గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వేలాది కుటుంబాలు ఉపాధి కోసం పట్టణాలు, నగరాలకు వలస వెళు్తంటారు. దాంతో వారి పిల్లలు చదువులకు దూరంగా ఉంటున్నారు. తరగతి గదిలో కొనసాగ్సాన బాల్యం.... బాధ్యతల్ని వెదుక్కుంటూ రోడ్డున పడుతోంది. బడికి వెళ్లవలసిన సమయంలో బాలలు చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని పని బాట పడుతున్నారు. ఇందుకు నేటి సమాజంలోని సామాజిక, ఆర్ధిక అసమానతలే కారణం. రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమికోన్నత విద్య నుంచే పేద విద్యార్ధులు చదువుకి స్వస్తి పలుకుతున్నారు. 2000-01లో 1వ తరగతిలో 22,89,220 మంది చేరగా 2009-10లో 10,67,642 (53.36) మందికి తగ్గారు. సగం మంది లోపు విద్యార్ధులే 7వ తరగతిలోకి ప్రవేశించగలిగారు. చదువుకి స్వస్తి చెప్పిన విద్యార్ధులందరూ పేదగిరిజన కుటుంబాల వారే. ఇందుకు కారణం వారి తల్లితండ్రులకు తమ పిల్లలను చదివించుకోవాలన్న ఆకాంక్ష లేకపోవటం కాదు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులే.
నూటికి 70 మందిగా ఉన్న గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటం, పేద రైతులకు, వ్యవసాయకూలీలకు భూమి లేకపోవడం వల్ల గ్రామీణ పేదరికం పెరుగుతూనే ఉన్నది. ఇందిరా కాంతి పథకం ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల సంఖ్య 134.68 లక్షలు. వీటిలో పేదరికంలో మగ్గుతు న్న కుటుంబాలు 56.1 శాతం. షెడ్యుల్‌డ తెగలు, కులాలు, వెనుకబడిన తరగతులతో పాటు అ భివృద్ధి చెందిన కులాల కుటుంబాలు కూడా ఇందులో ఉన్నాయి. 2004 లెక్కల ప్రకారం రాష్ట్రంలో పేదరికం 55.5 శాతం కాగా, ఇప్పుడు అది ఇంకా పెరిగింది. పేదల్లో 36.65 శాతం నిరుపేద కుటుంబాలు, 18.4 శాతం దుర్భర దారిద్య్రంలో బ్రతుకుతున్న కుటుం బాలు ఉన్నాయి.
పాలకులు విద్యారంగం ఎడల అనుసరిస్తున్న విధానాలు కూడా పేదలకున్న కొద్దిపాటి చదువుకొనే అవకాశాలను హరించి వేస్తున్నయి. రాజ్యాంగంలోని ఆదేశి క సూత్రాల్లో అందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలదే. ఆ బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టలేదు. ప్రభుత్వ స్కూళ్ళలో వసతులు కల్పించటంలో పాలకులు విఫలమయ్యారు. సరిపడా ఉపాధ్యాయులను నియమించక ఉన్న వారిపై అదనపు భారం మోపుతున్నది. సంక్షేమ హాసళ్ళు సదుపాయాలు లేక భ యంకరంగా మారాయి. దుర్గంధపూరిత వాతావరణంలో అంటురోగాల పాలై అనేకమంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 2004-05 నాటికి గ్రామీణ ప్రాంతంలో 17.03 కోట్ల మంది పేదలున్నారు. ఇంకా లోతుగా సర్వే జరిగితే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే కాని తగ్గదు. 1993-04లో గ్రామీణ ప్రాంతంలో రోజువారీ పనులు చేసుకొని బతికేవారిలో 5.63 శాతం, 1999-2000 నాటికి 7.20 శాతం కాగా, నేడు 11.2 శాతానికి పెరిగింది. పేదల సంఖ్య పెరుగుతూ ఉండటం వలన ఉపాధి వెతుక్కోవటమే వీరికి సమస్యగా మారింది. పట్టణాలకు, ఇతర దేశాలకు వలసలు పోతున్నారు. ఈ బతుకు పోరాటంలో పిల్లల చదువుల గురించి ఆలోచించే పరిస్థితి వారికి లేదు. పిల్లల ద్వారా వచ్చే ఆదాయం వారి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. అందుకే తప్పని పరిస్థితిలో పనులకు పంపుతున్నారు.
