చైనీయులు ఎప్పుడు కూడా కాశ్మీర్‌పై మన సంపూర్ణ సార్వభౌమాధికారం వాదనను అంగీకరించలేదు. వారి వీసా విధానం ఓ వైపు భారత్‌కు కంటిలో నలుసుగా ఉంటూనే మరో వైపు పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ఉంటుంది. అయితే అంతకు మించి మరేమీ కాదు. దలైలామా, టిబైటన్ల ప్రవాసం లాంటి అంశాలే కాదు, ప్రతి విషయంలో భారత స్పందించే తీరును గమనించినట్లయితే చైనా ముఖ్యమైన సమస్యల విషయంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఆచరణలో మాత్రం ఆక్రమిత కాశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు, లేదా ప్రకృతి వైపరీత్యాల సహాయం లాంటి విషయంలో చైనా పాకిస్తాన్‌కు సహాయాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విషయంలో వాస్తవానికి భారత చేయగలిగింది ఏమీ లేదు కూడా. సర్దార పటేల ఒకప్పుడు వ్యాఖ్యానించినట్లు అధీనంలో ఉంచుకోవడమే అసలైన న్యాయం. అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ అభివృద్ధి కార్యకలాపాలను ఆపడానికి చైనా ప్రయత్నించినట్లుగా మన నిరసనలు ఈ అభివృద్ధి కార్యకలాపాలను ఆపుతాయని మనం ఆశించడం వాస్తవ విరుద్ధం కూడా.ఇప్పుడు జరుగుతున్న చర్చ చైనా విషయంలో మన ఆలోచనా ధోరణిలోని మూడు ముఖ్యమైన వైఖరులను కూడా ఎత్తి చూపిస్తోంది. చైనా అత్యంత వూ్యహాత్మకంగా వ్యవహరించే, దూరాలోచనలు చేసే ద్రోహబుద్ధి కల దేశమనే ఆలోచన వాటిలో మొదటిది. భారత దేశానికి ఎలాంటి వూ్యహాత్మక దూరదృష్టి లేదని, స్వల్ప కాలిక క్రియాశీలకతతో అది దిక్కుతోచకుండా ఉండడం ఈ వాదనకు మూలం. ఫలితంగా చైనా వాళ్లు వేసే ప్రతి చిన్న అడుగు కూడా తన అధికారాన్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్తరింపజేసుకోవడంతో పాటు మన ప్రయోజనాలను దెబ్బ తీయడమనే దాని విస్తృత స్థాయి ప్రణాళికలో భాగమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని మన నిపుణులు మనకు చెప్తుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు ముఖ్యంగా ఆర్థిక రంగంలో ప్రణాళికలను రూపొందించుకోవడంలో తాము సమర్థులమనే విషయాన్ని చైనీయులు చాటి చెప్పారనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే వూ్యహాత్మకంగా లెక్కలేనన్ని ఘోరమైన తప్పులు చేయడంలో కూడా వారు సమర్థులనే విషయాన్ని కూడా చరిత్ర చెప్తోంది.
భారతీయుల మనసులను ఎప్పుడూ కలవరపెడుతుండే నేర్పరితనం చైనాకు బాగా ఉన్నట్లుంది. తాజాగా గిల్గిత- బాల్టిస్థాన ప్రాంతంలో చైనా సైన్యాల ఉనికి గురించి, సైన్యానికి చెందిన ఉత్తర మండలం సైనికాధికారి ఒకరికి చైనా వీసా నిరాకరించడంపై మీడియాలో వచ్చిన వార్తలు సైతం అలాంటి కలవరాన్నే సృష్టించాయి. ఇటీవలి కాలంలో తలెత్తిన వివాదాల తర్వాత సంభవించిన ఈ రెండు పరిణామాలు చైనానుంచి ఎదురయ్యే ప్రమాదం విషయంలో మన భయాలను మరింతగా పెంచాయి. నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉదంతాలపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా చైనా ప్రభుత్వ ఉద్దేశాలు, ప్రణాళికల గురించి కాక మన చర్చల తీరుతెన్నుల గురించే ఎక్కువగా చెప్తున్నాయి. ముందుగా కాశ్మీర్‌పై చైనా తన వైఖరిని మరింత కఠినతరం చేసిందనడానికి ఇటీవలికాలంలో ఆ దేశ చర్యలే నిదర్శనాలనే వాదనను పరిశీలిద్దాం. కాశ్మీర్‌పై చైనా వైఖరి మూడు భిన్నమైన దశల్లో అవిష్కృతమైంది. 1950 దశకంలో చైనీయులు కాశ్మీర విషయంలో చాలావరకు తటస్థ వైఖరినే అవలంబించారు. భారత్‌తో పరిష్కారం కుదుర్చుకోవలసిందిగా తమ అంతర్గత సంభాషణల్లో చైనా పాకిస్తాన్‌కు సూచిస్తూ వచ్చినట్లు చైనా గతానికి సంబంధించి ఇప్పుడు వెల్లడైన సాక్ష్యాలను బట్టి తెలుస్తోంది. అయితే భారత-చైనా సంబంధాలు దిగజారడం ప్రారంభం కావడంతో పరిస్థితిలో కూడా మార్పు రాసాగింది. 1963నుంచి తర్వాతి మూడు దశాబ్దాల కాలంలో పాకిస్తాన్ ప్లైబిసైట్- ప్రజాభిప్రాయ సేకరణ- డిమాండ్‌ను సమర్థించే దిశగా చైనావిధానం మారిపోయింది. అయితే 1990 దశకం ప్రారంభంనుంచి భారత్‌తో చైనా సంబంధాలు మెరుగుపడ్డం చైనీయులు మరోసారి తమ వైఖరిని మార్చుకోవడానికి దారి తీసింది. కాశ్మీర భారత, పాకిస్తాన్‌లే పరిష్కరించుకోవలసిన దై్వపాక్షిక సమస్య అని వారు ఇప్పుడు అంటున్నారు. ఈ వైఖరి ఈ విషయంలో చైనా వైఖరి భారత వైఖరికి దగ్గరగా ఉంది కూడా.
