ధరలు వంటి వాటితో పాటు రాష్ట్ర ఆర్థిక రంగంపై విశ్లేషణలూ ఇందులో చూడొచ్చు. అందులో పొందుపరచిన గణంకాల ప్రకారం.. 2008-09లో కొన్ని ముఖ్యమైన రంగాల పరిస్థితి ఇలా ఉంది.
వరిలో కోస్తా.. చెరకులో తెలంగాణ
వరి విషయంలో కోస్తాలో సాగు విస్తీర్ణం, ఉత్పాదకత(దిగుబడి) రెండూ ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతం కోస్తాకు కొంత దగ్గరగా ఉండగా... రాయలసీమ మరింత వెనుకబడి ఉంది.జొన్నసాగు విస్తీర్ణంలో ముందంజలో ఉన్న తెలంగాణలో పంట దిగుబడిలో బాగా వెనుకబడి ఉంది. ఇందులో కోస్తా ముందంజలో ఉండగా రాయలసీమలో దిగుబడి తెలంగాణ కంటే రెట్టింపు స్థాయిలో ఉంది. మొక్కొజొన్న ఉత్పాదకతలోనూ ఇదే పరిస్థితి. కంది సాగు, ఉత్పత్తిలోనూ తెలంగాణదే అగ్రస్థానం. తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణం కోస్తా కంటే తక్కువగా ఉన్నా దిగుబడి విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. విస్తీర్ణం తక్కువగా ఉన్న రాయలసీమలో దిగుబడి రెండు ప్రాంతాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం వేరుసెనగ సాగు విస్తీర్ణంలో తెలంగాణ, కోస్తా ప్రాంతాలు రాయలసీమకు దరిదాపుల్లో కూడా లేవు. దిగుబడులు తెలంగాణ, కోస్తాలలోనే అధికం.
మెదక్‌లో విద్యుత్‌ వినియోగం
వారీగా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం చిట్టచివరన ఉంది. మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో తలసరి వినియోగం పెరగడానికి కారణం.. అక్కడ సాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడటంతో పాటు పారిశ్రామిక వినియోగం ఎక్కువగా ఉంది. గృహ వినియోగాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాది అట్టడుగున స్థానం కావడమే ఇందుకు నిదర్శనం. నల్గొండ జిల్లాదీ ఇదే పరిస్థితి. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సాగునీటి కోసం బోర్లపై ఆధారపడటంతో తలసరి వినియోగం ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ వినియోగంలో నిజామాబాద్‌ జిల్లా ప్రథమ స్థానంలోఉంది. ఆ తర్వాత నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కడప, అనంతపురం జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ను మినహాయిస్తే వ్యవసాయ వినియోగం అతి తక్కువుంది విశాఖ జిల్లా. విశాఖ కంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వినియోగం ఎక్కువగా ఉంది.


సాగులో పశ్చిమ గోదావరి ప్రథమ.. కరీంనగర్‌
ఆయకటు్ట సాగులో పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉండగా... కరీంనగర్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా ఆరుస్థానం దక్కించుకొంది. చెరువులు, కాలువలు, బావులు, ఇతర వనరుల కింద పశ్చిమ గోదావరి జిల్లాలో 6,49,663 హెక్టార్లలో సాగు కాగా, కరీంనగర్‌ జిల్లాలో 5,73,255 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలో 73,733 హెక్టార్లు సాగైంది. నీటి వనరుల కింద 3 లక్షల హెక్టార్లకు మించి సాగైన జిల్లాల్లో పశ్చిమ గోదావరి, కరీంనగర్‌ తర్వాత గుంటూరు(5,16,168), తూర్పు గోదావరి (5,03,128), కృష్ణా (4,88,429), వరంగల్‌ (4,44,945), నల్గొండ (4,35,530), నిజామాబాద్‌ (3,30,121) నెలూ్లరు(3,26,383) జిల్లాలున్నాయి. దిగువ నుంచి వరుసగా రంగారెడ్డి తర్వాత అదిలాబాద్‌, విశాఖపట్నం, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, మెదక్‌, ప్రకాశం, కర్నూలు, మఖ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలున్నాయి.
పడకల్లో హైదరాబాద్‌.. పీహెచ్‌ చిత్తూరు టాప్
ఇరుగుపొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో వైద్య రంగంలో ప్రమాణలు ఆశించిన స్థాయిలో లేవు. జిల్లాల వారీగా పరిస్థితిని విశ్లేషిస్తే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ప్రకారం హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలున్నాయి. చివరి మూడు స్థానాల్లో విజయనగరం, రంగారెడ్డి, మఖ్మం జిల్లాలున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఆధారంగా మొదటి మూడు స్థానాల్లో... చిత్తూరు, మహబూబ్‌నగర్‌, తూర్పుగోదావరి ఉన్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్‌, విజయనగరంలు- చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. శాశ్వత వైద్యుల పరంగా... నిజామాబాద్‌, రంగారెడ్డి, మఖ్మం చివరి మూడుస్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, గుంటూరు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