సరళీకృత ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా విద్యారంగాన్ని ప్రైవేట కరించే విధానాలను పాలకులు అనుసరించారు. ప్రభుత్వ స్కూళ్ళపట్ల ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించి, కార్పొరేట్ స్కూళ్ళకుఆకర్షితులను చేశారు. అనేక ప్రభుత్వ రంగ స్కూళ్ళని రద్దు చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి డబ్బు గలవారికే విద్యను పరిమితం చేశారు. అధిక ఫీజులు చెల్లించి కార్పొరేట్ స్కూళ్ళలో పేదలు తమ పిల్లలను చేర్చటం అసాధ్యం కనుక వారు చదువుకు స్వస్తి చెప్పవలసి వస్తున్నది. చదువు మానేస్తున్న పేదల్లో ఎక్కువ మంది గిరిజన పిల్లలే. కొండ కోనల్లో జీవిస్తున్న వీరు పాలకుల నిర్లక్ష్యానికి గురై గిరిజనేతరుల, పెత్తందార్ల, ఫారెస్టు అధికారుల దోపిడీకి గురపుతున్నారు. వీరు, తమ పిల్లలను చదివించుకుందామన్నా అక్కడ పాఠశాలలు కరవే. పట్టణ ప్రాంతాలకు పంపి చదివించే ఆర్ధిక స్థోమత, అవ కాశాలు వీరికి తక్కువ.
గిరిపుత్రులే అధికం
చదువుల్ని అర్దతరంగా వదిలేస్తున్న వారిలో గిరిజన(ఎస్సీ) విద్యార్ధులే అధికంగా ఉంన్నరు. వీరి బాటలనే హరిజన(ఎస్సీ) విద్యార్దుల కూడా ప్రయానం చేస్తున్నారు. వీరు అర్ధతరంగా చదువుకు స్వస్తి చేప్పి బాల కార్మికులుగా మారిపోతున్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన, హరిజన విద్యార్దులకు పాఠశాలలు దగ్గర్లో లేకపోవడంతో కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వస్తోంది. ప్రాథమిక పాఠశాలలు దగ్గర్లో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాలలు కొసం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేక వారు చదువును మనేస్తున్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల కోసం ప్రభుత్వం ప్రత్యేక గురుకుల పాటశాలలు ఏర్పాటు చేసిన అవి పరిమిత స్థాయిలో కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లకలు ఉన్నత చదువులు చదవించే స్థోమత లేక పోవడం వల్ల మధ్యలోనే పాఠశాలను వదిలించుకొని పనిలో పెడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2000-01లో రాష్ట్ర వ్యాపితంగా 3,12,309 (బాలురు-1,61,659, బాలికలు-1,50,650) మంది గిరిజన బాల, బాలికలు ఒకటవ తరగతిలో చేరినా, 2009-10 నాటికి వారి సంఖ్య 72,606(బాలురు- 39,234, బాలికలు- 33,372)కి తగ్గిపోయింది. అంటే ఏడవ తరగతికి వచ్చే లోపు 2,39,703 మంది చదువుకి దూరమయ్యారు. షెడ్యూల్‌డ కులాలకు చెందిన విద్యార్థుల పరిస్థితీ ఇంతే. ఇదే కాలంలో 4,76,514 (బాలురు-2,41,368, బాలికలు-2,35,114) మంది షెడ్యూల్‌డ కులాల పిల్లలు 1వ తరగతిలో చేరగా ఏడవ తరగతికి వచ్చేసరికి 1,99,413 (బాలురు10,2330, బాలికలు-97,093)కి తగ్గిపోయారు.