మన విధానమే లోపాలమయం!
తూర్పు ఆసియా విషయంలో చైనా వైఖరి అనే తాజా ఉదాహరణనే చూడండి. ఏడాది క్రితం దాకా కూడా తూర్పు ఆసియాలోని చిన్న దేశాలు చైనా శాంతియుత ప్రగతినిచూసి దాని అభిమానులుగా ఉండేవి. అయితే గత ఏడాది కాలంగా చైనా ఆధిపత్య ధోరణి కారణంగా ఈ ప్రాంతంలోని పలు చిన్న దేశాలు చైనా విషయంలో తమ వైఖరిని మార్చుకున్నాయి. చినావాలోని అమెరికా సైనిక స్థావరాన్ని కొనసాగించాలన్న దాని నిర్ణయం, అమెరికా-దక్షిణ కొరియా సంబంధాలు బలోపేతం కావడం, దక్షిణ చైనా సముద్రంలో అమెరికా-వియత్నాం నౌకాదళ విన్యాసాలు-వీటిలో ఏ ఒక్కటి కూడా చైనా ప్రయోజనాలకు ఉపయోగపడేవి కాదు సరికదా, అనేక అంశాల విషయంలో చైనా వైఖరిపై ప్రభావాన్ని చూపించేవనే మాట నిజం. దీంతో తూర్పు ఆసియాలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆ దేశం ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చే దేశంగా కూడా మారే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల చైనా వేసే ప్రతి అడుగులోనూ దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుందేమోనని అనుకోవలసిన అవసరం లేదు.
రెండో వాదన ఏమిటంటే చుట్టూ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం ద్వారా భారత్‌ను సమస్యలకు బందీగాచేసి ఊపిరాడకుండా చేయడానికి చైనా ప్రయత్నిస్తోందనే వాదన. మన పొరుగు దేశాల్లో చైనా నిర్మిస్తున్న లెక్కలేనన్ని నౌకాశ్రయాలను ఈ వాదనకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. ఈ వాణిజ్య కార్యకలాపాల వెనుక సైనిక పరమైన పరిణామాలు ఉండవచ్చని అనుకోలేము. అంతకన్నా మించి మనం కూడా ఇలాంటి ప్రాజెక్టులను ఎందుకు చేపట్టలేకపోతున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. దీనికి సమాధానం చాలా సులభం. భారత దేశంలో మిగతా దేశాలతో పోటీ పడగల ప్రపంచస్థాయి నౌకా నిర్మాణ పరిశ్రమ ఇప్పటికి కూడా అభివృద్ధి చెందలేదు. మన పొరుగుదేశాల్లోకి చొచ్చుకుపోతున్న చైనాను చూసి భయ పడే బదులు మనం మన సామర్థా్యలలోని లోటుపాట్లవైపు దృష్టి పెట్టడం మంచిది.
మూడో వాదన చైనా ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద సరిహద్దు విషయంలో భారత్‌తో ఒప్పందాన్ని చేసుకోవడానికి ముందుకు రావడం లేదని మనలో బలంగా నాటుకు పోయిన భావన. ఇది పూర్తిగా చరిత్రను ఒక వైపునుంచి చూడడం మాత్రమేనని చెప్పాలి. 1962 తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు చైనాలాగానే భారత దేశం కూడా చర్చలను ప్రారంభించే విషయంలో ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కూడా అత్యంత సున్నితమైన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అర్థవంతమైన ప్రణాళికపై చర్చించడానికి ముందుకు రాకుండా వాస్తవాధీన రేఖపై వివరణ ఇవ్వడానికి ప్రత్యామ్నాయ చర్చల కోసం మాత్రమే మన దేశం పట్టుబడుతూ వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా చైనా ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూ ఉందన్న మాట నిజమే. అయితే ఏ చర్చల్లోనైనా ఇలాంటివి జరగడం సహజమే. చైనా వివాదాలు పరిష్కరించుకోని ఏకైక దేశం భారత మాత్రమేనని వాదించడానికి బదులు భారత మాత్రమే చైనాతో వివాదాలను ఎందుకు పరిష్కరించుకోలేక పోతోందనే విషయాన్ని ఆలోచిస్తే మనకు కొంత ప్రయోజనం ఉంటుంది. స్వాతిశయ భావాన్ని తొలగించుకోవాలి. అది ఎంతటివారినైనా తప్పుదారి పట్టిస్తుంది అని ప్రముఖ వూ్యహాత్మక విశ్లేషకుడు బాసిల లిడ్డెలి చెప్పిన మాటలు మన చైనా విశ్లేషకులకు బాగా సరిపోతుంది.
ఈ మూడు భావాలను కలిపి చూసినట్లయితే చైనా విషయంలో మన ఆలోచనలు తప్పు అనే విషయం స్పష్టమవుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన విషయం. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాలనేవి క్రియ-ప్రతిక్రియల క్రీడ లాంటివి. ఇతర దేశాల పట్ల మన వైఖరులు ఒక్కోసారి ఆ దేశాల ప్రవర్తనలపై ప్రభావం చూపిస్తుంటాయి. మనం జాగ్రత్తగా ఉండని పక్షంలో చైనా బూచి అనేది ఆత్మ వంచనకు ప్రతీకగా మారిపోతుంది.

No comments:
Post a Comment