విద్యాభివృద్ధి
వికేంద్రీకృతంఅక్షరాస్యత ప్రగతికి ఆలవాలం. ఈ రంగానికి ప్రాధాన్యమిచ్చే రాష్ట్రాలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే విద్యాభివృద్ధి వికేంద్రీకృతమయింది. ఒక్కో కేటగిరిలో ఒక్కో జిల్లాకు అగ్రస్థానం లభించింది. ప్రాథమిక విద్యారంగంలో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలు 4546 ఉన్నాయి. రెండోస్థానంలో తూర్పు గోదావరి(3533), మూడో స్థానంలో విశాఖ(3320) ఉన్నాయి. మాధ్యమిక విద్యలో అనంతపురం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలు 936 ఉన్నాయి. తర్వాత స్థానాల్లో కరీంనగర్‌(893), మహబూబ్‌నగర్‌(870) నిలిచాయి. హైదరాబాద్‌ చివరి స్థానంలో(382) ఉంది. ఉన్నత పాఠశాలల సంఖ్య అన్నింటికంటే ఎక్కువగా(1231) రంగారెడ్డి జిల్లాలో ఉండగా.. రెండు, మూడో స్థానాల్లో కరీంనగర్‌(1186), హైదరాబాద్‌(1090) నిలిచాయి. విజయనగరం(404) చివరి స్థానంలో ఉంది. శ్రీకాకుళం(484) దానికన్నా కాస్త ముందుంది. జూనియర్‌ కళాశాలల్లో హైదరాబాద్‌ (340) మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి (318), తూర్పు గోదావరి(258) నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా(24) అన్నింటికంటే చివరిస్థానంలో ఉంది. ఆ పై స్థానంలో నిజామాబాద్‌(102) ఉంది.

హాస్టళ్ల తీరిదీ..
`పేద' జిల్లాల్లో హాస్టళ్లకు గిరాకీ పేదరికం, వలసలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హాస్టళ్లలో అడ్మిషన్ల సంఖ్య అధికంగా ఉంది. ఎస్సీ సంక్షేమ హాస్టళు్ల కృష్ణా, పశ్చిమ గోదావరి, నెలూ్లరు జిల్లాల్లో ఎక్కువున్నాయి. కానీ విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ఎక్కువుండటం గమనార్హం. పేదరికం, వలసల కారణంతో మహబూబ్‌నగర్‌ జిల్లా హాస్టల్‌ అడ్మిషన్లలో ముందుంది. హైదరాబాద్‌, విజయనగరం, శ్రీకాకుళం, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అతి తక్కువ ఎస్సీ హాస్టళు్లన్నాయి. అడ్మిషన్ల సంఖ్య కూడా తగ్గింది. ఎస్టీ హాస్టళు్ల మఖ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. అలానే విద్యార్థుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ జిల్లాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గిరిజన జనాభా ఉన్నా హాస్టళ్ల సంఖ్యతోపాటు, అడ్మిషన్ల సంఖ్య కూడా తక్కువగా ఉంది.

Friday, March 19, 2010

ఆయకట్టు కనికట్టే ...


