ఒక ప్రాంతపు అభివృద్ధి వ్యవసాయరంగాభివృద్ధి పైనే కాకుండా దాని పారిశ్రామికాభివృద్ధి పైన కూడా వుంటుంది. పారిశ్రామిక రంగంలో అభివృధ్ధి మన రాష్ట్రంలో తక్కిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే వెనుకబడి వుందని తెలుస్తుంది. మన రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి 1970తోనే ప్రారంభమయిందని చెప్పవచ్చు. మన రాష్ట్ర ఉత్పత్తులలో పారిశ్రామిక రంగ ఉత్పత్తి 1980-81లో 18 శాతం. ఇది 1988 నాటికి 22 శాతానికి పెరిగింది. ఈ కాలంలో ఈ ఉత్పత్తి స్థాయి మహారాష్ర్టలో 35 శాతం. దేశం మొత్తం మీద 28 శాతం. దేశం మొత్తంతోనూ మహారాష్ర్ట, గుజరాత్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతోనూ పోల్చిచూస్తే మన రాష్ట్రం వెనుకబడి వున్నదని తెలుస్తుంది. మన తలసరి పారిశ్రామిక ఉత్పత్తి 1986-87లో రూ.230 వుండగా మహారాష్ట్రంలో రూ.857 గుజరాత్ లో రూ.676. అలాగే క్రొత్త లైసెన్సుల మంజూరులో కూడా మనం వెనుకబడి వున్నాం. ముఖ్యంగా 1980 తరువాత పారిశ్రామికంగా కొంత పురోగమిస్తున్నాము. ప్రస్తుతం మన రాష్ట్రంలో సిమెంటు, కాగితం, జింకు, లెడ్ పరిశ్రమలు ప్రధానంగా వున్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడే పరిశ్రమలతో పాటు కొన్ని నూతన పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. ఇది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్‌స, కెమికల్‌స, మెటల్ మొదలైన రంగాలు. రాష్ట్రంలో లభ్యమయ్యే బాకై్సటును ఉపయోగించే అల్యూమినియం పరిశ్రమ స్థాపనకు కృషి జరుగుతోంది. ఈ రంగాల వుత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే అవకాశాలు మెరుగవుతున్నాయి. పంచదార, వస్త్రాలు, జౌళి, తోళ్ల వస్తువుల తయారీ, ఆహార ధాన్యాలు వీటికి సంబంధించిన వినియోగ వస్తువుల ఉత్పత్తి పెరుగుతోంది. దాన్తో బాటు వీటి ఎగుమతులు కూడా ఈ మధ్య కాలంలో పెరగుతున్నాయి. ఇది ముదావహమైన సంగతి. పరిశ్రమల అభివృద్ధి వలన ముఖ్యంగా వ్యవసాయరంగంపై ఆధారపడే పరిశ్రమల అభివృద్ధివలన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధీ, అక్కడ ఉపాధి అవకాశాలూ కూడా మెరుగవుతాయి.
ప్రారిశ్రామల అభివృద్ధి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వనరుల వినియోగానికి పథకాలను తయారుచేసి ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఎన్.ఆర్.ఐ.ల పెట్టుబడులను ఆకర్షించే నూతన పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ పరిశ్రమల అభివృద్ధికి కావలసిన పరపతి మార్కెటింగ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. సత్వర పారిశ్రామికాభివృద్ధికి విద్యుచ్చక్తి, చాలాముఖ్యం. దీని కొరత వలన అభివృద్ధి కుంటుపడుతోందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. విద్యుచ్చక్తిని ఇంకా ఎక్కువగా ఎంత చౌకగా ప్రభుత్వం అందివ్వగలిగితే అంత త్వరితగతిని పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలు కూడా విద్యుచ్చక్తిని వినియోగించుకుని అభివృద్ధి చెందుతాయి. 7వ పంచవర్ష ప్రణాళికలో మన రాష్ట్రంలో ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడి తక్కిన కొన్ని రాష్ట్రాలతో పోల్చిచూస్తే చాలా తక్కువ. బొగ్గు, జలపాతాల ద్వారా సంప్రదాయక పద్ధతులలో విద్యుచ్చక్తిని ఉత్పత్తి చేయడంతోబాటు నూతన సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించి సూర్యరశ్మి, గాలి, సముద్ర కెరటాల ద్వారా విద్యుచ్చక్తి ఉత్పత్తికి కొత్త ప్రక్రియలను ప్రభుత్వం చేపట్టాలి. వీటిలో ప్రైవేటు రంగ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలి.