కొన్ని పాఠశాలలో ఏకోపాధ్యా ఉండటంతో విద్యార్ధులకు తగిన సౌకర్యాం లేకపోవడం వల్ల విద్యార్ధులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపడంలేదు. బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు వంటి సౌకార్యాలు అత్యధిక పాఠశాలలో లేకపోవడం వల్ల బాలికలకు సమస్యగా మారింది. విద్యార్ధులకు షౌష్టికాహారాన్ని అందించడం ద్వారా విద్యార్ధులను రోజు పాఠశాలలకు వచ్చేలా ఆకర్షించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినా వారు చదువుకు స్వస్తి చెప్పకుండా నిరోధించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభ సమయంలో రాజీవ్ విద్యామిషన్ ద్వారా బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్ధులను పాఠశాలలకు పంపించే ఏర్పాట్లును చేస్తున్నా వాటిపై తదనంతరం చర్యలు ఉండటం లేదు. మరో వైపు విద్యకు దూరమవుతున విద్యార్ధుల సంఖ్య ప్రాథమిక విద్యలో కంటే ప్రాథమికోన్నత విద్య మంచి విష్ర్కవిస్తున్న విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గతేడాది ఒకటి నుంచి తొమ్మిది తరగతులో ఉన్న విద్యార్ధులు 95 శాతం దాకా ఉండగా తరువాత తరగతిలోకి ప్రవేశించిన వారి సంఖ్య 90 శాతంకు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నిరక్షరాస్యతను రూపుమాపడంలో భారతదేశం వెనుకబడిందన్న వాస్తవం అంతర్జాతీయంగా పాలకుల విమర్శలకు గురికావడంతో, వయోజన విద్యా పథకం, రాజీవ్ మిషన్ ద్వారా అందుకు కార్యక్రమం రూపొందించి ప్రతి సంవత్సరం స్కూళ్ళ పునర్ ప్రారంభంలో బడిబాట, వయోజన విద్య పథకం పేరుతో చేసే హడావుడి అంతా మొక్కుబడిగానే ఉంది. విద్యాశాఖలో పర్యవేక్టణలో కీలక పాత్ర పోషించే పోస్టులు సుమారు 700 ఎంఇఓలు, 75 ఉపవిద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాలకుల దృష్టిలో నిరక్షరాస్యతను రూపుమాపటమంటే అక్షరాలు నేర్చుకొని సంతకం చేస్తే చాలు. దీన్నే చదువుకున్న వారి సంఖ్య పెరిగినట్లుగా పాలకులు ప్రచారం చేస్తున్నారు.
గిరిజన విద్యార్థులు అందోళన చేయకుండా వారిలో కొద్దిమందిని కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి ఉన్నత విద్యను అందిస్తున్నట్లు మభ్యపెట్టేందుకు పూనుకొంది. ఇది గిరిజన విద్యార్థుల కన్నా కార్పొరేట్ కాలేజీల ప్రయోజనం కోసమేనన్నది వాస్తవం. ఈ పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వాటికి దోచి పెడుతున్నది. ఈ విధంగా అత్యధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులను పై చదువులకు రాష్ట్ర ప్రభుత్వం దూరం చేస్తున్నది. షెడ్యూల్‌డ కులాల, వెనుకబడిన కులాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవటానికి ఫీజులు రియింబర్‌సమెంట్ ప్రకటించింది. ఒక సంవత్సరం కొంత మేరకు ఇది అమలు జరిగినా, ప్రస్తుతం దాన్ని నీరుగార్చే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది.
అందరికీ విద్య అందిస్తామని, నిరక్షరాస్యతను రూపుమాపుతామని విద్యాభివృద్థే దేశాభివృద్ధని చెప్పే పాలకుల, పేద కుటుంబాల పిల్లలు చదువుకి దూరమవడానికి గల వాస్తవ సమస్యల పరిష్కారం జోలికే పోవడం లేదు. పేదలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితేనే వారి పిల్లల చదువులపై దృష్టి పెడతారు. పేద రైతులు, వ్యవసాయ కూలీలకు లభించే ఆదాయం కుటంబ అవసరాలకు ఏ మాత్రం సరిపోవటం లేదు. వారి ఆదాయం పెరగాలంటే భూసంబంధాలను బద్దలుకొట్టి, భూస్వాముల అధీనంలోని భూములను, ప్రభుత్వమే భూస్వామిగా ఉన్న దేవాలయ భూములను, అన్ని రకాల బంజరు, ఫారెస్టు బంజరు భూములను గిరిజనేతర చేతుల్లో ఉన్న గిరిజనులకు చెందవలసిన భూములను పేద రైతులకు, వ్యవసాయ కూలీలకు, గిరిజనులకు పంపిణీ జరగాలి. అందుకు వ్యవసాయక విప్లవ కార్యక్రమం చేపట్టాలి.అప్పుడు మాత్రమే పేదల సమస్యల పరిష్కారంతో పాటు విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది

No comments:
Post a Comment