సీఎం చెప్పింది 19.26 లక్షల ఎకరాలు
వాస్తవిక పెరుగుదల 8.08 లక్షల ఎకరాలు
గణంక శాఖ నివేదికలో వెల్లడి



జలయజ్ఞం ఆయకటు్ట గురించి ప్రభుత్వం ఇన్నాళు్ల చెప్పింది కటు్టకథేనని తేలిపోయింది. కొత్తగా సాగులోకి తెచ్చినటు్ల ప్రభుత్వం చెప్పిన ఆయకటు్టలో సగం కూడా రాలేదని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, గణంకాల శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2009 వరకు రాషాభివృద్ధికి చెందిన గణంకాల వివరాల నివేదికను 2010 మార్చి 18న అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అందేశారు. 2004-05లో కాలువల కింద 13,45,979 హెక్టార్ల ఆయకటు్ట సాగైతే, 2008-09లో 16,69,447 హెక్టార్లు సాగైంది. అంటే పెరుగుదల 3,23,468 హెక్టార్లు (8,08,670 ఎకరాలు) మాత్రమే. ఇన్నాళు్ల ప్రభుత్వం చెప్ఫిన దానికి, దీనికి పొంతనేలేదు. ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో జలయజ్ఞం ద్వారా 2004-05 నుంచి 2008-09 వరకు 19.26 లక్షల ఎకరాల కొత్త ఆయకటు్టను సాగులోకి తెచ్చామని, 3.09 లక్షల ఎకరాల ఆయకటు్టను స్థిరీకరించామని చెప్పారు. ఇందులో చిన్న నీటివనరుల కింద సాగులోకి వచ్చిన 5.09 లక్షల ఎకరాలు కూడా ఉన్నటు్ల నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా అటు అసెంబ్లీలోనూ, బయటా కొత్త ఆయకటు్ట వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం కొత్త ఆయకటు్ట 14.56 లక్షల ఎకరాలు కాగా, స్థిరీకరించిన ఆయకటు్ట 3.08 లక్షల ఎకరాలు. అంటే మొత్తం సాగులోకి వచ్చిన ఆయకటు్ట 17.64 లక్షల ఎకరాలు. 2009-10లో భారీ ప్రాక్టుల కింద 44,256 ఎకరాలు, మధ్యతరహా ప్రాక్టుల కింద నాలుగువేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించినటు్ల బడ్జెట్‌ ఫలితాలు పేరుతో అసెంబ్లీకి అందేసిన నివేదికలో మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఇలా ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పినా జలయజ్ఞం కింద సాగులోకి వచ్చిన ఆయకటు్టలో పెద్ద తేడా లేదు. కానీ వాస్తవంగా సాగైన ఆయకటు్ట వివరాలతో గణంకాల శాఖ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే మాత్రం జలయజ్ఞం ఆయకటు్ట విషయంలో ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో సగం ఆయకటు్టకు కూడా నీరందలేదు. చెరువుల కింద దేళ్లలో 1,70,704 హెక్టార్ల (4,26,760 ఎకరాలు) ఆయకటు్ట పెరిగింది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చిన్న నీటి వనరుల కింద పెరిగిన ఆయకటు్ట 5.09 లక్షల ఎకరాలు. ఇది కూడా వాస్తవం కాదన్న విషయం గణంక శాఖ నివేదిక వెల్లడిస్తోంది. బావులు, బోర్ల కింద మాత్రం సాగైన ఆయకటు్ట గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో 4,19,532 హెక్టార్లు(10,48,830 ఎకరాలు) పెరిగింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన జలయజ్ఞం కింద ఇప్పటివరకు రూ.1.80లక్షల కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. పెరిగిన వ్యయం, అదనపు పనులతో కలిపి రెండు లక్షల కోట్ల రూపాయలు దాటింది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.50,050 కోటు్ల వ్యయం చేసింది. ఇంత భారీ మొత్తం వ్యయం చేసిన తర్వాత కూడా సాగులోకి వచ్చిన ఆయకటు్ట మాత్రం నామమాత్రమే కావడం గమనార్హం.