యువతకు ఉపాధి కల్పనా పథకాలు
మన రాష్ట్రంలో జనాభాలో పనిచేసే వారి (వర్‌క ఫోర్సు) సంఖ్య హెచ్చు. దీనికి కారణం జీవనాధారానికి స్త్రీలు, పిల్లలు కూడా అధిక సంఖ్యలో పనిచేయడమే. అంతేకానీ ఎక్కువ మంది పనిచేయడం పూర్ణ ఉద్యోగితకు నిదర్శనం కాదు. మన రాష్ట్రంలో పనిచేసే వారి సంఖ్య జనాభాలో సుమారు 42 శాతం వున్నా తలసరి ఆదాయాలు మాత్రం తక్కువే. పంజాబు, హర్యానా రాష్ట్రాలలో పనిలో పాల్గొనే వారి సంఖ్య జనాభాలో 29 శాతం వున్నా వారి తలసరి ఆదాయం చాలా ఎక్కువ. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల వేతనాలలో ప్రాంతీయ వ్యత్యాసాలు కనపడతాయి. అభివృద్ధి చెందిన జిల్లాలలో సహజంగానే వ్యవసాయ కూలీల వేతనాలు ఎక్కువ. వెనుకబడిన జిల్లాలో కూలీల వేతనాలు తక్కువగా వుండటమే కాకుండా జనాభాలో ఎక్కువ మంది పనిలో పాల్గొనవలసి వస్తుంది. మన వ్యవసాయ రంగంలో ఉపాధికి సంబంధించిన ముఖ్య సమస్య పని దినాలలో కనిపించే హెచ్చుతగ్గులు (ఫ్లక్చుయేషన్స). సకాలంలో సమృద్ధిగా వర్షాలు పడిన సంవత్సరాలలో పని దినాలు పెరుగుతాయి. దారిద్య్రరేఖకు దిగువన వున్న వారి సంఖ్య కూడా తగ్గుతుంది. అనావృష్టి సంవత్సరాలలో ఉపాధి తక్కువ. దారిద్య్రం అనుభవించే వారి సంఖ్య కూడా సహజంగానే ఎక్కువవుతుంది. ఇందువలన నీటి వసతి కలిగిన ప్రాంతాలలోని కూలీల ఆదాయాలతో పోల్చి చూస్తే మెట్ట ప్రాంతాలలోని చిన్న సన్నకారు రైతుల వ్యవసాయ కూలీల ఆదాయాలు చాలా తక్కువగా వుంటాయి.
నీటి పారుదల సౌకర్యాలను పెంచి డ్రైనేజ పథకాలను సక్రమంగా అమలు చేయడంవలన ఉత్పత్తి పెరగడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాల్ని, ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చు. రోజ్గార్, తదితర ఉపాధి కల్పనా పథకాలను ఆయా ప్రాంతాల వనరులకు అనుగుణంగా రూపొందించి అమలు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను ఎక్కువ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, విద్యుచ్చక్తి విద్యా, వైద్య సదుపాయాలను త్వరితగతిని కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుచేయవచ్చు. తత్ఫలితంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు తగ్గుతాయి. పట్టణాలకు వలసలను అరికట్టవచ్చు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పెట్టున పెట్టుబడి అవసరముండదు. కానీ దీనికి కావలసింది సరియైన ప్రనాళికలు త్వరితంగాను, సమర్థవంతంగానూ అమలు పరచడం దీనికి ముఖ్యం కార్యదీక్ష.

- పాతులోతు పాండు నాయక్
No comments:
Post a Comment